• తాజా వార్తలు

ఫొటోల‌ను అద్భుతంగా బంధించే గూగుల్ క్లిప్స్‌

మ‌న చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా.. లేక కెమెరా ఉన్నా వ‌రుస‌గా ఫొటోలు తీస్తూనే ఉంటాం. బెస్ట్ ఫొటోలు వ‌చ్చే వ‌ర‌కు అలా ఫొటోలు తీస్తూనే పోతాం. కానీ వంద ఫొటోలు తీసినా అందులో మ‌నకు సంతృప్తినిచ్చేవి ప‌ది కూడా ఉండ‌వేమో! మ‌రి మ‌న బెస్ట్ మూమెంట్స్ కాప్చ‌ర్ చేయాలంటే ఎలా?.. మ‌నకు తెలియకుండా మ‌న స‌హ‌జ‌మైన మూమెంట్స్‌ను బంధించేలా చేయ‌డం ఎలా?.. దీనికో టెక్నాల‌జీ వ‌చ్చేసింది.  సాంకేతిక‌త‌లో ముందుండే గూగుల్ దీన్ని డెవ‌ల‌ప్ చేసింది అదే గూగుల్ క్లిప్స్ కెమెరా. మార్కెట్లోకి కొత్త‌గా వ‌చ్చిన ఈ టెక్నాల‌జీ ప్ర‌త్యేక‌త ఏంటంటే మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న‌కు సంబంధించిన ప్ర‌త్యేక‌మైన అద్భుత‌మైన ఫొటోల‌ను బంధించ‌డం. మ‌రి ఈ క్లిప్స్ కెమెరా ఎలా ప‌ని చేస్తుందో చూద్దామా..

ఇమేజ్‌ల‌తో పాటు వీడియోలు కూడా..
క్లిప్స్.. ఇది నిజంగా ఒక అద్భుత‌మైన ప్రొడ‌క్టే. ఎందుకంటే స‌హ‌జ‌త్వాన్ని కోరుకునే వారికి.. ద బెస్ట్ పిక్చ‌ర్స్ కావాల‌ని ఆశించే వారికి ఈ క్లిప్స్ గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ క్లిప్స్ కెమెరాను లివింగ్ రూమ్‌లో ఫిక్స్ చేస్తే చాలు. మీకు సంబంధించిన ప్ర‌తి మూమెంట్‌ను ఇది కాప్చ‌ర్ చేస్తుంది. మూడు గంట‌ల పాటు వీడియోల‌ను, ఇమేజ్‌ల‌ను బంధించే క్లిప్స్‌.. ఆ త‌ర్వాత వాటిలో ఉత్త‌మ‌మైన వీడియోల‌ను, ఫొటోల‌ను యాప్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు అందిస్తుంది. అంతేకాదు తేదీల వారీగా మీరు ఆ వీడియోలు, ఇమేజ్‌ల‌ను సేక‌రించొచ్చు.  దీన్ని క్లౌడ్‌తో క‌నెక్ట్ చేసుకుంటే చాలు మీ ఫొటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా సేవ్ అయిపోతాయి. 


సింపుల్‌, యూజ్‌ఫుల్‌
గూగుల్ క్లిప్స్ డివైజ్‌ను ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం.. ఎంతో ఉప‌యోగ‌క‌రం కూడా. బెస్ట్ క్వాలిటీ ఫొటోల‌ను, వీడియోను ఆశించే వారికి ఇదో గొప్ప ఆప్ష‌న్‌. దీన్ని మీకు అవ‌స‌ర‌మైన చోట ఫిక్స్ చేసి కెమెరా దిగువ‌న ఉండే బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే చాలు క్లిప్స్ దాని ప‌ని అది చేసుకుంటూ పోతుంటుంది.  కొన్ని గంట‌ల త‌ర్వాత మీకో సిగ్న‌ల్స్ కూడా పంపిస్తుంది. అప్పుడు మీరు ఫొటోల‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఫొటోలు సేవ్ అయిన త‌ర్వాత ఆ డేటాను డిలీట్ చేసుకోవ‌చ్చు. దీనికి ఉండే వైడ్ యాంగిల్ వ్యూ వల్ల గ‌దిలో ఏ మూల మనం ఉన్నా ఇది కాప్చ‌ర్ చేస్తుంది. రియ‌ల్ టైమ్‌తో పాటు స్లో మోష‌న్ వెర్ష‌న్‌లోనూ మూమెంట్స్ క్యాచ్ చేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. కానీ దీని ధ‌ర కాస్త ఎక్కువే. ప్ర‌స్తుతానికి ఇది 249 డాల‌ర్లు ప‌లుకుతోంది.

 

జన రంజకమైన వార్తలు