• తాజా వార్తలు

ముగ్గురు ఒకేసారి వాడే ఫోన్ వ‌చ్చేసింది

మామూలుగా ఫోన్ ఎంత‌మంది వాడ‌తారు? ఏంటి ప్ర‌శ్న అనుకుంటున్నారా? ఒక‌రు మాత్ర‌మే వాడ‌తారు అది కూడా చెప్పాలా అంటారా? ... కానీ ఇక్క‌డున్న ఫోన్‌ను మాత్రం ఒక‌రు కాదు ఏకంగా ముగ్గురు ఒకేసారి వాడేయ‌చ్చ‌ట‌.  కెన‌డాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాల్‌గారీ ప‌రిశోధ‌కులు ఈ కొత్త ఫోన్‌ను రూపొందించారు. ఈ ఫొటోటైప్ మాడ్యుల‌ర్ ఫోన్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. 3డీ ప్రింటెడ్ కేస్‌తో ఉన్న ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ వెర్ష‌న్ కూడా ఉంది. దీనిలో ప్ర‌ధాన ఫోన్ ఒక‌టి ఉంటుంది.. దానికి అనుబంధ ఫోన్లు రెండు ఉంటాయి. ప్ర‌ధాన‌మైన ఫోన్‌గా నెక్స‌స్ 6పీని ఉప‌యోగించారు. ప్ర‌ధాన ఫోన్‌ను మ‌నం వాడుకుంటూనే మ‌రో ఫోన్‌ను వేరే వాళ్ల‌తో షేర్ చేసుకోవ‌చ్చు. 

స్లైడ్ ఫోన్‌..
ప్ర‌ధాన ఫోన్‌తో పాటు అనుబంధంగ‌దా ఉండే ఫోన్లు స్లైడ్ ఫోన్లు వీటిని కావాలంటే మ‌నం వెన‌క్కి జ‌రుపుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ముందుకు  జ‌రుపుకోవ‌చ్చు. మిడ్ సైజ్ ఫోన్‌లు నెక్స‌స్ 4 మోడ‌ల్‌కు సంబంధించిన‌వి.  అంతేకాదు ప్రైమ‌రీ ఫోన్ సాయంతో మిగిలిన రెండు ఫోన్ల యాక్టివిటీని కూడా మ‌నం కంట్రోల్ చేయ‌చ్చు. మెయిన్ ఫోన్ ద్వారానే ఈ రెండు ఫోన్ల‌కు నోటిఫికేష‌న్ల‌ను వ‌చ్చేలా చేయ‌చ్చు. రాకుండా ఆపొచ్చు. అయితే డిజైన్ విష‌యంలో ఇంకా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు త్వ‌ర‌లోనే ఒక మంచి డిజైన్‌తో ఈ ఫోన్ మ‌రింత అందంగా త‌యార‌వుతుంద‌ని రీసెర్చ‌ర్స్ తెలిపారు. 

భ‌విష్య‌త్‌లో అవ‌స‌ర‌మే!
మ‌నం ఎందుకు మూడు ఫోన్లు మోసుకు వెళ్లాలి? ఈ ప్ర‌శ్నే రీసెర్చ‌ర్ల‌ను అడిగితే వాళ్లు చెప్పే స‌మాధానం కూడా అవును నిజ‌మే అనిపిస్తుంది. ఇప్పుడే పిల్లలు మ‌న ఫోన్ల‌ను మ‌న‌కు దొర‌క‌నీయ‌ట్లేదు. గేమ్‌ల పేరుతో మ‌న ద‌గ్గ‌ర ఫోన్ లేకుండా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌నం ఫోన్ల‌ను వారికి ఇవ్వ‌డం మాత్ర‌మే కాదు వారి ఫోన్ యాక్టివిటీస్‌ను కంట్రోల్ చేయ‌చ్చు. బ్లూ వేల్ లాంటి ప్ర‌మాద‌క‌ర గేమ్‌ల‌లో ప‌డ‌కుండా కూడా నిరోధించొచ్చు. అందుకే భ‌విష్య‌త్‌లో ఈ త్రి వే ఫోన్ చాలా అవ‌స‌రం అంటున్నారు నిపుణులు. మ‌రి ఈ ఫోన్లు ఎంత వ‌ర‌కు వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తాయో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి. 
 

జన రంజకమైన వార్తలు