మీ PC లో ఖచ్చితంగా యాంటి వైరస్ ఉండాల్సిందే. అందులో ఇంకొక మాటకు తావులేదు. ఎలాంటి యాంటి వైరస్ ను ఎంచుకోవాలి? సాధారణంగా ఈ యాంటి వైరస్ రెండు రకాలు. ఒకటి ఫ్రీ యాంటి వైరస్ లు, రెండవది పెయిడ్ యాంటి వైరస్ లు. ఫ్రీ యాంటి వైరస్ లకూ ఏ విధమైన రుసుము చెల్లించవలసిన అవసరం లేదు కానీ పెయిడ్ వాటికి మాత్రం వాటి ప్యాకేజ్ లను బట్టి ధర ఉంటుంది. ఖచ్చితంగా ఉచిత, పెయిడ్ యాంటి వైరస్ లు అందించే సేవల విషయం లో తేడా ఉంటుంది. కానీ కొన్ని ఫ్రీ యాంటి వైరస్ లు పెయిడ్ యాంటి వైరస్ లకు దీటుగా తమ సేవలు అందిస్తాయి. అలాంటి అత్యుత్తమ ఉచిత యాంటి వైరస్ ల వివరాలను మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసమే ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఇవన్నీ AV-TEST ద్వారా తమ నాణ్యతను నిరూపించుకున్నవే. 1. అవిరా ఫ్రీ యాంటి వైరస్ ఫ్రీ యాంటి వైరస్ లలో ఇది మొదటి స్థానం లో నిలిచింది. ఇది మైక్రాన్ లెస్ ప్రొటెక్షన్ ను కలిగిఉంది.ఇది ప్రతీ రెండు సెకన్ల కు ఒకసారి మీ సిస్టం ను స్కాన్ చేస్తూ ఉంటుంది. ప్యాకేజ్ విషయం లోనూ, ఇన్‌స్టా లేషన్ విషయం లోనూ కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఇది అత్యుత్తమ యాంటి వైరస్ అని చెప్పవచ్చు. ఇది చాలా వేగవంతంగానూ, సమర్థవంతంగానూ ఉంటుంది. 2. AVG యాంటి వైరస్ ఫ్రీ చాలా స్పష్టమైన ఇంటర్ పేస్ తో కూడిన అత్యద్భుతమైన వైరస్ ప్రొటెక్షన్ ను ఇది అందిస్తుంది. దీనికి ఉన్న అనేక విశిష్టతల వలన దీనిని వినియోగదారులకు మేము సిఫార్సు చేస్తున్నాము. ఇది 100 శాతం రేటింగ్ ను కలిగిఉంది. ఈ సంవత్సరం మే-జూన్ లో జరిగిన దీని టెస్టింగ్ లో ఇది జీరో అటాక్ లను సాధించింది. దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఇది అత్యుత్తమ వైరస్ ప్రొటెక్షన్ ను అందిస్తుంది అనడం లో సందేహం లేదు. 3. పాండా ఫ్రీ యాంటి వైరస్ 2016 ఇది ఆటోమాటిక్ వ్యాక్సినేషన్ తో కూడిన క్లౌడ్ ఆధారిత ప్రొటెక్షన్ ను మీ PC కి అందిస్తుంది. ఇది ప్రపంo లోనే అతి తేలికైన యాంటీ వైరస్ గా గుర్తింపు పొందింది. ఇది అవీరా కంటే కొంచెం స్లో గా ఉంటుంది. వైరస్ శోధన, జీరో అటాక్స్ లాంటి అంశాలలో ఇది AV-TEST లో మంచి మార్కులే సంపాదించుకుంది. 4. కోమోడో ఫ్రీ యాంటి వైరస్ ఇది విండోస్ సాఫ్ట్ వేర్ కు ఒక సీరియస్ యాంటి వైరస్ గా పనిచేస్తుంది. ఇది డిఫాల్ట్ డెనీ మోడ్ లో ఉంటుంది. ఇది కూడా క్లౌడ్ స్కానింగ్ ను చేస్తుంది. ఇది కూడా AV-TEST లో జీరో ప్రొటెక్షన్ ను సాధించింది. దీని డిజైన్ చాలా షార్ప్ గా ఉంటుంది. 5. అవాస్ట్ ఫ్రీ యాంటి వైరస్ మనకు లభిస్తున్న ఉచిత యాంటి వైరస్ లలో ఒక సాలిడ్ సెక్యూరిటీ సూట్ ఏదైనా ఉంది అంటే అదే ఇదే. ప్రస్తుతం ఇది AVG ని కూడా కొనే యోచనలో ఉందని సమాచారం. ఇకపై ఈ రెండూ కలిసి తమ సేవలను అందించనున్నాయని అంచనా. దీని సమర్థత పై ఏం సందేహం లేనప్పటికీ దీనికి ఉన్న ట్రాక్ రికార్డు వలన కొంచెం అనుమానించే అవకశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే AV టెస్ట్ లో ఇది అత్యుత్తమ ప్రదర్శన ను చూపింది. ఇందులో ఉండే పాస్ వర్డ్ మేనేజర్ అనేది దీనికి ఒక అదనపు ఆకర్షణ గా చెప్పుకోవచ్చు. 6. జోన్ అలారమ్ ఫ్రీ యాంటి వైరస్ ప్లస్ ఫైర్ వాల్ ఇప్పటివరకూ ఉన్న యాంటి వైరస్ లలో ఇది అతి పురాతనమైనది గా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ లూ మరియు ఇంటర్ నెట్ బాల్య దశలో ఉన్నపుడే ఫైర్ వాల్ ల రూపం లో ఇది తన సేవలను అందించింది. కాబట్టి ఫైర్ వాల్ ను ఇది డిఫాల్ట్ గా ఉంచుకోవడం లో ఆశ్చర్యం లేదు. ఇది చాలా అరుదైన ఫీచర్ కూడా. దురదృష్టవశాత్తూ AV టెస్ట్ లో ఇది మెరుగైన ప్రదర్శనను చేయలేకపోయింది. కాకపోతే దీనికి ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా ఇది కూడా ఒక అత్యుత్తమ యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ అనడంలో సందేహం లేదు. 7. ఇమ్యూనేంట్ యాంటి వైరస్ ఇది కూడా ఒక క్లౌడ్ ఆధారిత సెక్యూరిటీ సాఫ్ట్ వేర్. ఇది స్వతంత్రం గానూ మరియు అప్పటికే ఉన్న యాంటి వైరస్ తోనూ కలిసి తన పనిని చేయగలదు. AV టెస్ట్ లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శననే చేసింది. దీనికి కూడా చిన్న చిన్న పరిమితులు ఉన్నప్పటికీ అత్యుత్తమ ఉచిత యాంటి వైరస్ లలో ఒకటి గా ఇది నిలిచింది. 8. క్విహూ 360 టోటల్ సెక్యూరిటీ ఇది ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్. దాని సామర్థ్యాన్ని బట్టి ఉత్తమ సేవలనే అందిస్తుంది. AV టెస్ట్‌లో కూడా పర్వాలేదు. కానీ ఇంతకుముందు ఒకసారి ఇది AV టెస్ట్ లో మోసానికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. ఉచితమే కాబట్టి ఒకసారి వాడడం లో నష్టం లేదు. 9. బిట్ డిఫెండర్ యాంటి వైరస్ ఫ్రీ ఎడిషన్ మంచి బ్రాండ్ పేరుపై వచ్చినప్పటికీ ఇది మిగతా వాటితోపోల్చితే కొంచెం వెనుకబడి ఉంది. ఇది ప్రతీరోజూ అప్ డేట్ అవుతూ ఉంటుంది. కానీ కోర్ సాఫ్ట్ వేర్ మాత్రం 2013 తర్వాత ఇంతవరకూ అప్ డేట్ అవ్వలేదు. ఇది ఏమంత వేగవంతం కూడా కాదు దీనిని పూర్తిగా నమ్మే అవకాశాలు లేవు. కాకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నల్టు ఇది ఫ్రీ సాఫ్ట్ వేర్ కాబట్టి పర్వాలేదు. ఒకసారి చూడవచ్చు. 10. విండోస్ డిఫెండర్ ఇది ఇతర థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ లు ఉన్నంత సమర్థం గా ఉండక పోయినా పర్వాలేదు అనిపించే ప్రదర్సన ను ఇస్తుంది. AV టెస్ట్‌లో కూడా మెరుగైన ప్రదర్సననే ఇచ్చింది. ఉచితమే కదా! ఒకసారి వాడండి నష్టమేమీ లేదు. |