• తాజా వార్తలు

జియో ఫోన్ ప్రీ బుకింగ్ మొదలు - మరచిపోకూడని వాస్తవాలు

రిలయన్స్ యొక్క సంచలనాత్మక ఉత్పాదన అయిన జియో ఫీచర్ ఫోన్ ను ప్రీ బుకింగ్ చేసుకునే రోజు దగ్గర పడుతూ ఉంది.రిలయన్స్ జియో యొక్క చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ తమ వార్షిక సమావేశం లో వెల్లడించిన దాని ప్రకారం జియో ఫీచర్ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్ లేదా ప్రీ ఆర్డర్ అనేది ఆగష్టు 24 నుండీ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్ ల లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ యొక్క టెస్టింగ్ అనేది రేపటి నుండీ ప్రారంభం కానుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే కొందరు ఆఫ్ లైన్ రిటైలర్ లు జియో ఫోన్ కు ప్రీ ఆర్డర్ లు తీసుకోవడం మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యం లో జియో ఫోన్ ప్రీ బుకింగ్ చేసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

మొదటగా కావలసింది ఆధార్ కార్డు

భారత టెలికాం మార్కెట్ కు జియో పరిచయం చేసిన ఒక సరికొత్త విధానం eKyc యాక్టివేషన్. దీనివలన మీ సిమ్ కార్డు కేవలం 15 నిమిషాలలోనే యాక్టివేట్ అవుతుంది. జియో సిమ్ కు మాదిరిగానే జియో ఫీచర్ ఫోన్ ప్రీ బుకింగ్ కు కూడా ప్రూఫ్ గా ఆదార్ కార్డు ను సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక ఆదార్ కార్డు కు ఒక ఫోన్ మాత్రమే బుక్ చేయబడుతుంది. అంటే ఒక వ్యక్తికి ఒక ఫోన్ మాత్రమే ఇవ్వబడుతుంది. అదే సిమ్ కార్డు అయితే ఒక ఆదార్ కార్డు పై 50 సిమ్ ల వరకూ పొందే అవకాశం ఉండేది కదా.

ప్రతీ కస్టమర్ కూ ఒక టోకెన్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీ ఫోన్ ను డెలివరీ తీసుకునే టపుడు ఆ టోకెన్ నెంబర్ ను చూపించవలసి ఉంటుంది.

ముందుగా బుక్ చేసుకున్న వారికే ముందు డెలివరీ

ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఎవరు ముందుగా ఆర్డర్ చేస్తే వారికి ముందుగా డెలివరీ ఇవ్వబడుతుంది. అంటే మేరు మిగతా వారికంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. మెట్రోపోలిటన్ సిటీ లలో ఉండేవారు మొబైల్ స్టోర్ లలో బుక్ చేసుకోవడం ఉత్తమం.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెక్యూరిటీ డిపాజిట్ అయిన రూ 1500 /- లను ముందుగా చెల్లించవలసిన అవసరం లేదు. మీ ఫోన్ డెలివరీ తీసుకున్నాక మీరు ఆ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది.

డెలివరీ డేట్ ఏది ?

మనకు అందుతున్న సమాచారం ప్రకారం అందరికంటే ముందు ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 1 మరియు 4 వ తేదీల మధ్య ఫోన్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ప్రతీ వారం 50 లక్షల ఫోన్ లను అమ్మాలని జియో టార్గెట్ గా పెట్టుకుంది.

జన రంజకమైన వార్తలు