• తాజా వార్తలు

ఓఎల్ఈడీ టీవీల గురించి స‌మ‌స్త వివ‌రాలివే..

టీవీ.. మన లైఫ్ స్ట‌యిల్‌లో భాగ‌మైపోయి చాలా కాల‌మైంది. ఏం చూడాల‌న్నా.. ఏం తెలుసుకోవాల‌న్నా టీవీని మించింది లేదు. ఎందుకంటే కంప్యూట‌ర్‌తో మ‌నం అన్ని చూడ‌లేం. ఒక వేళ చూసినా టీవీ అంత క్లారిటీ ఉంటుద‌న్న గ్యారెంటీ లేదు. ఒక‌ప్పుడు టీవీలు చాలా పెద్ద‌విగా ఉండేవి. ఆ త‌ర్వాత కొంచెంది స్లిమ్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఇంకా ఫ్లాట్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఎల్‌సీడీగా మారాయి.. ఆ త‌ర్వాత ఎల్ఈడీ రూపం ధ‌రించాయి. ఇప్పుడు మ‌రో రూపంలో కూడా వ‌చ్చేసింది. అదే ఓఎల్ఈడీ.  ఈ కొత్త టీవీదే ఫ్యూచ‌ర్ అని నిపుణులు చెబుతున్నారు. ధ‌ర చాలా ఎక్కువ‌గా ఉన్నా.. దీనికి ఉన్న ఫీచ‌ర్ల వల్ల భ‌విష్య‌త్‌లో మార్కెట్లో నిల‌బ‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి?

ఏంటి ఓఎల్ఈడీ?
ఎల్ఈడీ టీవీ గురించి అంద‌రికి తెలుసు? మ‌రి ఏంటి ఓఎల్ఈడీ? ఇప్పుడిప్పుడే మార్కెట్‌ను త‌డుతున్న ఈ ఓఎల్ఈడీ ఫుల్ ఫామ్ ఆర్గానిక్ లైట్ ఇమిటింగ్ డ‌యోడ్‌. ఎల్ఈడీకి దీనికి తేడా ఒక్క మాట‌లో చెప్పాలంటే మిగిలిన వాటితో పోలిస్తే ఈ టీవీలో పిక్చ‌ర్ క్వాలిటీ అద్భుత‌మ‌ట‌. ఇలా పిక్చ‌ర్ క్వాలిటీ గొప్ప‌గా ఉండ‌డం కోసం టెక్నాల‌జీ బ్యాక్‌గ్రౌండ్లో ఎంతో ప‌ని చేస్తుంది. మామూలుగా అన్ని టీవీల్లో హీటింగ్ ఎలిమెంట్ వ‌ల్లే బెట‌ర్ పిక్చ‌ర్ క్వాలిటీ ఉంటుంది. అయితే ఓఎల్ఈడీ ప్ర‌త్యేక‌త ఏంటంటే.. త‌క్కువ హీట్‌తో ఎక్కువ వ్యూయింగ్‌, పిక్చ‌ర్ క్వాలిటీ ఇవ్వ‌డం. దీనిలో వాడే ఆర్గానిక్ కాంపౌండ్స్ వ‌ల్లే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ట‌. దీనిలో కార్బ‌న్‌, ఇత‌ర మూల‌కాల‌ను ఉప‌యోగిస్తారు. దీనిలో వ‌చ్చే ప్ర‌తి రంగు ఒక్కో ప్ర‌త్యేక‌మైన ఆర్గానిక్ కాంపౌండ్ వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ట‌. ఓఎల్ఈటీ స్క్రీన్ అంత బ్రైట్‌గా ఉండ‌టానికి దానిలో జ‌న‌రేట్ అయ్యే ఇంట‌ర్న‌ల్ క‌రెంట్ వ‌ల్లే. ఎక్కువ క‌రెంట్ రావ‌డం వల్లే బ్రైట్‌నెస్ కూడా అంత‌గాపెరుగుతుంది.  అన్నిటిక‌న్నా ముఖ్యంగా కాంట్రాస్ట్ రేష్యూ కూడా ఇమేజ్ క్వాలిటీలో కీల‌క పాత్ర పోషించనుంది. 

ఓఎల్ఈడీ వ‌ర్సెస్ ఎల్‌సీడీ
పిక్స‌ల్ బేసిస్‌లో డార్కెస్ట్ బ్లాక్స్‌, ఎక్స్‌ట్రీమ్లీ వైట్స్ సృష్టి ద్వారా ఓఎల్ఈడీ ప‌ని  చేస్తుంది. ఎల్‌సీడీ ఇలా ప‌ని చేయ‌లేదు. పాత ప్లాస్మా టీవీలోనూ ఈ ఆప్ష‌న్ లేదు. దీనికి కార‌ణంగా ఎల్‌సీడీలో ఉన్న లిక్విడ్ క్రిస్ట‌ల్‌. మార్కెట్లో ఉన్న బెస్ట్ ఎల్‌సీడీ కూడా మొత్తం లైట్‌ను బ్లాక్ చేయ‌లేదు. చాలా ఎల్‌సీడీల్లో బాక్‌లైట్ మొత్తం సింగిల్ యూనిట్‌గా మాత్ర‌మే ప‌ని చేస్తుంది. అయితే ఎల్‌సీడీ టీవీల‌తో పోలిస్తే ఓఎల్ఈడీల‌కు ఎక్స్‌ట్రీమ్ లైట్ అవుట్‌పుట్ లేదు. ప్ర‌స్తుతం ఎల్‌జీ కంపెనీ ఈ కొత్త టీవీల త‌యారీలో ఉంది. ఈ ఓఎల్ఈడీ టీవీ రెండు క‌ల‌ర్స్ వాడుతున్నారు. అది ఒక‌టి ఎల్లో రెండోది బ్లూ. ఈ ఎల్లో, బ్లూ క‌ల‌ర్స్ గ్రీన్‌, రెడ్ క‌ల‌ర్స్‌ల‌ను గ్ర‌హిస్తాయి. మ‌రింత బ్రైట్‌నెస్ కోసం దీనిలో వైట్ ఎలిమిమెంట్‌ను యూజ్ చేశారు. 
 

జన రంజకమైన వార్తలు