• తాజా వార్తలు
  •  

డ్యుయ‌ల్ కెమెరాలు ఎన్ని ర‌కాలో తెలుసా మీకు?

కెమెరా... ఈ మాట చెప్ప‌గానే ఒక‌ప్పుడు ఏం గుర్తొచ్చేదో తెలియ‌దు కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లే గుర్తుకొస్తున్నాయి. సంప్ర‌దాయ కెమెరాల‌ను ప‌క్క‌కునెట్టి ఫోన్లోనే వ‌స్తున్న కెమెరాలు అంత‌టా ఆక్ర‌మించేశాయి.  స్మార్ట్‌ఫోన్ మాన్యుఫాక్చ‌ర్లు కూడా కెమెరాల‌పైనే దృష్టి పెట్టి డివైజ్‌లు త‌యారు చేస్తున్నారు. ఫ్రంట్, రేర్ కెమెరాల‌తో ఒక‌దాన్ని మించి ఒక‌టి పోటీప‌డుతున్నాయి ఈ స్మార్ట్‌ఫోన్లు.  ఇప్పుడు వ‌స్తున్న మ‌రో ట్రెండ్ డ్యుయ‌ల్ కెమెరాలు. ఒక కెమెరాతో స‌రిపెట్ట‌కుండా రెండేసి కెమెరాల‌తో ఫోన్లు రంగంలోకి దిగుతున్నాయి. మ‌రి ఇలాంటి డ్యుయ‌ల్ కెమెరాలు ఎన్ని ర‌కాలుగా ఉన్నాయో మీకు తెలుసా?

3డీ డ్యుయ‌ల్ కెమెరాలు
స్మార్ట్‌ఫోన్లో వ‌చ్చిన కొత్త ఫీచ‌ర్ 3డీ డ్యుయ‌ల్ కెమెరాలు. 2011లో హెచ్‌టీసీ ఈ ఫీచ‌ర్‌ని ఇంట్ర‌డ్యూస్ చేసింది. హెచ్‌టీసీ ఈవోవీ 3డీ పేరుతో ఇవి మార్కెట్లోకి వ‌చ్చాయి. 3డీ ఇమేజ్‌ల‌ను కాప్చ‌ర్ చేయ‌డం ఈ 3డీ కెమెరాల ప్ర‌త్యేక‌త‌. ఇదే కాక ఫోన్లో 3డీ డిస్‌ప్లే ఉంది. దీని సాయంతో 3డీ ఇమేజ్‌ల‌ను మ‌నం చూడొచ్చు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్‌ను చూడొచ్చు. 

వైడ్ యాంగిల్ ప్ల‌స్ టెలిఫొటో
వైడ్ యాంగిల్ మ‌రియు టెలిఫొటో కాంబినేష‌న్‌తో వ‌స్తున్న కెమెరాలు ఇప్పుడు టెక్ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఈ ఫీచ‌ర్ ఐఫోన్ 7 ప్ల‌స్‌లో ఉంది. డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్ వైడ్ యాంగిల్ లెన్స్‌తో సెట్ చేసి ఉంటుంది. దీన్ని ఒక సెన్సార్‌తో అనుసంధానం చేస్తారు. మ‌రో సెన్సార్ టెలిఫొటోతో క‌లిసి ప‌ని చేస్తుంది. రెండు భిన్న‌మైన ఫోక‌ల్ లెంగ్త్‌లో ఫొటోలు తీయ‌డానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అస‌స్ జెన్‌ఫోన్ జూమ్ 3, వ‌న్ ప్ల‌స్ 5, జియోమి ఎంఐ ఏ1 ఫోన్ల‌లో కూడా ఈ ఫీచ‌ర్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు.  జూమింగ్ ద్వారా మంచి ఫొటోలు తీయ‌డానికి ఇదో బెస్ట్ ఫీచ‌ర్‌.

స్టాండ‌ర్డ్ ప్ల‌స్ వైడ్ యాంగిల్ 
స్టాండ‌ర్డ్ ప్ల‌స్ వైడ్ యాంగిల్‌తో వ‌స్తున్న కెమెరాలు కూడా బాగా ఆక‌ర్షిస్తున్నాయి. ఎల్‌జీ జీ6 ఫోన్లో ఈ కాంబినేష‌న్‌ను ఉప‌యోగించారు. వైడ్ యాంగిల్ లెన్స్‌తో ఉన్న ఈ ఫోన్లో కెమెరాలు 13 మెగా పిక్స‌ల్‌తో త‌యారు చేశారు. స్టాండ‌ర్డ్ లెన్స్ 71 డిగ్రీల యాంగిల్‌లో క‌వ‌ర్ చేస్తుంది. వైడ్ యాంగిల్‌లో 125 డిగ్రీల వ‌ర‌కు క‌వ‌ర్ అవుతుంది. ఒప్పో ఎఫ్‌3 ప్ల‌స్‌లోనూ ఇలాంటి టెక్నాల‌జీనే వాడుతున్నారు. సెల్ఫీల కోసం ఇది బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పొచ్చు. మీరు ఏ యాంగిల్‌, ఎలా నుంచున్నా మిమ్మ‌ల్ని ప‌ట్టి లెన్స్‌లో బంధించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. 

డెప్త్ అనేబుల్డ్ 
ఇప్ప‌డు వ‌స్తున్న డ్యుయ‌ల్ కెమెరాల్లో ఉంటున్న మ‌రో మంచి ఆప్ష‌న్ డెప్త్ అనేబుల్డ్‌. స‌బ్జెక్ట్‌ను ఫోక‌స్ చేస్తూ అవ‌స‌ర‌మైతే బ్యాక్ గ్రౌండ్‌ను బ్ల‌ర్ చేస్తూ ఫోటోలు అందించ‌డ‌మే ఈ కెమెరాల ప్ర‌త్యేక‌త‌.  హాన‌ర‌ల్ 6 ఎక్స్‌, లెనొవొ కే8 నోట్‌, కే8 ప్ల‌స్ లాంటి ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. ఫర్‌ఫెక్ట్ డెప్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఫీచ‌ర్‌తో ఈ కెమెరాలు స్పెష‌ల్‌గా త‌యార‌య్యాయి. అంటే ఫొటో తీసుకుంటున్న వ్య‌క్తిని మాత్ర‌మే ఫోక‌స్ చేస్తూ మిగిలిన ఆబ్జెక్ట్‌ల‌ను బ్ల‌ర్ చేయ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.


 

జన రంజకమైన వార్తలు