• తాజా వార్తలు
  •  

ఈ డిసెంబ‌ర్లో లాంఛ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..

స్మార్ట్‌ఫోన్లు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తున్న కాల‌మిది.  ఒక‌ప్పుడు ఏడాదిలో ప‌ది ఫోన్లు మార్కెట్లోకి వ‌స్తే చాలా గొప్ప‌గా ఉండేది.  అలాంటిది ఒక్క నెల‌లోనే ప‌ది ఫోన్లు రంగంలోకి దిగుతున్న ప‌రిస్థితి ఇప్పుడుంది. మార్కెట్లో పోటీ.. మారుతున్న ప‌రిస్థితులు.. టెక్నాల‌జీలో శ‌ర‌వేగంగా వ‌స్తున్న మార్పులు ఇవ‌న్నీ క‌లిసి కొత్త ఫోన్ల‌కు అంకురార్ప‌ణ జ‌రుగుతోంది.  ఈ నేప‌థ్యంలో  ఈ డిసెంబ‌ర్‌లో కొన్ని ఫోన్లు మార్కెట్లోకి రావ‌డానికి రంగం  సిద్ధ‌మైంది. మ‌రి ఆ ఫోన్లు ఏమిటో చూద్దామా..

హాన‌ర్ 7 ఎక్స్‌
హాన‌ర్ సిరీస్ నుంచి వ‌స్తున్న మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ఫోన్ ఇది. అక్టోబ‌ర్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ డివైజ్‌ను  హ్యువీయ్ కంపెనీ విడుద‌ల చేసింది. స్పోర్టింగ్ 5.93 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 16 ఎంపీ, 12 ఎంపీ రేర్‌, ఫ్రంట్ కెమెరాల‌తో  ఈ పీస్ అదిరిపోయింది. దీనిలో ఆక్టాకోర్ కిరిన్ 659 ప్రాసెస‌ర్ వాడారు. దీని సామ‌ర్థ్యం 4 జీజీ. ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్  దీనిలో ఉప‌యోగించారు. 3340  ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఇది మ‌రింత ప్ర‌త్యేక‌మూంది. దీని విలువ రూ.13, రూ.17, రూ.20 వేల రేంజ్‌ల‌లో ఉంది.

అస‌స్ పెగాస‌స్ 4ఎస్‌
అస‌స్ కంపెనీ మ‌రో కొత్త ఫోన్‌తో ముందుకొచ్చింది. అదే అస‌స్ పెగాస‌స్ 4ఎస్ మోడ‌ల్‌. 5.7 అంగుళాల హెచ్‌డీ తెర.. మీడియాటెక్ ప్రాసెస‌ర్‌, 1.4 గిగా హెట్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ దీనిలో వాడారు. దీని సామ‌ర్థ్యం  3 జీబీ  ర్యామ్‌. డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ ఉన్న ఈ ఫోన్లో 16 ఎంపీ, 8 ఎంపీ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ నౌగ‌ట్‌, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.17000గా నిర్ణ‌యించారు.

హెచ్‌టీయూ యూ11 లైఫ్‌
ఆండ్రాయిడ్ 8.0 ఒరియో ఓఎస్ ఉప‌యోగించిన ప్ర‌త్యేక‌మైన మోడ‌ల్ ఇది. 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ తెర‌.. స్నాప్‌డ్రాగ‌న్ చిప్‌సెట్ ప్రాసెస‌ర్ ఉన్న ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్ సామ‌ర్థ్యం ఉంది.  దీనిలో ఆనోబోర్డ్ స్టోరేజ్ 32 జీబీ. 16 ఎంపీ రేర్‌, ప్రైమ‌రీ కెమెరాలు ఉండ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త‌.  దీని ధ‌ర కాస్త ఎక్కువే. రూ..27990.

ఒప్పో ఎఫ్‌5 రెడ్ ఎడిష‌న్‌
ఇప్పుడు న‌డుస్తోంది ఒప్పో కాలం. ఎక్కువ‌మంది ఈ ఫోన్ కొనేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.అందుకే ఆ కంపెనీ ఎఫ్‌5 రెడ్ ఎడిష‌న్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ ఉంది ఈ ఫోన్లో. మ‌రో వేరియంట్‌లో 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 7.1 నౌగ‌ట్ ఓఎస్‌తో తయారైన ఈ ఫోన్లో  16 ఎంపీ ప్రైమ‌రీ కెమెరా ఉంది. 20 మెగా పిక్స‌ల్ సెల్పీ షూట‌ర్ దీని స్పెషాలిటీ. 3200 ఎంఏహెచ్ బ్యాట‌రీతో ఫోన్ ఎక్కువ‌సేపు నిలుస్తుంది.                               

ఎల్‌జీ వీ30
ఎల్‌జీ నుంచి వ‌చ్చిన మ‌రో మోడ‌ల్ వీ30. 6 అంగుళాల  క్వాడ్‌కోర్ ఓఎల్ఈడీ  డిస్‌ప్లేతో పాటు డాల్‌బీ విజ‌న్‌, హెచ్‌డీఆర్ 10 స‌పోర్ట్ కూడా దీనికి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసస‌ర్‌తో దీన్ని త‌యారు చేశారు. 4 జీబీ ర్యామ్ సామ‌ర్థ్యం ఉన్న ఈ ఫోన్లో 64 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ ఉంది. 16 ఎంపీ సెన్సార్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ షూట‌ర్ కూడా ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.47,990.

జన రంజకమైన వార్తలు