• తాజా వార్తలు

ప్ర‌స్తుతం భార‌త్‌లో టాప్‌-5 సెల్లింగ్ టీవీలు ఇవే..

టీవీ.. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ప‌ర్యాయ‌ప‌దం. ఇంట‌ర్నెట్ యుగానికి ముందు టీవీల‌దే రాజ్యం. ఇప్పుడ వీటి హ‌వా త‌గ్గినా.. ప్రాముఖ్య‌త మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ముఖ్యంగా భార‌త్‌లో లాంటి దేశంలో టీవీలు ప్ర‌తి ఇంట్లో ఉండే గృహోప‌క‌ర‌ణాల్లో ఒక‌టి.  మ‌రి ప్ర‌స్తుతం భార‌త్‌లో టాప్‌-5 సెల్లింగ్ స్మార్ట్ టీవీలు ఏంటో చూద్దామా..

శాంసంగ్ క‌ర్వ్‌డ్ క్యూఎల్ఈడీ సిరీస్‌
మొబైల్స్ రంగంలోనే కాదు టీవీల్లోనూ భార‌త్‌లో శాంసంగ్‌ది అగ్ర‌స్థాన‌మే.  ఈ బ్రాండ్‌లో శాంసంగ్ క‌ర్వ‌డ్ క్యూఎల్ఈడీ సిరీస్ టీవీలు ఎక్కువ‌గా అమ్ముడుపోతున్నాయి. 2017 మేలో లాంఛ్ అయిన ఈ కొత్త మోడ‌ల్ వినియోగ‌దారుల‌ను బాగా ఆక‌ర్షిస్తోంది. క్వాంటామ్ డాట్ టెక్నాల‌జీతో త‌యారైన ఈ టీవీల ధ‌ర రూ.3,44,900.  ఈ 55 అంగుళాల ఆల్ట్రా మోడ‌ల్ 4 కే క‌ర్వ‌డ్ డిస్‌ప్లే టీవీలో రిజ‌ల్యూషన్ కూడా గొప్ప‌గా ఉంటుంది. హెచ్‌డీఆర్ వీడియో కేప‌బిలిటీస్‌, మైక్రో డిమింగ్, వీడియో ప్లేయ‌ర్ లాంటి ఆప్ష‌న్లు ఉన్నాయి. వాల్యుమ్ కోసం 4 స్పీక‌ర్లు కూడా ఉన్నాయి. 

సోని బ్రావియా ఓఎల్ఈడీ కేడీ 55ఏ1
పిక్చ‌ర్ క్వాలిటీకి సోని పెట్టింది పేరు. అందుకే టీవీల విష‌యానికి వ‌చ్చేస‌రికే ఎక్కువ‌మంది సోని బ్రాండ్ మీదే దృష్టి పెడ‌తారు. ఈ కంపెనీ నుంచి వ‌చ్చిన బ్రావియా ఓఎల్ఈడీ కేడీ 55ఏ1 ఇప్పుడు అంద‌రిని ఆక‌ర్షిస్తోంది. 55 అంగుళాల తెర‌తో పాటు రిచ్ సౌండ్ స‌పోర్టింగ్‌, ఆల్ట్రా హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌, రియ‌ల్‌టైమ్ ఇమేజ్ ప్రాసెసింగ్‌. 4 హెచ్‌డీంఐ పోర్ట్స్‌, 3 యూఎస్‌బీ పోర్టులు, 1 ఆర్ ఎఫ్ క‌నెక్ష‌న్ ఇన్‌పుట్ దీనిలో ఫీచ‌ర్లు. ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్ వెర్ష‌న్‌ను దీనిలో ర‌న్ చేయ‌చ్చు.  దీని ధ‌ర రూ.4,65,900.

ఎల్‌జీ ఎల్ఈడీ 55యూహెచ్‌850టీ
ఎల్‌జీ కూడా టీవీల విష‌యంలో ముందంజలోనే ఉంటుంది. గ‌తంలో స్మార్ట్ టీవీల విష‌యంలో ఇబ్బందిప‌డిన ఎల్‌జీ ఇప్పుడు ఫామ్‌లోకి వ‌చ్చింది. ఎల్ఈడీ 55యూహెచ్‌850టీ అనే మోడ‌ల్‌తో రంగంలోకి దిగింది. 55 అంగుళాల స్క్రీన్‌తో ఉన్న ఈ టీవీలో ఆల్ట్రా డిస్‌ప్లేతో అదిరిపోతోంది. 3 యూఎస్‌బీ పోర్టులు, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు దీనిలో ఉన్నాయి. రిమోట్ కంట్రోల్‌, 2, 3 డీ గ్లాసెస్ కూడా ఈ టీవీతో పాటు వ‌స్తాయి. 3డీ జూమింగ్ కూడా మ‌రో ఆప్ష‌న్‌. బ‌రువు 19.2 కేజీలు, ధ‌ర రూ.1,55,990

పాన‌సోనిక్ టీహెచ్ 55డీఎక్స్‌650డీ
పాన‌సోనిక్ అందిస్తున్న ఈ టీవీ ధ‌ర రూ.1,29,999. ధ‌ర‌కు త‌గ్గ‌ట్టే మంచి ఫీచ‌ర్లు దీనిలో ఉన్నాయి. 55 అంగుళాల తెర‌, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్స్‌, 2 యూఎస్‌బీ పోర్టులుతో పాటు బిల్ట్ ఇన్ వైఫై, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఒక ఏడాది డొమెస్టిక్ వారెంటీ ఉంది.  రిమోట్ కంట్రోల్‌, ప‌వ‌ర్ కేబుల్‌, యూజ‌ర్ మాన్యువ‌ల్‌, వారెంటీ కార్డు, బ్యాట‌రీలు ఇవ‌న్నీ టీవీతో పాటు వ‌స్తాయి.

వుయ్ 50 అంగుళాల ఎల్ఈడీ టీవీ
వుయ్ కంపెనీ నుంచి వ‌చ్చిన టీవీల్లో ఇది చౌవ‌కైన‌ది. 50 అంగుళాల ఈ టీవీలో 4 కే రిజ‌ల్యూష‌న్ ఉంది. ఆల్ట్రా హై డెఫినేషిన్ ప్యాన‌ల్‌, ఓఎస్‌డీ ట్రాన్స‌పెరెన్సీ కంట్రోల్‌, 1:1 పిక్స‌ల్ మ్యాపింగ్ లాంటి ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి. దీని ధ‌ర కేవ‌లం 50,999. స్మార్ట్ టీవీల్లో ఇదే త‌క్కువ ధ‌ర‌కు ల‌భించే టీవీగా పేరు పొందింది. 

జన రంజకమైన వార్తలు