• తాజా వార్తలు
  •  

సీనియ‌ర్ సిటిజెన్ల కోసం టాప్ మొబైల్ ఫోన్లు ఇవే!

ఒక‌ప్పుడు అంద‌రికి ఒక‌టే ఫోన్‌. ఇప్పుడు బాబుకు ఒక ఫోన్‌.. పాప‌కు ఇంకో ఫోన్‌... నాన్న‌కొక‌టి.. అమ్మ‌కొక‌టి. ఇలా మ‌నుషుల బ‌ట్టి ఫోన్లు మారిపోతున్నాయి. అందులో ఫీచ‌ర్లు మారిపోతున్నాయి. ఒక్కొక్క‌రి అవ‌స‌రాల కొద్ది ఒక్కో ఫోన్ పుట్టుకొచ్చాయి. సెల్ఫీలంటే ఇష్ట‌ప‌డే వారికి కొన్ని ఫోన్లు..  అలాగే  సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం కూడా కొన్ని ఫోన్లు వ‌చ్చేశాయి. మ‌రి అలాంటి వాటిలో టాప్ ఫోన్లు ఏమిటో చూద్దామా..

సీనియ‌ర్ వ‌ర‌ల్డ్ ఈజీవ‌న్ 
సీనియ‌ర్ల కోసం ప్ర‌త్యేక్ం కొన్ని పోన్లు త‌యార‌వుతున్నాయి. సీనియ‌ర్ వ‌ర‌ల్డ్ ఈజీవ‌న్ ఒక‌టి. 2.2 అంగుళాల ఈ స్క్రీన్‌తో పాటు స‌రైన ఎలిజిబుల్ మ్యాచింగ్ కీబోర్డుతో ఈ ఫోన్‌ను త‌యారు చేశారు. పెద్ద రింగ్ టోన్‌లు దీని ప్ర‌త్యేక‌త‌. అంటే పెద్ద‌వాళ్ల‌కు హియ‌రింగ్ ప్రాబ్ల‌మ్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రింగ్ టోన్‌లు లౌడ్‌గా రూపొందించారు. ఇదే కాక కాంటాక్ట్స్‌కు ఫొటోల‌ను అసైన్ చేయ‌డం. దీని వ‌ల్ల ఫొటోల‌ను చూసే వాళ్లు నేరుగా ఫోన్ చేసుకోవ‌చ్చు.  అయితే ఇది ఎనిమిది కాంటాక్ట్‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం. త‌మ‌కు సంబంధించిన ఎనిమిది కీల‌క‌మైన కాంటాక్ట్‌ల‌కు ఫొటోల‌ను అమ‌ర్చుకుంటే చాలు. ఆ ఫొటో ఉన్న బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే చాలు నంబ‌ర్ డ‌య‌ల్ చేయ‌కుండానే నేరుగా ఫోన్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఇదే కాక టార్చ్ మ‌రో ఉప‌యుక్త‌మైన స‌దుపాయం. దీని ధ‌ర రూ.2390గా ఉంది.

స్కొసోమ్స్ లైట్ వీ1
పెద్ద వాళ్ల కోసం ప్ర‌త్యేకంగా త‌యారు అయిన ఫోన్త‌ల‌లో స్కొసోమ్స్ లైట్ వీ1 కూడా ముందుంటుంది. ఇదో ఫీచ‌ర్ ఫోన్‌. వాయిస్ క‌న్ఫ‌ర్‌మేష‌న్ దీనిలో ఉన్న ప్ర‌త్యేక‌త‌. వాయిస్ ద్వారా మ‌న మాట‌ల్ని గుర్తించి వాటి ద్వారా మీకు అవ‌స‌ర‌మైన పనులు చేసి పెడుతుంది. అంతేకాదు రేర్ ప్యాన‌ల్ దగ్గ‌ర ఉన్న ఎస్ఓఎస్ బ‌ట‌న్ కూడా మ‌రో ప్ర‌త్యేక‌మైన స‌దుపాయం. ప్రొ అసైన్డ్ కాంటాక్ట్‌ల‌కు ఎంఎంఎస్‌, సౌండ్స్‌, అలారం లాంటి స‌దుపాయాలు దీనిలో ఉన్నాయి. దీని ధ‌ర రూ.1699.

ఐ బాల్ అసాన్ 3
ఐబాల్ అసాన్ 3 పెద్ద వాళ్ల కోసం వ‌చ్చిన మ‌రో ఇది. దీని మేకింగ్ పూర్తిగా సీనియ‌ర్ సిటిజెన్స్‌ను ఉద్దేశించి చేశారు. అంటే పెద్ద పెద్ద అంకెలు, సుల‌భంగా క‌నిపించే ఇన్‌బిల్ట్ యాప్‌లు దీనిలో ఉంటాయి. టాకింగ్ కీ ప్యాడ్‌,  ఫాంట్స్‌ను పెద్ద‌గా చూపించే ఎస్ఓఎస్ బ‌ట‌న్‌...వ‌న్ ట‌చ్ ఈజీ యాక్సెస్ బ‌ట‌న్స్ ఫర్ కెమెరా లాంటి ఆప్ష‌న్లు ఉన్నాయి. 2.31 స్క్రీన్ సైజు ఉన్న దీని ధ‌ర రూ.2600

నోకియా 3310
సుల‌భంగా ఉప‌యోగించేందుకు నోకియా పెట్టింది పేరు. సీనియ‌ర్ సిటిజెన్ల కోసం కూడా ఆ సంస్థ ఒక ఫోన్‌ను త‌యారు చేసింది. అదే 3310. సిగ్నేచ‌ర్ నోకియా ట్యూన్‌. స్నేక్ గేమ్‌తో పాటు 2 ఎంపీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఆప్ష‌న్లు ఉన్నాయి. 1200 ఎంఏహెచ్ బ్యాట‌రీ దీని సొంతం. దీని ధ‌ర రూ.3310.
 

జన రంజకమైన వార్తలు