• తాజా వార్తలు
  •  

HD వీడియో కాల్స్ చేయడానికి బెస్ట్ యాప్స్ ఇవే

తక్కువ ఇంటర్ నెట్ స్పీడ్ లో కూడా మీ కంప్యూటర్ లేదా PC లో హై క్వాలిటీ HD వీడియో కాల్స్ ను అందించే ఫ్రీ వీడియో కాలింగ్ యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో చదువుకుందాం. వీటిని ఉపయోగించి మీరు అన్ లిమిటెడ్ వీడియో కాల్ లను చేయవచ్చు. ప్రస్తుతం యాంత్రిక జీవన శైలి లో మన స్నేహితులను, సన్నిహితులను కలవడం వారితో మాట్లాడడం కూడా గగనం అయిపొయింది. ఈ వీడియో కాల్ లను ఉపయోగించడం ద్వారా అలాంటి యాంత్రిక జీవితం నుండి కాస్తైనా ఉపశమనం లభిస్తుంది కదా!

స్కైప్

ప్రపంచం లోనే బెస్ట్ వీడియో కాలింగ్ సాఫ్ట్ వేర్ ఏదైనా ఉంది అంటే అది స్కైప్ మాత్రమే. ఇందులో వీడియో ,ఆడియో యొక్క క్వాలిటీ చాలా చక్కగా ఉంటుంది. ఇది ఇంటర్ నెట్ డేటా ను కూడా సేవ్ చేస్తుంది. ఇది అన్ని ఫ్లాట్ ఫాం లలోనూ పని చేస్తుంది. దీనిని ఉపయోగించి మీరు ఉచిత గ్రూప్ వీడియో కాల్ లూ,కాన్ఫరెన్స్ కాల్ లూ, కాన్ఫరెన్స్ వీడియో కాల్ లూ కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకించి మీ ఇంటర్ నెట్ కనెక్షన్ స్లో గా ఉన్నపుడు కూడా ఇది చక్కగా పని చేస్తుంది.

Imo మెసెంజర్

ఇది పూర్తి ఉచిత సాఫ్ట్ వేర్. దీనికి ప్రీమియం వెర్షన్ లేదు, కాబట్టి ఇందులో ఉండే అన్ని ఫీచర్ లూ ఉపయోగించుకోవచ్చు.ఇందులో ఏ రకమైన యాడ్ లు ఉండవు. కాకపోతే మీ PC లో దీనిని వాడాలి అంటే తప్పనిసరిగా దీనితో పాటు గూగుల్ క్రోమ్ ను కూడా ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇది కూడా మంచి వీడియో, ఆడియో క్వాలిటీ ని అందిస్తుంది.

Oovoo

ఈ వూవో కూడా ఒక చక్కటి వీడియో కాలింగ్ యాప్. దీని ఇంటర్ ఫేస్ చాలా చక్కగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఒక కొత్త ఎకౌంటు ను ఓపెన్ చేసి లాగ్ ఇన్ అవ్వడం లేదా మీ ఫేస్ బుక్ ఎకౌంటు ద్వారా లాగ్ ఇన్ అవడమే. ఎంచక్కా అద్భుతమైన HD క్వాలిటీ తో కూడిన వీడియో కాల్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.

గూగుల్ హ్యాంగ్ ఔట్స్

మిగతా సాఫ్ట్ వేర్ లతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ ఫీచర్ లను కలిగి ఉంటుంది.ఇది ఆన్ లైన్ వెబ్ బేస్డ్ వీడియో కాలింగ్ ను అందిస్తుంది. కాబట్టి దీనిని ఉపయోగించడానికి ఏ విధమైన సాఫ్ట్ వేర్ లు మీ PC లో ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీ వెబ్ బ్రౌజర్ నుండి డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించాలి అంటే మీ గూగుల్ లేదా జి మెయిల్ ఎకౌంటు ద్వారా లాగ్ ఇన్ అవ్వాలి. 

ఫేస్ బుక్ వీడియో చాట్

ప్రస్తుత సోషల్ మీడియా శకం లో ప్రతీ ఒక్కరికీ ఈ ఫేస్ బుక్ id ఉంటున్న నేపథ్యం లో ఫేస్ బుక్ వీడియో చాట్ అనేది మరొక అత్యుత్తమ వీడియో కాలింగ్ సర్వీస్ గా చెప్పుకోవచ్చు. వీడియో కాల్ ల క్వాలిటీ పెంచడానికి ఫేస్ బుక్ తన వీడియో చాట్ కు ఎక్స్ టెన్షన్ ను కూడా విడుదల చేసింది. ఈ వీడియో చాట్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడవచ్చు, ఎమోషన్స్, ఎమోజి, స్టిక్కర్ లను పంపవచ్చు. pc నుండి మొబైల్ కూ అలాగే మొబైల్ నుండి pc కి వీడియో కాలింగ్ ను అనుమతించే యాప్ ఏదైనా ఉంది అంటే వాటిలో బెస్ట్ యాప్ గా ముందు వరుసలో దీనిని చెప్పుకోవచ్చు. ఇది కూడా తక్కువ ఇంటర్ నెట్ కనెక్షన్ లో పనిచేస్తుంది కానీ వీడియో క్వాలిటీ తక్కువగా వస్తుంది.

వాట్స్ అప్ వీడియో చాట్

వాట్స్ అప్ తన యొక్క బీటా వెర్షన్ లో వీడియో చాటింగ్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఏ వాట్స్ అప్ యూజర్ అయినా సరే తమ తమ ఎకౌంటు లనుండి HD వీడియో కాలింగ్ ను చేసుకోవచ్చు. ఇందులో ఉండే వీడియో క్వాలిటీ నెట్ వర్క్ స్పీడ్ మీద ఆధార పడి ఉంటుంది. వాట్స్ అప్ యొక్క pc వెర్షన్ ను మీ pc లో ఇన్ స్టాల్ చేసుకుంటే కంప్యూటర్ నుండి కూడా వాట్స్ అప్ వీడియో కాల్ లను చేయవచ్చు. వాట్స్ వెబ్ ద్వారా కూడా pc నుండి మొబైల్ కూ అలాగే మొబైల్ నుండి pc కూ వీడియో కాల్ లను చేయవచ్చు.

వైబర్

ఇది ఆడియో కాలింగ్ మరియు వీడియో కాలింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇది హై క్వాలిటీ వీడియో కాలింగ్ ను అందిస్తుంది. లో క్వాలిటీ ఇంటర్ నెట్ లో కూడా పనిచేస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ పూర్తి ఉచితంగా లభిస్తుంది.

వుయ్ చాట్

ఈ యాప్ ను అన్ని ఫ్లాట్ ఫాం లపై ఉపయోగించవచ్చు. ఇది ఇండియన్ యూజర్ లకు స్టికర్ లు, రీఛార్జి లు, కూపన్ లు మొదలైనవాటిని అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ లో బాగా పాపులర్ యాప్. అయితే దీని pc వెర్షన్ లో మరిన్ని అద్భుతమైన ఫీచర్ లు ఉంటాయి.

ఫేస్ టైం యాప్

మీ pc లో వీడియో కాల్ చేసుకోవడానికి మరొక సాఫ్ట్ వేర్ ఈ ఫేస్ టైం యాప్. మ్యూట్ వీడియో, మ్యూట్ ఆడియో, ఫుల్ స్క్రీన్ మోడ్ లాంటి సింపుల్ ఆప్షన్ లు కూడా ఇందులో ఉంటాయి.

జన రంజకమైన వార్తలు