• తాజా వార్తలు
  •  

మార్కెట్లో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏమిటి? 

నోకియా ఫీచ‌ర్ ఫోన్ల‌లో స్నేక్‌గేమ్ ఎంత పాపుల‌రో మ‌నంద‌రికీ తెలుసు.. ఫీచ‌ర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారిన త‌ర్వాత గేమింగ్ ల‌వ‌ర్స్‌కు బోల్డన్ని ఆప్ష‌న్స్ వ‌చ్చేశాయి. టెంపుల్‌ర‌న్ లాంటి యాక్ష‌న్ గేమ్స్‌, క్యాండీ క్ర‌ష్ లాంటి సాఫ్ట్ గేమ్స్‌ను అయితే అంద‌రూ వాడేశారు.  ఇక ఫోన్ చేతికిస్తే గేమ్ స్టార్ట్ చేసే చిన్న‌పిల్ల‌లు, గేమింగ్ ల‌వ‌ర్స్‌కి ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ఏ స్మార్ట్‌ఫోన్లు మ్యాచ్ అవుతాయో ఓ లుక్కేద్దాం ప‌దండి.  
గేమింగ్ ఫోన్ల‌కు ఉండాల్సిన‌వేంటి? 
గేమింగ్ ఆడాలంటే స్మార్ట్‌ఫోన్‌లో హైక్వాలిటీ పిక్సెల్ కెమెరా, ఎక్స్‌లెంట్ బ్యాట‌రీ లైఫ్‌, మంచి స్పీక‌ర్లు, క్రిస్ట‌ల్ క్లియ‌ర్ స్పీక‌ర్‌, ప‌వ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్ ఉండాలి. 

1.శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 
గేమర్స్ త‌ప్పనిస‌రిగా కొనుక్కోవాల్సిన ఫోన్ ఇది. ఎందుకంటే  గేమింగ్‌కు మార్కెట్లో ఉన్న ద బెస్ట్ ఫోన్ ఇదే. 1440 x 2960  పిక్సెల్స్ సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే దీనికి మెయిన్ హైలెట్‌. కెమెరా, ప్రాసెస‌ర్‌, బ్యాట‌రీ బ్యాక‌ప్‌, స్పీక‌ర్స్ .. గేమింగ్ ఫోన్‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీపర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇది. ధ‌ర భారీగానే ఉన్నా 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజి స్పేస్ ఉన్న ఈ ఫోన్ గేమింగ్‌లో తిరుగులేని ఆప్ష‌న్‌. 
2. హెచ్‌టీసీ 10 
తైవాన్ మొబైల్ కంపెనీ హెచ్‌టీసీకి మంచి క్వాలిటీ ఫోన్లు త‌యారుచేస్తుంద‌న్న పేరుంది. దీని నుంచి వ‌చ్చిన హెచ్‌టీసీ 10 గేమింగ్ ఫోన్ల‌లో మంచి ఛాయిస్‌. స్నాప్‌డ్రాగ‌న్ 820 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్ స‌పోర్ట్‌తో సూప‌ర్ గేమింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ పొంద‌వ‌చ్చు. స్క్రీన్ సైజ్ చిన్న‌దే అయినా హై రిజ‌ల్యూష‌న్‌తో అమేజింగ్ ట‌చ్ రెస్పాన్సివ్‌తో ఉండ‌డంతో గేమ‌ర్స బాగా ఇష్ట‌ప‌డ‌తారు.  యాప్ మేనేజ్‌మెంట్ సిస్టం స్మూత్ ఆప‌రేష‌న్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్పీక‌ర్స్ అమేజింగ్ ఆడియో క్వాలిటీని ఇస్తాయి.
3.మోటో ఎక్స్‌ఫోర్స్ 
స్నాప్‌డ్రాగ‌న్ చిప్‌సెట్‌, 3 జీబీ ర్యామ్‌తో వ‌చ్చిన మోటో ఎక్స్‌ఫోర్స్ ఈ లిస్ట్‌లో మూడో ప్లేస్‌లో ఉంది.  ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ స్మూత్‌, ప్లెజంట్ గేమింగ్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. 5.4 ఇంచెస్ స్క్రీన్ బాగున్నా మ‌ల్టిపుల్ ప్లేయ‌ర్స్ గేమ్స్ ఆడేవారికి ఇది కొద్దిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది.  మంచి బ్యాట‌రీ బ్యాక‌ప్ దీనికి బ‌లం. ఆన్‌లైన్ సైట్ల‌లో 15వేల నుంచి దొరుకుతుంది.  
4.హువావే నెక్స‌స్ 6పీ 
ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లలో ఇదికూడా ఉంది.  రియ‌ర్ కెమెరా నిరాశ‌ప‌రుస్తుంది. అది త‌ప్ప మిగిలిన గేమింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లో యాపిల్ ఐఫోన్ 7 ప్ల‌స్‌తో పోటీప‌డ‌ద‌గ్గ ల‌క్ష‌ణాలన్నాయ‌న్నీ హువావే నెక్స‌స్ 6పీలో ఉన్నాయి. త‌క్కువ ధ‌ర (రూ.25వేల‌)లో మంచి గేమింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ కావాల‌నుకునేవారికి బెస్ట్ ఛాయిస్‌.
5. ఐఫోన్ 7 ప్ల‌స్ 
ఐఫోన్ 8, టెన్ వ‌చ్చినా కూడా ఈ విష‌యంలో ఐఫోన్ 7 ప్ల‌స్ బెస్ట్ ఆప్ష‌న్‌. దీని క్వాడ్‌కోర్ సీపీయూ ఫాస్ట్, రెస్పాన్సివ్ గేమింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది.  1080 x 1920p ఎల్‌సీడీ డిస్‌ప్లే గేమ‌ర్స్‌కు మంచి క్లిక్ ఇస్తుంది. ఇక దీనిలో 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజి స్పేస్ ఎన్ని గేమ్‌ల‌న‌యినా డౌన్‌లోడ్ చేసుకుని ఆడుకునే ఫెసిలిటీ ఇస్తుంది.  


 

జన రంజకమైన వార్తలు