• తాజా వార్తలు
  •  

బడ్జెట్ తర్వాత ధర పెర‌గ‌నిది ఐ ఫోన్ ఎస్ఈ ఒక్క‌టే.. ఎందుకని? 

ఐ ఫోన్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఐ ఫోన్ కొనాలన్న మీ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎల‌క్ట్రానిక్ విడిభాగాల‌పై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేసింది. దీని ఎఫెక్ట్ మొబైల్ ఫోన్లపై పడింది. దిగుమతి సుంకాన్ని 15నుంచి 20 శాతం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇండియాలో ఐ ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఐ ఫోన్ మోడల్స్ ధరలను 3 శాతం పెంచేసింది కంపెనీ. ఐ ఫోన్‌లో వాడే విడి భాగాల‌న్నీ దిగుమ‌తి చేసుకునేవే. అందుకే వాటిపై ధ‌ర పెరిగింది. ఫ‌లితంగా ఐ ఫోన్ ధ‌ర‌లు మాత్ర‌మే పెరిగాయి.
ఐ ఫోన్ SE మిన‌హా..
ఐఫోన్ SE మోడల్ మినహా మిగతా అన్ని మోడల్స్ పైనా పెరిగిన ధరలు వర్తించనున్నాయి. ఐఫోన్ SEని ఇండియాలోనే అసెంబుల్ చేస్తున్నారు. తైవానీస్ మొబైల్ తయారీదారు విస్ట్రాన్ యాపిల్ కోసం ఐఫోన్ ఎస్ఈ మోడ‌ల్‌ను ఇండియాలో అసెంబుల్ చేస్తోంది. అందుకే వాటిపై దిగుమతి సుంకాన్ని మినహాయించారు. ఫ‌లితంగా మిగిలిన ఐఫోన్ ధ‌ర‌ల‌న్నీ పెరిగినా ఐ ఫోన్ SE  మోడ‌ల్ మాత్రం పాత ధ‌ర‌లోనే దొరుకుతుంది. ఈ ఫోన్‌ 32 జీబీ,128 జీబీ రెండు స్టోరేజి వేరియంట్లలో లభిస్తుంది. 32  జీబీ ధర 26,000, 128 జీబీ ధ‌ర 35,000 రూపాయలు.  
త్వ‌ర‌లో ఐఫోన్ 6S  ఇండియాలో త‌యారీ
గతవారం విస్ట్రాన్ బెంగుళూరులో యాపిల్‌తో ఒక భూఒప్పందం చేసుకుంది. దాదాపు 157మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.  త్వరలోనే ఇండియాలో ఐఫోన్ 6S  మోడల్‌ను విస్ట్రాన్‌తో కలిసి తయారు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. రెండేళ్ల కింద‌ట ఇండియాలో లాంచ్ అయిన ఐఫోన్ ఇప్ప‌టికీ ఇండియ‌న్ మార్కెట్లో  అత్యధిక ప్రజాదరణ పొందుతోంది.

జన రంజకమైన వార్తలు