• తాజా వార్తలు

జియో ఆండ్రాయిడ్ గో ఫోన్ తెస్తే జియో ఫోన్ ని ఏం చేయనుంది?

దేశీయ టెలికాం సంచలనం జియో ఫోన్ విజయవంతం అవడం తో తాజాగా తక్కువ ధర లో లభించే ఆండ్రాయిడ్ ఫోన్ ను కూడా ప్రవేశపెట్టే యోచనలో రిలయన్స్ ఉన్నది. ఇప్పటికే తన జియో 4 జి ఫోన్ లను LYF బ్రాండ్ ల ద్వారా అందించడం తో  విస్తృత రీతిలో మార్కెట్ లో యూజర్ లను కలిగి ఉన్నది. అయితే ఇప్పుడు తైవాన్ కు చెందిన చిప్ సెట్ మేకర్ అయిన మీడియా టెక్ తో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం లో భాగంగా తమ నెట్ వర్క్ కు మరింతమంది యూజర్ లను ఆకర్షించే ఉద్దేశం తో అతి తక్కువ ధరలో లభించే 4 జి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయాలి అని అనుకుంటున్నది. గత నెలలో గూగుల్ తన యొక్క ఆండ్రాయిడ్ ఓరియో గో ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. దీనిద్వారా ఇది 1 GB కంటే తక్కువ RAM ను కలిగిఉండే స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయనుంది. ఇండియా లాంటి అభివృద్ది చెందుతున్న దేశాలలో ఇంటర్ నెట్ వినియోగాన్ని మెరుగుపరచడం లో ఇది ప్రముఖ పాత్ర వహించనున్నట్లు టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో రిలయన్స్ తీసుకురానున్న ఈ ఆండ్రాయిడ్ గో ఫోన్ మరింత ప్రాధాన్యత ను సంతరించుకుంది.

ఇది ఎలా ఉండనుంది?       

జియో ఫోన్ విషయం లో అవలంబించిన స్ట్రాటజీ నే ఈ ఆండ్రాయిడ్ గో  ఫోన్ విషయం లోనూ రిలయన్స్ కొనసాగించనుంది. అంటే రూ 0/- లకే స్మార్ట్ ఫోన్ మరియు  జియో సిమ్ కార్డు ను అందించనుంది. తద్వారా ఒక స్మార్ట్ డివైస్ యొక్క ధరను మునుపెన్నడూ చూడనంత తక్కువ స్థాయి కి ఇది దించబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ జియో యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ కు మిలియన్ ల సంఖ్య లో ఆర్డర్ లు రానున్నట్లు అనిపిస్తుంది.

మరి పోటీ ఎలా ఉంది?

ఎయిర్ టెల్ మరియు వోడాఫోన్ లు ఇప్పటికే ఈ తరహా ప్రయోగాలకు శ్రీకారం చుట్టాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకుని రూ 1500/- ల కంటే తక్కువధరలోనే లభించే స్మార్ట్ ఫోన్ లను అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. జియో దానికంటే తక్కువ ధర లో అందించనుండడం తో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇవి మాత్రమే గాక కొన్ని చైనీస్ హ్యాండ్ సెట్ మేకర్ లు కూడా ఈ ఆండ్రాయిడ్ గో టెక్నాలజీ ని ఉపయోగించి అతి తక్కువ ధర లో లభించే స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్ లోనికి వదిలే ఆలోచనలో ఉన్నాయి.మైక్రో మాక్స్ ఇప్పటికే భారత్ వన్ పేరుతో ఆండ్రాయిడ్ ఓరియో గో పవర్డ్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసే యోచనలో ఉంది.

జియో మిషన్  

దేశం లో ఉన్న 500 మిలియన్ల ఫీచర్ ఫోన్ యూజర్ లే టార్గెట్ గా జియో తన మిషన్ ను సెట్ చేసుకుంది. ఈ తక్కువధరలో లభించే జియో ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ లు ఫీచర్ ఫోన్ యూజర్ లను స్మార్ట్ ఫోన్ యూజర్ లుగా మార్చనుంది. జియో ఫోన్ ఇప్పటికే ఫీచర్ ఫోన్ మార్కెట్ లో 27 శాతం షేర్ ను సంపాదించింది.అక్టోబర్-డిసెంబర్ సీజన్ లో ఇది 15 మిలియన్ల దేవిచీ లను అమ్మింది. ఇదే ఊపును ఆండ్రాయిడ్ గో ఫోన్ విషయం లోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

గూగుల్ సపోర్ట్ ఎలా ఉండనుంది?       

ఆండ్రాయిడ్ గో బెటర్ యాప్ లనూ, స్లిమ్ గా ఉండే OS నూ కలిగిఉండనుంది. లోయర్ స్పెసిఫికేషన్ లతో సులువుగా స్మార్ట్ ఫోన్ లపై రన్ అయ్యే కస్టమైజ్డ్ యాప్ లతో ఇది ఉండనుంది. కాబట్టి జియో యొక్క ఆండ్రాయిడ్ గో ఫోన్ కు గూగుల్ తనవంతు సహయాన్ని కూడా ప్రత్యక్షం గానో పరోక్షం గానో అందించనుంది. మీడియా టెక్ గూగుల్ తో కూడా ఈ విషయం లో సంప్రదింపులు జరుపుతుంది.

మరి ఇన్ని సానుకూలతలు కలిగి ఉన్న జియో యొక్క ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ ఏ మేరకు యూజర్ లను ఆకట్టుకోగలదో వేచి చూడాలి .

జన రంజకమైన వార్తలు