• తాజా వార్తలు
  •  

కొత్త టెక్ సంవ‌త్స‌రం

సాధార‌ణంగా ఏప్రిల్ 1 అంటే ఆల్ ఫూల్స్ డే. కానీ మ‌న ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ ఆ రోజే మొద‌లవుతుంది. కానీ ఈ ఏప్రిల్ 1 కొత్త టెక్ సంవ‌త్స‌రంగా కూడా మార‌బోతోంది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు, టెక్నాల‌జీ ప‌ర‌మైన ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌జ‌లు అనివార్యంగా అందిపుచ్చుకోవాల్సిన ఘ‌ట‌న‌లు గ‌త ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో ఎన్నో చోటు చేసుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.
డీమానిటైజేష‌న్‌
సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ డీ మానిటైజేష‌న్ పేరుతో ర‌ద్దు చేసిన పాత 500, 1000 నోట్లు ఇక ఎక్క‌డా చెల్ల‌వు. ఆర్బీఐ ల‌లో మార్చుకునే గ‌డువు కూడా నిన్న‌టితో ముగిసిపోయింది. కేవ‌లం ఎన్నారైల‌కు మాత్రం మ‌రో మూడు నెల‌లు అదీ ఒక్కొక్క‌రు రూ.25వేల మార్చుకునే వెసులుబాటును ఆర్బీఐ క‌ల్పించింది. మ‌నీ ట్రాన్సాక్ష‌న్‌ను త‌గ్గించి డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్‌ను పెంచి బ్లాక్ మ‌నీని అరికట్టాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం బ్యాంకింగ్ తెచ్చిన క‌ఠిన నిబంధ‌న‌లు ఇక నుంచి మ‌రింత ప‌క్కాగా అమ‌లు చేయ‌బోతున్నారు. ఏటీఎంల్లో త‌గినంత మ‌నీ లేక‌పోవ‌డం, ఎక్కువ సార్లు బ్యాంకుల‌కు వెళ్లి ట్రాన్సాక్షన్లు చేస్తే ఛార్జీలు వ‌సూలు చేస్తుండ‌డంతో ఇక‌పై ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫ‌ర్‌లు, క్యాష్ ట్రాన్సాక్ష‌న్ల‌కు బ‌దులు డిజిట‌ల్ లావాదేవీలు పెర‌గ‌నున్నాయి. ఆన్‌లైన్‌, నెట్ బ్యాంకింగ్‌, పేటీఎం, మొబీక్విక్ వంటి వాలెట్లు డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో అంద‌రూ అల‌వాటు చేసుకున్నారు. కాబ‌ట్టి డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు కొన‌సాగుతున్నాయి.
డేటా చౌక‌ మొబైల్ రంగానికి వ‌స్తే జియో తెచ్చిన సంచ‌ల‌నం సెల్ కంపెనీల ధ‌ర‌ల దూకుడుకు క‌ళ్లెం వేసి మొబైల్ ఇంట‌ర్నెట్‌ను చౌక‌గా మార్చింది. దేశంలో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు పెర‌గ‌డానికి ఇది కూడా కార‌ణ‌మైంద‌ని చెప్పాలి. మిగ‌తా కంపెనీల‌న్నీ ప్రైస్‌వార్‌కు దిగాయి. డేటావిండ్ వంటి కొత్త కంపెనీలు ఈ రంగంలోకి వ‌చ్చి పోటీ హీట్‌ను మ‌రింత పెంచుతున్నాయి. దీంతో డేటా ఇక అందుబాటు ధ‌రల్లోనే ఉండ‌నుంది. మ‌న‌లాంటి పెద్ద దేశంలో డిజిట‌ల్ లిట‌రసీ పెర‌గ‌డానికి ఇది మేలు చేయ‌నుంది.
ఆన్‌లైన్ మ‌రింత ద‌గ్గ‌ర‌.. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల‌తో వ‌స్తువు లేదా సేవ‌లు వినియోగ‌దారుల‌కు చౌక‌గా అందుతున్నాయి. బిగ్‌బాస్కెట్‌, పేటీఎం ఇలా చాలా సంస్థ‌లు ఆన్ లైన్‌లో వ‌స్తువు ఆర్డ‌రిస్తే క్యాష్ బ్యాక్‌లు ఇస్తున్నాయి. రైల్వే టిక్కెట్లు ఆన్‌లైన్లో బుక్ చేస్తే స‌ర్వీస్ టాక్స్ లేదు. దీన్ని మ‌రో మూడు నెల‌లు పొడిగించిన‌ట్లు రైల్వే ప్ర‌క‌టించింది.
క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్లు నేటి నుంచి రూ.2 లక్షలకు పైగా నగదు చెల్లింపులను ప్రభుత్వం నిషేధించింది. అలా చేస్తే అపరాధ రుసుములను కట్టాల్సి రావొచ్చు. అందుకే చాలా వ‌ర‌కు డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతాయి. క్యాష్ అందుబాటు త‌క్కువ ఉంది క‌నుక చిన్న చిన్న క్యాష్ ట్రాన్సాక్ష‌న్ల‌కు జ‌నం ముందుకొస్తున్నారు. దీన్ని మ‌రింత పెంచేందుకు పీఓఎస్‌ యంత్రాలు/కార్డులు, బ‌యోమెట్రిక్ (వేలిముద్రల ఆధారంగా పనిచేసే ) యంత్రాల ధ‌ర‌ను బ‌డ్జెట్లో త‌గ్గించారు.
వాలెట్ల జోరు పేటీఎం, మొబీక్విక్‌, ఫ్రీఛార్జి వంటి మొబైల్ వాలెట్ల‌తో చెల్లింపులు అంత‌కు ముందు కూడా ఉన్నా గ‌త ఆరు నెల‌ల్లో బాగా పెరిగాయి. పేటీఎం వాలెట్ల సంఖ్య‌ను ఐదేళ్ల‌లో పెంచాల‌ని కంపెనీ పెట్టుకున్న టార్గెట్‌ను డీమానిటైజేష‌న్ నేప‌థ్యంలో 15 రోజుల్లోనే చేరుకుంది. మిగిలిన వాలెట్ల వినియోగమూ బాగా పెరిగింది. జోరు ముందు ముందు మ‌రింత పెర‌గ‌నుంది.

జన రంజకమైన వార్తలు