• తాజా వార్తలు
  •  

ఏ స్మార్ట్‌ఫోన్‌కైనా ఉప‌యోగ‌ప‌డే వైర్‌లెస్ ఛార్జీంగ్ యాక్స‌స‌రీస్ ఇవే

ఛార్జింగ్ చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఛార్జ‌ర్ కావాలి. మ‌న ఫోన్ ఎక్క‌డ ఉంటే ఛార్జ‌ర్ అక్క‌డ ఉండాలి. ఇక ప్ర‌యాణాల్లో అయితే ఛార్జింగ్‌తో మ‌రింత ఇబ్బందులు త‌ప్పువు. స్మార్ట్‌ఫోన్ల‌లో నెట్ వాడ‌కం వ‌ల్ల ఛార్జింగ్ త్వ‌ర‌గా అయిపోతూ మ‌న‌కు చాలా అస‌హ‌నాన్ని క‌లుగ‌చేస్తుంది. అయితే కొంత‌మంది ప‌వ‌ర్ బ్యాంకులు ప్ర‌య‌త్నించినా.. వీటి వాడ‌కం కూడా కొద్దిసేప‌టికే ప‌రిమితం. మ‌రి మ‌న‌కు ఛార్జింగ్ కావాలంటే ఎలా? ..ఛార్జ‌ర్ లేకుండానే మ‌న ఫోన్ ఛార్జింగ్ అయిపోతే భ‌లే ఉంటుంది క‌దా! అందుకే కోస‌మే వ‌చ్చింది వైర్‌లెస్ ఛార్జింగ్‌. అయితే ఈ ఛార్జింగ్ ఊరికే అయిపోదు. దానికి కొన్ని ఉప‌క‌ర‌ణాలు అవ‌స‌రం. మ‌రి ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వైర్‌లెస్ ఛార్జింగ్ యాక్స‌స‌రీస్ ఏంటంటే..

వైర్‌లెస్ ఛార్జింగ్ రిసీవ‌ర్ కేస్‌
వైర్‌లెస్ ఛార్జింగ్ స‌పోర్ట్ చేయ‌ని కొన్ని ఫోన్ల‌లో సైతం  ఛార్జింగ్ రిసీవ‌ర్ కేస్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవ‌చ్చు.  క్యుఐ వైర్‌లెస్ ఎక్విప్‌మెంట్‌తో ఇది సాధ్యం. క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఏ డివైజ్‌తో అయినా పెయిర్ చేసుకోవ‌చ్చు.  ఐఫోన్ 7 లాంటి వాటికి ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. గూగుల్ పిక్స‌ల్ ఫోన్‌కు కూడా ఇది వాడొచ్చు. దీని ధ‌ర రూ.1599 నుంచి 4800 మ‌ధ్య ఉంది. 

వైర్‌లెస్ ఛార్జింగ్ రిసీవ‌ర్ కాయిల్ 
వైర్‌లెస్ ఛార్జింగ్‌ను స‌పోర్ట్ చేయ‌ని ఫోన్ల‌ను రిసీవర్ కాయిల్ ఉప‌యోగించి ఛార్జ్ చేయ‌చ్చు. దీన్ని ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌కు క‌నెక్ట్ చేస్తే..  ఆ పోర్ట్‌ను వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్‌గా మార్చుతుంది.  అయితే ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న యూఎస్‌బీ టైప్‌ను బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది.  దీని ధ‌ర రూ.300 నుంచి 1000 వ‌ర‌కు ఉంటుంది. అమేజాన్‌,  ఇబేల్లో ఇది ల‌భ్య‌మ‌వుతోంది.

ఏఆర్ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్
మీ ఫోన్ వైర్‌లెస్ మోడ్ ఛార్జ్ అవుతుంటే మీకో వైర్‌లెస్ చార్జ‌ర్ కూడా కావాలి. మీ బడ్జెట్ గురించి ఆలోచిస్తే ఏఆర్ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్‌ను ఉప‌యోగించొచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్‌ల‌లో ఇదో అతి చౌవ‌కైన ప్యాడ్. ఏఆర్ఈ ఛార్జింగ్ ఔట్‌పుట్ 1 ఆంపియ‌ర్ సామ‌ర్థ్యం ఉంటుంది. దీని వ‌ల్ల మీ స్టాండ‌ర్డ్ ఛార్జ‌ర్ క‌న్నా మెరుగ్గా ప‌ని చేస్తుంది. దీని ధ‌ర రూ.888                                         

శాంసంగ్ వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్‌
శాంసంగ్ త‌న లేటెస్ట్ మోడ‌ల్స్ గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్, నోట్ 8ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను తీసుకొచ్చింది. దీని ఔట్ పుట్ 2 ఆంపియ‌ర్లు. సాధార‌ణంగా  వైర్‌లెస్ ఛార్జ‌ర్లు 1 ఆంపియ‌ర్లే ఉంటాయి. అంటే సామ‌ర్థ్యంలో వాటితో పోలిస్తే శాంసంగ్ వైర్‌లెస్ ఛార్జ‌ర్ రెట్టింపు మెరుగైంది. దీని ధ‌ర రూ.2499. ధ‌ర ఎక్కువ‌గానే అనిపిస్తున్నా.. క్వాలిటీ, ప‌ని తీరు, సామ‌ర్థ్యం మిగిలిన వాటికంటే ఎంతో బెట‌ర్‌.                                                                                                                                                                     

జన రంజకమైన వార్తలు