• తాజా వార్తలు

రూ 25,000/- ల లోపు ధర లో ఉన్న బెస్ట్ లాప్ టాప్ లు మీకోసం

 కొత్త లాప్ టాప్ కొనాలి అనుకుంటున్నారా? రూ 25,000/- ల లోపు ధర లో లభించే మంచి లాప్ టాప్ ల కోసం వెదుకుతున్నారా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్.  ఇవి హై ఎండ్ వీడియో గేమ్ లనూ మరియు ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ను డిమాండ్ చేసే టాస్క్ లను చేయలేకపోవచ్చు. కానీ బేసిక్ టాస్క్ లైన వెబ్ బ్రౌజింగ్,ఈమెయిలు,డాక్యుమెంట్, సోషల్ నెట్ వర్కింగ్,స్ప్రెడ్ షీట్ , HD వీడియో లను చూడడం లాంటి వాటిని చక్కగా చేసుకోవచ్చు.ఇలాంటి టాప్ 10 లాప్ టాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.

లెనోవ ఐడియా పాడ్ 320

దీని ధర రూ 22,933/- లు ఉంటుంది. ఇది NVIDIA Geforce 940 MX అడ్వాన్స్డ్ గ్రాఫిక్స్ తో వస్తుంది.15 ఇంచ్ HD డిస్ప్లే తో పాటు ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ తో పవర్ చేయబడి ఉంటుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం తో నడిచే ఇది 4 GB RAM మరియు 500 GB స్టోరేజ్ ను కలిగిఉంటుంది.5 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ ము ఇస్తుంది.

ఏసేస్ అస్పైర్ 3

దీని ధర రూ 18,999/- లు ఉంటుంది. ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ తో పవర్ చేయబడి ఇంటెల్ గ్రాఫిక్స్ కార్డు ను కలిగి ఉంటుంది. విండోస్ 10 పై నడుస్తూ 15.6 ఇంచ్ డిస్ప్లే, 4 GB RAM,500 GB స్టోరేజ్ కలిగిఉంటుంది. 6.5 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ నూ, usb2.0,3.0, HDMI పోర్ట్, SD కార్డు రీడర్,వైఫై మరియు బ్లూటూత్ లను అందిస్తుంది.

లెనోవా 110-15 ACL

దీని ధర రూ 23,990/- లు ఉంటుంది. 2.5 GHz AMD A8-7410 ప్రాసెసర్ తో పవర్ చేయబడి Radeon గ్రాఫిక్స్ తో వస్తుంది. 4 GB RAM, 1 TB స్టోరేజ్ ను కలిగిఉంటుంది. విండోస్ 10 పై పనిచేస్తూ USB 2.0 ,3.0 వైఫై ,బ్లూ టూత్ ఆప్షన్ లను కలిగి ఉంటుంది.

ఆసుస్ ఈ బుక్

దీని ధర కేవలం రూ 13,999/- లు ఉంటుంది. 2 GB RAM,32 GB స్టోరేజ్ కలిగిఉంటుంది.11.6 ఇంచ్ డిస్ప్లే ను కలిగిఉండి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఇంటెల్ సేలేరాన్ ప్రాసెసర్, HD500 గ్రాఫిక్స్,USB2.0 ,3.0,USB టైపు c ,HDMI పోర్ట్, కార్డు రీడర్, వైఫై, బ్లూటూత్ లు దీని మరిన్ని విశిష్టతలు.

ఏసర్ అస్పైర్ Es15

దీని ధర రూ 16,999/- లు ఉంటుంది. 2 GHz డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలరన్ ప్రాసెసర్, ఇంటెల్ HD గ్రాఫిక్స్,విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ,11.6 ఇంచ్ డిస్ప్లే, 4 GB RAM, 32GB స్టోరేజ్ , వైఫై, USB2.0,3.0, బ్లూ టూత్, HDMI పోర్ట్ లు దీని మరిన్ని ప్రత్యేకతలు

లావా హీలియం 14

దీని ధర రూ 14,999/- లు మాత్రమే ఉంటుంది. 14.1 ఇంచ్ ఫుల్ HD బ్యాక్ లిట్ డిస్ప్లే, 1.44 GHz క్వాడ్ కోర్ ఇంటెల్ x5-Z8350  ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 2 GB RAM, 32 GB స్టోరేజ్,10,000 mAh బ్యాటరీ, వైఫై, బ్లూటూత్, USB2.0,మినీ HDMI పోర్ట్, 2 MP HD వెబ్ క్యాం వీడియో కాలింగ్ లు దీని విశిష్టతలు.

ఆసుస్ వివో బుక్ APU

దీని ధర రూ 22,990/- లు ఉంటుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, AMD APU డ్యూయల్ కోర్ A6 ప్రాసెసర్, 4 GB RAM, 1 TB స్టోరేజ్, 15.6 ఇంచ్ HD డిస్ప్లే, USB2.0, 3.0 , HDMI పోర్ట్, కార్డు రీడర్, బ్లూటూత్, వైఫై లు దీని మరిన్ని ప్రత్యేకతలు.

ఆసుస్ E203NA-FD026

దీని ధర రూ 13,900/- లు ఉంటుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 11.6 ఇంచ్ డిస్ప్లే, 2.4 GHz ఇంటెల్ సెలరన్ N3350 ప్రాసెసర్, ఇంటెల్ HD 500 గ్రాఫిక్స్ కార్డు, 2 GB RAM,32 GB స్టోరేజ్, 10 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ దీని ప్రత్యేకతలు.

iBall CompBook Exemplaire+

దీని ధర రూ 13,999/- లు ఉంటుంది. 1.44 GHz ఇంటెల్ ఆటం x5-Z8350  ప్రాసెసర్, 14 ఇంచ్ డిస్ప్లే, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 4 GB RAM, 32 GB స్టోరేజ్, 7.5 గంటల బ్యాటరీ బ్యాక్ అప్ లు దీని ప్రత్యేకతలు

మైక్రోమాక్స్ కాన్వాస్ లాప్ బుక్

దీని ధర రూ 10,499/- లు ఉంటుంది. ఇది అన్నింటికంటే తక్కువధర లో లభించే లాప్ టాప్ గా చెప్పుకోవచ్చు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 11.6 ఇంచ్ డిస్ప్లే, ఇంటెల్ ఆటం క్వాడ్ కోర్ ప్రాసెసర్,4,100 mAh బ్యాటరీ , 2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ లు దీని విశిష్టతలు.

 

జన రంజకమైన వార్తలు