• తాజా వార్తలు
  •  

ఈ ఫోన్ల‌లో మీ ఫేసే మీ పాస్‌వ‌ర్డ్‌!

టెక్నాల‌జీ వేగంగా విస్త‌రిస్తున్న ఈ డిజిట‌ల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ల‌లోనూ అంతే వేగంగా మార్పులు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు మ‌న ఫోన్‌కు సెక్యూరిటీ కోసం పాస్‌వ‌ర్డ్‌లు పెట్టుకునేవాళ్లం. అంటే మాన్యువ‌ల్‌గా ఏదో అంకెలో లేదా అల్ఫా న్యూమ‌రిక్ నంబ‌ర్లో సెట్ చేసుకునేవాళ్లం. కానీ ఆ త‌ర్వాత ప్యాట్ర‌న్లు వ‌చ్చాయి.  ఆపై వేలి ముద్ర‌లు (ఫింగ‌ర్ ప్రింట్స్‌) కూడా వ‌చ్చాయి. తాజాగా మ‌న ముఖ‌మే మ‌న పాస్‌వ‌ర్డ్ అయిపోయింది.  ఇప్పుడు అలాంటి ఫోన్లు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసా!

ఐఫోన్ ఎక్స్
దీని ధ‌ర రూ.92 వేలు. దీని ధ‌ర‌కు త‌గ్ట‌ట్టే సెక్యూరిటీ విష‌యంలో ఏమాత్రం తీసిపోదు. దీనిలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు మ‌న ముఖాన్ని గుర్తించే  ఫేసియ‌ల్ రిక‌గ‌నైజేష‌న్ ఆప్ష‌న్ ఉంది. స్క్రీన్ పై భాగంలో ఇది ఉంటుంది. ఫేస్ ఐడీలో ట్రూ డెప్త్ కెమెరా సిస్ట‌మ్‌ను ఉప‌యోగించారు. దీని వ‌ల్ల ఈ సెక్యూరిటీని ఛేదించి ముందుకెళ్ల‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. మ‌నిషి ముఖాన్ని గుర్తించి దాన్ని 30 వేల ఇవ్విజుబుల్ డాట్స్‌తో దాచేస్తుంది. ఇందులో ఏది మిస్ మ్యాచ్ అయినా ఇది ఆ యూజ‌ర్‌న్ యాక్సెప్ట్ చేయ‌దు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8
రూ.67,900 ధ‌ర ఉన్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 సెక్యూరిటీ విష‌యంలోనూ చాలా టైట్‌. ఇదొక్క‌టే కాదు గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్ల‌స్ కూడా మంచి సెక్యూరిటీతో రూపొందాయి. 6.3 అంగుళాల తెర ఉన్న ఈ ఫోన్‌లో ప్ర‌ధాన‌మైన ఫీచ‌ర్ ఫేసియ‌ల్ రిక‌గ‌నైజేష‌న్‌. ఫేస్ అన్‌లాకింగ్ ఫీచ‌ర్ మీకు గొప్ప‌గా మేలు చేస్తుంది. ఒక‌సారి మీ ఫేస్‌తో అన్‌లాక్ అయిన త‌ర్వాత వేరొక‌రు దాన్ని ఉప‌యోగించ‌డం కుద‌ర‌దు. 

వీజీ వీ30 ప్ల‌స్‌
ఎల్‌జీ కంపెనీ త‌యారు చేసిన వీజీ వీ30 ప్ల‌స్‌నూ ఫేస్ ఐడీ ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఈ కంపెనీ త‌యారు చేసిన జీ6 మోడ‌ల్‌లోనే ఈ ఫీచ‌ర్ వ‌చ్చింది. ఇప్పుడు వీ30 ప్ల‌స్‌లో పూర్తి స్థాయిలో  అన్‌లాకింగ్ సిస్ట‌మ్‌ను అడాప్ట్ చేసుకుంది ఎల్‌జీ. దీనిలో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ ఆప్ష‌న్ కూడా అదనంగా ఉంది.  దీని ధ‌ర రూ.44,990గా నిర్ణ‌యించింది ఆ సంస్థ‌. 

వీవో వీ7 ప్ల‌స్‌
వీవో కూడా ఫేసియ‌ల్ ఐడీ ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అన్‌లాక్ చేయ‌డానికి ఇది ఇటీవ‌లే వీ7 ప్ల‌స్‌లో ఫీచ‌ర్‌ను త‌యారు చేసింది. దీనిలో బెజెల్ డిజైన్ కూడా ఉంది. 6 అంగుళాల స్క్రీన్‌తో ఉండే వీ7 ప్ల‌స్ ఫోన్లో ఫేస్ యాక్సిస్ చాలా కీల‌క‌మైన ఆప్ష‌న్‌. వ‌న్‌ప్ల‌స్ 5 టీ స్మార్ట్‌ఫోన్లో కూడా ఇదే ఆప్ష‌న్ ఉంది.

జన రంజకమైన వార్తలు