• తాజా వార్తలు

మళ్లీ వైరస్ భయం.. విండోస్ రిలీజ్ చేసిన సెక్యూరిటీ ప్యాచెస్ డౌన్ లోడ్ చేసుకోండిలా..

వన్నాక్రై వైరస్ కోట్లాది కంప్యూటర్లను ఎంతగా దెబ్బతీసిందో తెలిసిందే.. ఆ తరువాత కూడా వైరస్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అలాంటి భారీ అటాక్ జరగనుందని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి అంచనాలతోనే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అటాక్స్ అన్నీ ప్రధానంగా తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైనే జరుగుతుండడంతో మరింత సెక్యూరిటీ కల్పించేందుకు కసరత్తు చేస్తోంది.
ఆటోమేటిక్ అప్ డేట్ తో..
మళ్లీ వైరస్‌ అటాక్స్ జరిగితే ఎదుర్కొనేందుకు వీలుగా మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు కొత్త సెక్యూరిటీ ప్యాచ్‌లను తాజాగా విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10, 8.1 వాడుతున్న వారు ఆటోమేటిక్ అప్‌డేట్ పెట్టుకుని ఇప్పటికే అప్‌డేట్ చేసుకుని ఉంటే వారు ఈ కొత్త ప్యాచ్‌లను మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన పనిలేదు.
పాత వెర్షన్లయితే డౌన్లోడ్ చేసుకోవాల్సిందే..
పాత వెర్షన్లను వాడేవారు మాత్రం ఈ కొత్త ప్యాచ్‌లను కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాతతరం విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుతున్న వారు కూడా ఈ సెక్యూరిటీ ప్యాచ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి...
మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన ఈ ప్యాచ్ లు డౌన్ లోడ్ చేసుకోవాలంటే మైక్రో సాఫ్ట్ డౌన్‌లోడ్ సెంటర్ వెబ్‌సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే అప్‌డేట్ కేటలాగ్ వెబ్‌సైట్‌ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు