• తాజా వార్తలు
  •  

మీ ఇమేజ్ లకు వాటర్ మార్క్స్ ఉచితంగా యాడ్ చేసి పెట్టే టూల్స్ మీకోసం..

మీరు తీసుకున్న ఫోటోలకు మీ సిగ్నేచర్ తోపాటు, మరేదైనా సింబల్ తో వాటర్ మార్క్ చేయాలంటే..... కొత్తగా సాఫ్ట్ వేర్ కొనాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆన్ లైన్లో ఉచితంగా ఎన్నో టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకుని...మీ ఫోటోలకు టెక్ట్స్,కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్లో ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే టూల్స్ గురించి తెలుసుకుందాం.

1.    వాటర్ మార్క్.ws (watermark.ws)

ఈ టూల్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఫ్రీ అకౌంట్ హోల్డర్లు వాటర్ మార్క్ ను ఒకేసారి ఇమేజ్ లో చేర్చవచ్చు. ఏదైనా వీడియో మొదటి 30 సెకన్లు మాత్రమే ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. పీసీ, ఫేస్ బుక్, గూగుల్ డ్రైవ్, ఎవర్ నోట్ ఇలా ఏదైనా ఇతర పాపులర్ కోల్డ్ స్టోరెజ్ నుంచి ఫైళ్లను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు వాటర్ మార్క్ టెక్ట్స్ తోపాటు ఒక ఇమేజ్ కు వాటర్ మార్క్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. వాటర్ మార్క్ టెక్ట్స్ కోసం మీరు ఉపయోగించడానికి ఈ టూల్ లో డజన్ల కొద్దీ ఫాంట్లు అందుబాటులో ఉన్నాయి.

2. పిక్ మార్కర్. కామ్( picmarkr.com)

ఈ టూల్ ద్వారా వాటర్ మార్క్ యాడ్ చేసుకోవడం చాలా సులభం. ఒకేసారి మల్టిపుల్ ఫైళ్లను అప్ లోడ్ చేసి ప్రొసెస్ చేయవచ్చు. ఒకేసారి ఐదు ఇమేజ్ లను అప్ లోడ్ చేయవచ్చు. కానీ ఫైలు 25ఎంబి కంటే తక్కువగా ఉండాలి. అన్ని ఫైళ్లలో టెక్ట్స్ తోపాటు వాటర్ మార్క్ కూడా వాడుకోవచ్చు. టైల్డ్ వాటర్ మార్క్ అని పిలిచే ఒక ప్రత్యేక ఫీచర్ను ఈ టూల్ కలిగి ఉంది. మీ పీసీ, ఫ్లిక్కర్, ఫేస్ బుక్ , గూగుల్ ఫోటోల నుంచి పిక్చర్స్ ఎక్స్ పోర్ట్ చేసుకునే వీలుంటుంది.

3. వాటర్ మార్క్వీ.కామ్( watermarquee.com)

ఫీచర్స్ పరంగా ఈ టూల్ కు...ఇతర టూల్స్ కు దగ్గరి పోలీకలు ఉంటాయి. టెక్స్ట్స్ వాటర్ మర్క్ తోపాటు వాటర్ మార్క్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజు, కలర్, బ్యాక్ గ్రౌండ్ మార్చడంతోపాటు...ఫాంట్లను సెలక్ట్ చేసుకోని...వాటర్ మార్క్ టెక్ట్స్ లను జోడించవచ్చు. ఈ టూల్ ద్వారా ఒకేసారి 5 చిత్రాలను మాత్రమే అప్ లోడ్ చేసుకుని...ప్రొసెస్ చేయవచ్చు.

4. వాటర్ మార్క్ టూల్ . కామ్.( watermarktool.com)

ఈ టూల్ ద్వారా కేవలం టెక్ట్స్ వాటర్ మార్క్ మాత్రమే యాడ్ చేయవచ్చు. ఒకేసారి ఐదు ఇమేజ్ లను ప్రొసెస్ చేసుకోవచ్చు. వీటితోపాటు మీరు కస్టమ్ ఫాంట్ ను కూడా ఉపయోగించవచ్చు. సైజు, కలర్ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మార్క్ యాడ్ చేసిన పిక్చర్ను మీ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

5. వాటర్ మార్క్ ఇమేజ్ లు ( watermarkimages.com)

వాటర్ మార్క్ చిత్రాల బల్క్ లో మీకు సహాయపడే మరో వెబ్ యాప్ వాటర్ మార్క్ ఇమేజ్ . కామ్. ఇందులో చక్కటి ఇంటర్పేస్ ఉంటుంది. గరిష్టంగా 18 ఫైళ్లను అప్ లోడ్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ టెక్ట్స్, ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, ఫాంట్ కలర్, వాటర్ మార్క్ పొజిషన్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఎఫెక్ట్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ టూల్ ద్వారా పిక్చర్స్ కు వాటర్ మార్క్ ను యాడ్ చేయలేరు. ఇది ప్రధాన లోపమని చెప్పవచ్చు

జన రంజకమైన వార్తలు