స్మార్ట్‌ఫోన్‌లో రోజుకో కొత్త ఫీచర్.. భారీగా పెరుగుతున్న ర్యామ్, రామ్.. దీంతోపాటే విపరీతంగా యాప్స్ వాడకం, గేమింగ్.. ఇవన్నీ బ్యాటరీ బ్యాకప్‌ను ఎఫెక్ట్ చేస్తున్నాయి. నెట్ వాడకంతో బ్యాటరీ బ్యాకప్ చాలా స్పీడ్‌గా పడిపోతుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ర్యామ్, కెమెరా, ప్రాససర్ లాంటి స్పెక్స్తోపాటు బ్యాటరీ బ్యాకప్ గురించి కూడా పట్టించుకోవాల్సి వస్తోంది. 12 నుంచి 17 వేల రూపాయల సెగ్మెంట్లో ఉన్న వాటిలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్లు ఇవీ..
1)షియోమి ఎంఐ మ్యాక్స్ 2 (Xiaomi Mi Max 2)
చైనీస్ మొబైల్ కంపెనీ షియోమి నుంచి లేటెస్ట్గా వచ్చిన ఫ్లాబ్లెట్ ఇది. 6.44 ఇంచెస్ డిస్ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌కు Snapdragon 625 SoC ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ ఉండడంతో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. రియర్ సైడ్‌లో 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 ఎంపీ కెమెరాలున్నాయి. ఆండ్రాయిడ్ నూగట్ ఓఎస్‌తో రన్ అయ్యే ఈ ఫోన్లో బ్యాటరీ ఏకంగా 5,300 ఎంఏహెచ్ ఇచ్చారు.
ప్రైస్: 16,999
2)లెనోవో పీ 2 (Lenovo P2)
లెనోవో తీసుకొచ్చిన ఈ ఫోన్ లోనూ 5,100 ఎంఏహెచ్‌తో భారీ బ్యాటరీ ఉంది. అయితే ఫోన్ చూడడానికి హెవీగా కాకుండా స్మార్ట్‌గానే కనిపిస్తుంది. 5.5 ఇంచెస్ డిస్ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌కు Snapdragon 625 ప్రాసెసర్ ఉండడంతో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 3/ 4 జీబీ ర్యామ్ వేరియంట్స్‌లో దొరుకుతుంది. రియర్ సైడ్‌లో 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ 5 ఎంపీ కెమెరాలున్నాయి.
ప్రైస్: 13,499
3) ఆసుస్ జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ (ASUS ZenFone 3 Max)
తైవాన్ మొబైల్ కంపెనీ ఆసుస్ తీసుకొచ్చిన జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్ కూడా బ్యాటరీ సెంట్రిక్ ఫోన్. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 3జీ నెట్వర్క్ మీద 28 గంటలు టాక్ టైం ఇస్తుంది. వైఫై మీద బ్రౌజ్ చేస్తే 28 గంటలు, 4జీ నెట్వర్క్మీద 34 గంటల స్టాండ్‌బై టైం ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 5.2 ఇంచెస్ డిస్ప్లే, 2.5 డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, MediaTek MT6750 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ దీని స్పెక్స్. రియర్ సైడ్‌లో 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 ఎంపీ కెమెరాలున్నాయి.
ప్రైస్: 12,000
4) జియోనీ ఏ1 (Gionee A1 )
ఎక్స్లెంట్ బ్యాటరీ బ్యాకప్‌కు పేరుగాంచిన జియోనీ తన ఏ1 స్మార్ట్‌ఫోన్‌తో మరో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 4,1010 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఏ1లో 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, Helio P10 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ప్రధానమైన స్పెక్స్. 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ నూగట్ ఓఎస్‌తో రన్ అవుతుంది.
ప్రైస్: 15,000
5) నూబియా ఎన్ 2 (nubia N2)
రకరకాల మోడల్స్‌తో ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న మరో చైనీస్ కంపెనీ నూబియా 5వేల ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో నూబియా ఎన్2ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రెండు రోజులపాటు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. MediaTek MT6750 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ తో రిలీజయిన ఈ ఫోన్‌కు 5.5 ఇంచెస్ హెచ్డీ అమౌల్డ్ డిస్ప్లే ఇచ్చారు. సెల్ఫీల కోసం16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, రియర్ సైడ్‌లో 13 మెగాపిక్సెల్స్ కె మెరాలున్నాయి. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఓఎస్‌తో రన్ అవుతుంది.
ప్రైస్: 15,999