• తాజా వార్తలు
  •  

డీఎస్ఎల్ఆర్‌లో షూట్ చేస్తూనే లైవ్ చేసే డివైస్‌.. యోలో బాక్స్‌

డీఎస్ఎల్ఆర్‌లో లేదా వీడియో రికార్డ‌ర్‌లో  వీడియో రికార్డ్ చేసిన త‌ర్వాత  ఏం చేస్తారు? త‌ర్వాత దాన్ని సిస్ట‌మ్‌కు అటాచ్ చేసి ప్లే చేస్తారు. అలా ఎందుకు.. మీరు రికార్డ్ చేస్తుండ‌గానే లైవ్ ఇచ్చే ఆప్ష‌న్లు చాలా ఉన్నాయి. అయితే ఇవ‌న్నీ మీడియా ఛానల్స్ వంటి పెద్ద సంస్థ‌లు మాత్ర‌మే వాడే ఎక్విప్‌మెంట్‌. ఈ ప్రాసెస్‌ను ఈజీ చేసేందుకు యోలో బాక్స్ వ‌చ్చేసింది. ఈ డివైస్ సాయంతో మీరు రికార్డ్ చేస్తుండ‌గానే కంటెంట్‌ను లైవ్‌గా చూపించేయొచ్చు.
ఈజీగా స్ట్రీమింగ్ 
ఇంత‌కు ముందు లైవ్ స్ట్రీమింగ్ చేయాలంటే పొడ‌వాటి వైర్లు, క‌న్వ‌ర్ట‌ర్ భారీ సెట్టింగే ఉండేది.  యోలో బాక్స్‌తో ఆ ఇబ్బంది కూడా ఉండ‌దు. లైవ్ స్ట్రీమింగ్ చేయ‌డానికి వీలుగా త‌యారుచేసిన ఈ యోలో బాక్స్ అత్య‌ధిక కెమెరా ఎక్విప్‌మెంట్ల‌తో ప‌ని చేస్తుంది. దీనికి మీకు కావాల్సింద‌ల్లా హెచ్‌డీఎంఐ కేబుల్ మాత్ర‌మే. గో ప్రో లేదా డ్రోన్ల‌తో వీడియో రికార్డ్ చేస్తున్న‌ప్పుడు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయ‌డానికి వైర్‌లైస్ మోడ్ కూడా యోలోబాక్స్‌లో ఉంది. ఈ డివైస్‌తో ఎవ‌రైనా వీడియోను వెబ్‌సైట్లు, యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌, పెరిస్కోప్ లాంటి వాటిలో ఈజీగా లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు.
చాలా ప్ర‌త్యేక‌త‌లు
యోలో బాక్స్ చూడ‌డానికి స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుంది. కానీ మందం ఎక్కువ‌గా ఉంటుంది. దీనిలో 5 ఇంచెస్ ట‌చ్ స్క్రీన్ డిస్‌ప్లే సాయంతో డిఫ‌రెంట్  యాప్స్ లేదా వెబ్‌సైట్లలో లాగిన్ అయి మీ కంటెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేసుకోవ‌చ్చు. 
* వైఫై, ఎథ‌ర్‌నెట్‌తో ప‌ని చేస్తుంది. డెడికేటెడ్ 4జీ సిమ్ స్లాట్ కూడా ఉంది. దీనితో కూడా ప‌ని చేసుకోవ‌చ్చు.
*  లైవ్ కెమెరా, లోక‌ల్ కంటెంట్ రెండింటినీ ఒకేసారి లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. 
* దీనిలో పిక్చ‌ర్ అన్ పిక్చ‌ర్ మోడ్ రెండు కెమెరాల షాట్స్‌ను క‌లిపి సింగిల్ గ్రాఫిక్స్ లేయ‌ర్‌లో చూపిస్తుంది. యోలోబాక్స్ లైవ్ స్ట్రీమింగ్ చేసిన వీడియోల‌ను ఆటోమేటిగ్గా క్లౌడ్ నెట్‌వ‌ర్క్‌లో సేవ్ చేస్తుంది. మానిట‌ర్‌+ కంట్రోల్ ప్యానల్‌తో వ‌స్తుంది. ప్రైస్ 23వేల నుంచి స్టార్ట‌వుతుంది.  

జన రంజకమైన వార్తలు