• తాజా వార్తలు
  •  

18:9 డిస్‌ప్లే ఫోన్లు మ‌న జీవితాల్లో తేనున్న మార్పులు మంచికేనా?

స్మార్ట్‌ఫోన్లు కొనేట‌ప్పుడు అంద‌రూ చూసే స్పెసిఫికేష‌న్ల‌లో డిస్‌ప్లే ఒక‌టి. ఒక‌ప్పుడు 5 అంగుళాల డిస్‌ప్లే ఉంటేనే అబ్బో అనేవాళ్లు. ఇప్పుడు అది కాస్త 5.5 అంగుళాలు..  వ‌ర‌కు వెళ్లిపోయింది.  రాబోయే జ‌న‌రేష‌న్ ఫోన్లు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. విధ్వంస‌క ఆవిష్క‌ర‌ణ‌లు జ‌ర‌గ‌బోతున్నాయి డిస్‌ప్లేలో. త్వ‌ర‌లో రాబోతున్న 18:9 రేషియో స్క్రీన్లు ఈ కోవ‌కు చెందిన‌వే. ఇప్పుడు ప్ర‌తి మాన్యుఫాక్చ‌ర్ ఈ రే షియోలో ఫోన్ల‌ను త‌యారు చేయ‌డంపై దృష్టి పెట్టారు. మ‌రి ఫోన్ల‌లో వ‌చ్చిన ఈ మార్పులు మంచికేనా?

పెద్ద డిస్‌ప్లే.. చిన్న సైజు
ప్ర‌స్తుతం రాబోతున్న 18:9  రేషియా ఫోన్ల‌లో డిస్ ప్లే పెద్ద‌గా ఉంటుంది. అంటే పెద్ద డిస్‌ప్లేతో చిన్న ఆకారంతో త‌యారు కానున్నాయి ఈ ఫోన్లు. అంటే ఈ ఫోన్లు 6 అంగుళాల డిస్‌ప్లేతో అతి పెద్ద‌గా త‌యారు కానున్నాయి. 5.5 అంగుళాల ఫోన్లు 16:9 యాస్పెక్ట్‌తో త‌యార‌వుతున్నాయి. అదే 6 అంగుళాల ఫోన్లు 18:9 యాస్పెక్ట్‌తో రాబోతున్నాయి. అంటే ఫోన్లు చిన్న‌విగా ఉన్నా.. వాటి డిస్‌ప్లే మాత్రం పెద్ద‌దివి రాబోతున్నాయి.

మెరుగైన మ‌ల్టీట‌స్కింగ్ 
ఫోన్ల సైజు చిన్న‌విగా ఉంటే మ‌నం  ఒకే ప‌నిని మాత్ర‌మే చేసే అవ‌కాశం ఉంటుంది. కానీ అయితే డిస్‌ప్లే సైజు చిన్న‌విగా ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.0తో వ‌స్తున్న ఫోన్లలో స్ల్పిట్ స్క్రీన్ మోడ్ ఆప్ష‌న్ ఉంది. దీని వ‌ల్ల ఒకేసారి మీరు రెండు మూడు ప‌నులు చేసుకోవ‌చ్చు. అంటే మీరు ఒక‌వైపు వాట్స‌ప్‌లో చాట్ చేస్తూనే మ‌రో యాప్ ఓపెన్ చేసి సినిమా టిక్కెట్లు బుక్ చేయ‌చ్చు. లేదా పాట‌లు వినొచ్చు. ఇలా ఒకేసారి రెండు మూడు విండోలు ఓపెన్ చేసే అవ‌కాశం దీనిలో ఉంటుంది. 

కంటెంట్ కంజెంప్ష‌న్‌
సాధార‌ణంగా ఏ స్మార్ట్‌ఫోన్లో అయినా మీకు యాప్‌లు నిలువుగానే ఉంటాయి. ఎందుకంటే మ‌న‌కు డిస్‌ప్లేలో అన్ని యాప్‌లు ప‌ట్ట‌వు కాబ‌ట్టి. అయితే 18:9 యాస్పెక్ట్ ఫోన్ల‌లో ఈ ఇబ్బంది ఉండ‌దు. మ‌న‌కు ఎన్ని కావాలంటే అన్ని యాప్‌లు అడ్డంగా  స్టోర్ చేసుకునే అవ‌కాశం ఉంది. అంటే ఒకే ఫ్రేమ్‌లో  మీరు ఎక్కువ కంటెంట్ చూసే ఛాన్స్ ఉంది. లేక‌పోతే యాప్‌ల‌ను వెతుక్కోవ‌డానికి మీరు స్క్రోల్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. కానీ తాజా మార్పుల‌తో ఆ ఇబ్బంది ఉండ‌దు.

వ‌ర్చువ‌ల్ రియాల్టీ
18:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేతో ఉన్న మ‌రో గొప్ప ఉప‌యోగం ఏంటంటే వ‌ర్చువ‌ల్ రియాల్టీ హెడ్‌సెట్స్‌కు క‌చ్చితంగా ఉప‌యోగ‌ప‌డ‌డం. అన్ని స్మార్ట్‌ఫోన్ల‌లో ఈ ఆప్ష‌న్ ఉండ‌దు. వీఆర్‌తో మీరు వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు స్క్రీన్ డిస్‌ప్లే రెండుగా విడిపోతుంది. మీకు సుపీరియ‌ర్ వీఆర్ అనుభ‌వం కోసం 18:9 యాస్పెక్ట్ డిస్‌ప్లే వాడ‌డ‌మే ఉత్త‌మం.  అంతేకాదు ఒకేసారి ఎక్కువ కంటెంట్‌ను కూడా చూపిస్తుందిది.

జన రంజకమైన వార్తలు