అందరూ ఎదురుచూస్తున్నట్లుగానే షియోమీ తన లేటెస్ట్ రెడ్ మీ నోట్ 5 ను మార్కెట్ లోనికి తెచ్చేసింది. దీని ముందు వెర్షన్ తో పోలిస్తే కొన్ని అదనపు అధునాతన ఫీచర్ లని ఇది కలిగిఉంది. అయినప్పటికీ కొంతమంది వినియోగదారులలో దీని పట్ల ఉన్న అనుమానాలు ఇంకా నివృత్తి కాలేదు. ఈ నేపథ్యం లో ఈ రెడ్ మీ కాకుండా దాదాపు ఇదే ఫీచర్ లతోనూ అదనపు అప్ గ్రేడ్ లతోనూ ఉండే మరికొన్ని ప్రత్యామ్నాయాల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఇన్ఫినిక్స్ హాట్ S 3
షియోమీ కి ప్రధాన పోటీదారుగా ఈ ఇంఫినిక్స్ మారింది. డిజైన్ విషయం లో కానీ ఇతర ఫీచర్ ల విషయం లోకానీ రెడ్ మీ కి ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీని ఇస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం నూ, 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ను ఇది కలిగి ఉంటుంది. 6 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉండి స్నాప్ డ్రాగన్ 430 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ధర కూడా రెడ్ మీ కంటే ఒక వేయి రూపాయలు తక్కువే ఉంటుంది. 3 GB వేరియంట్ యొక్క ధర రూ 8,999/- లు ఉంటుంది.
ఆనర్ 9 లైట్
రెడ్ మీ కి ఉన్న ప్రతికూలత లలో ప్రధానమైనది దీని డిజైన్. ఈ విషయం లో ఈ ఆనర్ 9 లైట్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం కాగలదు. ధర ఇంచుమించు రెడ్ మీ నోట్ 5 లానే ఉంటుంది. ఇందులో 4 కెమెరా లు ఉంటాయి.ఇందులో ఉండే ఓరియో ఆధారిత సాఫ్ట్ వేర్ కూడా నోట్ 5 కంటే దీనికి ఉన్న మరొక అడ్వాంటేజ్. ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. 3 GB వేరియంట్ యొక్క ప్రారంభ ధర రూ 10,999/- నుండీ ఉంటుంది. కెమెరా లు ఇతర ఫీచర్ లు కావాలంటే ఇది ఓకే కానీ ధర విషయం లో మాత్రం కొంచెం అలోచించాల్సిందే.
ఆనర్ 7 X
ఆనర్ 9 లైట్ ధర ఎక్కువగా ఉంది అనుకుంటే ఆనర్ 7X ని ట్రై చేయవచ్చు. దీని కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. డిజైన్ విషయం లో కూడా ఇది మెరుగ్గా ఉంటుంది. రెడ్ మీ కీ దీనికీ ఉన్న ప్రధాన తేడా ఫేస్ అన్ లాక్ ఫీచర్. దీని ధర రూ 11,999/- లు ఉంటుంది.
షియోమీ Mi A1
ఇది కూడా రెడ్ మీ ఉత్పాదనే. కొన్ని రకాలుగా చూసుకుంటే నోట్ 5 కంటే ఇది బెటర్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. రేర్ కెమెరా లో ఇది రెండు సెన్సార్ లను కలిగి ఉంటుంది. సాఫ్ట్ వేర్ అప్ డేట్ లను ఎప్పటికప్పుడు రిసీవ్ చేసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రెడ్ మీ నోట్ 5 కంటే వేయి రూపాయలు ధర ఎక్కువగా ఉంటుంది.
షియోమీ రెడ్ మీ నోట్ 5 ప్రో
ప్రస్తుతం రెడ్ మీ నోట్ 5 కి అందరూ ఆలోచిస్తున్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ఈ నోట్ 5 ప్రో. దీనికి కారణాలు లేకపోలేదు. ఇందులో అప్ గ్రేడెడ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే కెమెరా లు కూడా అప్ గ్రేడ్ చేయబడి ఉంటాయి. రేర్ లో రెండు సెన్సార్ లు ఉంటాయి. 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫేస్ అన్ లాక్ ఫీచర్ ను కూడా తెచ్చే అవకాశం ఉంది.