ఇంట్లో వైఫై ఉంటే ఖాళీగా ఉంటామా.. కంప్యూటర్లతో పాటు మొబైల్స్, టాబ్లెట్లు,స్మార్ట్ టీవీలకు కూడా వాడేస్తాం. అయితే వైఫై ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మనకు తెలియకుండానే మన డివైజ్‌లలో వైరస్లు ఎంటర్ అవుతాయి. ఇలాంటి ఇబ్బందుల నుంచి కాపాడుకోవడం కోసం సీయూజేవో ఇంటిలిజెంట్ ఫైర్‌వాల్ అనే టెక్నాలజీ వచ్చింది. మీ నెట్‌వర్క్‌కు హాని కలిగించే అన్ని వైరస్ల నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడమే ఫైర్‌వాల్ ప్రత్యేకత.
మాల్వేర్ ప్రొటెక్టర్
ఫైర్‌వాల్ టెక్నాలజీ మీ డివైజ్‌లకు, బయట ప్రపంచానికి అడ్డుగోడగా నిలుస్తోంది. నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసిన మీ డివైజ్‌లను క్షుణ్నంగా చెక్ చేయడం దీని స్పెషాలిటీ. సర్వర్లను చేసి..అందులో ఏమైనా వైరస్ ఉంటే హెచ్చరిస్తుందీ టెక్నాలజీ. ఒకవేళ అలాంటి వైరస్లు ఉంటే వాటిని బ్లాక్ చేసి మనకు సందేశం పంపుతుంది. ఇదేకాక ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో యాప్‌లను కంట్రోల్ చేయడానికి ఈ సీయూజేవో ఫైర్‌వాల్ ఉపయోగపడుతుంది. ఇంతేకాక వెబ్సైట్లను వాటి కేటగిరిని బట్టి విభజించి ఉపయోగపడే వాటినే మనకు అందుబాటులోకి తెస్తుందీ ఈ వైరస్. దీని వల్ల డివైజ్ మీద భారం బాగా తగ్గిపోతుంది.
అదనపు రక్షణ
మన డివైజ్‌లలో యాంటీ వైరస్ వేసుకోవడం చాలా కామన్. అయితే ఫైర్‌వాల్ ఎందుకూ అనే అనుమానం వస్తుంది. అయితే అదనపు రక్షణ కోసం ఈ ఫైర్‌వాల్ ఉపయోగపడుతుంది. మీ వైరస్లు ఎదుర్కోలేని, అడ్డుకోలేని కొన్ని బగ్స్‌ను అడ్డుకుని బ్లాక్ చేస్తుంది ఫైర్‌వాల్. ఇన్ని ఉపయోగాలు ఉన్నఈ సీయూజేవో ఫైర్‌వాల్ ధర 99 డాలర్లు. ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ కావాలంటే రూ.`158 పెట్టి ఈ యాంటీ వైరస్ టెక్నాలజీని కొనుక్కోవాలి.