• తాజా వార్తలు

రెడ్‌మి నోట్ 4 పేల‌డానికి కార‌ణం ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ట్ర‌న‌ల్ ఫోర్స్‌

సెల్‌ఫోన్‌లు పేలుతున్నాయి.. ఇటీవ‌ల మ‌నం త‌రుచుగా ఈ మాట వింటున్నాం.  తాజాగా లెనొవొ ఫోన్లు పేలిన ఉదంతాలు చాలా చోట్ల చూశాం. ఇప్పుడు ఆ జాబితాలో  జియోమి రెడ్‌మి నోట్ 4 కూడా చేరింది. వారం రోజుల కింద‌ట జ‌రిగిన ఒక సంఘ‌ట‌న క‌ల‌వ‌రం రేపుతోంది. ఒక‌త‌ను జేబుల్ ఫోన్ పెట్టుకుంటే అది పేలిపోయింది. దీంతో అత‌నికి తీవ్ర గాయ‌ల‌య్యాయి. సాధార‌ణంగా ఛార్జింగ్‌కు పెట్టిన‌ప్పుడు మాత్ర‌మే పేల‌డం జ‌రుగుతుంది. కానీ ఇలా జేబులు పెట్టుకుంటే కూడా పేల‌డ‌మే ఆందోళ‌న క‌లిగించే అంశం. మ‌రి దీనికి కార‌ణం ఏమిటి? 

ఎక్స్‌ట్ర‌న‌ల్ ఫోర్స్ వ‌ల్లే..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన తాజా సంఘ‌ట‌న‌తో జియోమి ఒక ప‌రిశోధ‌న కూడా నిర్వ‌హించింది. ఇలా జేబులో ఫోన్ పెట్టుకుంటే ఎందుకు పేలింద‌నే విష‌యం గురించి పరిశోధించి ఒక విష‌యాన్ని తేల్చింది. ఎక్స‌ట్ర‌న‌ల్ ఫోర్స్ వ‌ల్లే జియోమి  రెడ్‌మి నోట్ 4 పేలింద‌ని ఆ సంస్థ తెలిపింది. బ్యాట‌రీ, బ్యాక్ క‌వ‌ర్ మీద తీవ్ర‌మైన ఒత్తిడి ప‌డ‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని.. ఇది బ‌య‌ట నుంచి వ‌చ్చిన ప్ర‌మాదం త‌ప్ప‌.. ఇంట‌ర్న‌ల్‌గా వ‌చ్చింద‌ని కాద‌ని జియోమి చెప్పింది. చిన్న వ్యాపారం చేసుకునే  సూర్య‌కిర‌ణ్ అనే అత‌ను ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకుని.. బండి న‌డ‌పుతుండ‌గా ఈ సంఘ‌న‌ట జ‌రిగింది. ఉన్న‌ట్టుండి త‌న శ‌రీరం కాలుతున్న‌ట్లు అనిపించ‌డంతో అత‌ను వెంట‌నే ఆ ఫోన్‌ను తీసి బ‌య‌ట‌కు విసిరిసేశాడు. దీంతో చిన్న‌పాటి గాయాల‌తో అత‌ను త‌ప్పించుకున్నాడు. 

కొన్న 20 రోజుల్లోనే..
సాధార‌ణంగా ఏ ఫోన్ అయినా కొంత వాడిన త‌ర్వాతే బ్యాట‌రీకి ఇబ్బందులు ఎదుర‌వుతాయి. కానీ రెడ్‌మీ నోట్ 4 కొన్న 20 రోజుల్లోనే ఫోన్ ఇలా బ‌ర్న్ కావ‌డం చాలా ఆందోళ‌న క‌లిగించే అంశం.  అందుకే  ఫోన్ బ్యాట‌రీని ఓపెన్ చేయ‌ద్ద‌ని.. ఇంట‌ర్న‌ల్ పార్ట్‌ల‌ను ముట్టుకోవ‌ద్ద‌ని క‌స్ట‌మ‌ర్ల‌కు నిబంధ‌న‌లు ఇస్తూనే ఉన్నామ‌ని.. కానీ కొంత‌మంది తెలియ‌క‌పోవ‌డం వల్ల ప్ర‌మాదాలు కొని తెచ్చ‌కుంటున్నార‌ని ఆ కంపెనీ తెలిపింది.  భార‌త్‌లో ప్ర‌స్తుతం జియోమి దూసుకెళ్తోంది. ఇక్క‌డ జియోమికి 17.9 శాతం మార్కెట్ స్పేస్ ఉంది.  ఇటీవ‌ల రెడ్ మి నోట్ 4 భారీగా అమ్ముడుపోయింది. శాంసంగ్ గెలాక్సీ జే2ను దాటి ముందుకెళ్లిపోయింది. 

జన రంజకమైన వార్తలు