• తాజా వార్తలు

స్కూల్ విద్యార్థులకు ఎలక్ట్రానిక్ సేఫ్టీ ట్రాకర్ ను రూపొందించిన IIT ఖరగ్ పూర్

మీరు మీ పిల్లలలను స్కూల్ కి ఎలా పంపిస్తారు? స్కూల్  బస్సు లోనే కదా! అయితే ఏం  పర్వాలేదు. ఎందుకంటే మనదేశం లో చాలా మంది విద్యార్థులు స్కూల్ బస్సు లలో కాక ఆటో లు, రిక్షా ల లాంటి ప్రైవేటు వాహనాల లో స్కూల్ కి వెళ్తుంటారు. అయతే అది ఎంతవరకూ భద్రమైనది అంటే మాత్రం మనం సమాధానమ చెప్పలేని పరిస్థితి. ఆ మాటకొస్తే స్కూల్ బస్సు లు కూడా ఎంత వరకూ భద్రం గా ఉత్నున్నాయో ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చుస్తే మనకు అర్థం అవుతుంది. సరే అదంతా వేరే విషయం. స్కూల్ కి వెళ్ళిన పిల్లలు సురక్షితంగా వెళ్ళారా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఐఐటి ఖరగ్ పూర్ విద్యార్థులు ఒక సరికొత్త సిస్టం ను కనిపెట్టారు. అదే RFID. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్.

ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది?

RFID అంటే ఏదైనా ఒక వస్తువు మీద ఉంచిన సమాచారాన్ని రేడియో తరంగాల ను ఉపయోగించి చదవగలిగిన ఒక వ్యవస్థ. దీనిలో ఒక టాగ్ లేదా లేబుల్ మరియు రీడర్ ఉంటాయి.

విద్యార్థులు యొక్క ఐడి కార్డులు ఈ RFID తో టాగ్ చేయబడి ఉంటాయి. బస్సు లో ఒక RFID రీడర్ ఉంటుంది. బస్సులకు అతి తక్కువ ఖర్చుతో పనిచేసే GPS ను అమర్చుతారు. ఒక విద్యార్థి బస్సు లోనికి ప్రవేశించగానే బస్సు లో ఉన్న రీడర్ విద్యార్థి యొక్క సమాచారాన్ని చదివి ఆ విద్యార్థి బస్సు లోనికి ఎక్కినట్లు తలిదండ్రులకు మెసేజ్ పంపుతుంది. అంతేగాక బస్సు కు ఉన్న GPS ద్వారా ఆ బస్సు ఎ ప్రదేశం లో ఉన్నదీ కూడా తలిదండ్రులు యిట్టె తెలిసిపోతుంది. అంతేగాక విద్యార్థి బస్సు దిగినపుడు కూడా ఆ విద్యార్థి ఎక్కడ, ఎప్పుడు బస్సు నుండి దిగిందీ తలిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది.

ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన వలన బస్సు చాలా సేపు ఆగినట్లయితే వెంటనే పోలీసులకు కూడా ఈ RFID అలెర్ట్ లను పంపిస్తుంది. ఆహా అద్భుతం కదా!

ఖరగ్ పూర్ లోని సౌత్ పాయింట్ స్కూల్ లో మొదట ప్రయోయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ఇది విజయవంతం అయితే ఈ వ్యవస్థను దేశం మొత్తం అoదుబాటులోనికి తేనున్నారు. దీనికోసం వీరు సుమారు 7000 మంది తలిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరించారు.

జన రంజకమైన వార్తలు