• తాజా వార్తలు

ప్ర‌పంచ‌పు తొలి కాంటాక్ట్‌లెస్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నిక్ ..పై

వైర్‌లెస్ ఛార్జ‌ర్లు చూశాం.   కానీ కాంటాక్ట్ లెస్‌, వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్ష‌న్ కూడా అందుబాటులోకి రాబోతోంది. సిలికాన్ వ్యాలీలోని ఓ స్టార్ట‌ప్ కంపెనీ ఈ టెక్నాల‌జీతో కూడిన ఛార్జ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేసింది. దీనిపేరు పై (Pi). ప్ర‌పంచంలో తొలి కాంటాక్ట్‌లెస్‌, వైర్ లెస్ ఛార్జింగ్ టెక్నిక్ ఇదే.  వైర్‌లైస్ ఛార్జ‌ర్లు అంటే ఓ ఛార్జింగ్ ప్యాడ్‌పై డివైస్‌ను ఉంచి నేరుగా ఛార్జింగ్ చేసుకునే ఆప్ష‌న్‌. కానీ పై లో డివైస్‌ను ఛార్జ‌ర్‌తో కాంటాక్ట్ చేయ‌క్క‌ర్లేదు. ఎలాంటి వైర్లు ఉప‌యోగించ‌క్క‌ర్లేదు. జ‌స్ట్ ఈ ఛార్జ‌ర్‌కు అడుగు దూరంలో ఉంచితే చాలు డివైస్ ఛార్జి అవుతుంది.

మ‌సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (MIT) గ్రాడ్యుయేట్స్ ఈ టెక్నాల‌జీని డెవ‌ల‌ప‌ర్ చేశారు.  యాపిల్‌, ఇత‌ర వైర్‌లైస్ ఛార్జింగ్ డివైస్‌ల్లో వాడే  క్యూఐ ఛార్జింగ్ టెక్నాల‌జీని బేస్ చేసుకునే దీన్ని డిజైన్ చేశారు. కాంటాక్ట్‌లెస్ ఛార్జింగ్ క్యాప‌బులిటీస్‌కి స్పెష‌ల్ బీమ్ ఫార్మింగ్ ఆల్గ‌రిథ‌మ్స్‌ను యాడ్ చేయ‌డం వ‌ల్ల ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే ఛార్జి చేయ‌గ‌లుగుతుంది. కోన్ షేప్‌లో ఉండే ఈ డివైస్ ఓ ర‌కంగా చెప్పాలంటే   వైఫైలాంటిది. వైఫై కొన్ని మీట‌ర్ల వ‌ర‌కు యాక్సెస్ ఉంటే ఇది ఒక అడుగుకే ప‌రిమితం. వైఫై నెట్ క‌నెక్టివిటీని డివైస్‌కు అందిస్తే ఇది ఛార్జింగ్ క‌నెక్టివిటీని అందిస్తుంది. అంతే తేడా మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌. 2018 నుంచి మార్కెట్లోకి వ‌చ్చే  ఈ ఛార్జ‌ర్  కాస్ట్ 200 డాల‌ర్ల వ‌ర‌కు ఉండొచ్చు. పై కంపెనీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే ఫ‌స్ట్ 314 మందికి 50 డాల‌ర్స్ డిస్కౌంట్ ఇస్తారు.

 

స్పెషాలిటీస్ ఏంటి?

* వైర్‌లైస్ ఛార్జ‌ర్లు అన్ని డివైస్‌ల‌నూ ఛార్జి చేయ‌లేవు. ప్ర‌తి డివైస్‌కు స‌ప‌రేట్ ఛార్జ‌ర్ ఉండాలి.  అంతేకాదు మీ డివైస్‌ను ఛార్జింగ్ ప్యాడ్‌కు కొన్ని సెంటీమీట‌ర్ల దూరంగా పెట్టినా కూడా ఛార్జింగ్ కావ‌డం ఆగిపోతుంది. ఈ కొత్త ఛార్జింగ్ టెక్నాల‌జీలో అలాంటివేమీ లేవు.  ఒక అడుగు దూరంలో ఎలాంటి డైరెక్ష‌న్లో డివైస్‌ను ఉంచినా ఛార్జ్ అయిపోతుంది.

* అంతేకాదు ఛార్జింగ్ ప్యాడ్‌తో వైర్‌లైస్‌గా ఛార్జ్ చేయాలంటే ఒక్క‌సారి ఒక్క డివైస్ మాత్ర‌మే ఛార్జి చేయ‌గ‌లం. అదే పై డివైస్‌లో ఒకేసారి నాలుగు డివైస్‌ల‌ను చార్జ్ చేసుకోవ‌చ్చు.  ఒక్కో డివైస్‌కు 10 వాట్స్ ప‌వ‌ర్‌ను స‌ప్లై చేస్తుంది. డివైస్‌ల సంఖ్య పెరిగేకొద్దీ వాట్స్ త‌గ్గుతాయి.

* పై ఛార్జ‌ర్ ఆండ్రాయిడ్‌, యాపిల్ డివైస్‌ల‌కు కంపాట‌బులిటీతో డిజైన్ చేశారు. క్యూ అనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ల‌యిన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌9, ఎస్ 8+, ఐఫోన్ 8, 8+, 10 డివైస్‌ల‌ను ఎలాంటి స్పెష‌ల్ యాక్సెస‌రీస్ అవ‌స‌రం లేకుండానే చార్జ్ చేస్తుంది.  మిగిలిన హ్యాండ్‌సెట్ల‌ను ఛార్జి చేయాలంటే పీఐ కంపాటుబ‌ల్ ఛార్జింగ్ కేస్ ఉండాలి.

 

జన రంజకమైన వార్తలు