• తాజా వార్తలు
  •  

ఫోన్ కేసులందు ఇవి పూర్తిగా వేర‌యా!

వేలాది రూపాయిలు పోసి ఫోన్‌లు కొనుక్కుంటాం. కానీ  ఆ ఫోన్ల‌ను ప‌రిర‌క్షించే కేసుల‌ను, క‌వ‌ర్ల‌ను మాత్రం చాలా నాసిర‌కంగా వేస్తాం. కానీ చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏమిటంటే ఈ కేసుల వ‌ల్లే మ‌న ఫోన్లు చాలా వ‌ర‌కు డ్యామేజ్ అవుతున్నాయ‌ని.  అయితే రూ.20 వేలు పెట్టి ఫోన్ క‌న్నాక..  ఎలాంటి  కేసులు తీసుకోవాలి అనే విష‌యంపై చాలామందికి అవ‌గాహ‌న ఉండ‌దు.  మ‌న ఫోన్‌కు ర‌క్ష‌ణ నిల‌వ‌డంలో కేసుల‌ది ప్ర‌త్యేక పాత్ర .  మ‌రి అలాంటి కేసుల్లో ఉత్త‌మ‌మైన‌వి ఏంటో చూద్దామా...

బ్యాట‌రీ కేసులు
ఈ త‌ర‌హా కేసులు మీ  ఫోన్‌ను కాపాడ‌డం మాత్ర‌మే కాదు మీ ఫోన్ ఛార్జింగ్ స‌రిగా అయ్యేందుకు కూడా సాయం చేస్తాయి. యాపిల్  ఐఫోన్ కోసం ప్ర‌త్యేకంగా కొన్ని బ్యాట‌రీ కేసులు వ‌చ్చాయి. ఇవి ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న ఫోన్ స్క్రీన్ మీద బ్యాట‌రీ స్టేట‌స్ చూపిస్తాయి.  ఎంతసేప‌ట్లో మీ ఫోన్ మొత్తానికి ఆగిపోతుందో కూడా చెబుతాయి. దాన్ని బ‌ట్టి ఒక అంచ‌నాతో  మ‌నం ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ఈ  ర‌కం కేసులు  ఇప్పుడు అమేజాన్ ద్వారా  ల‌భ్యం అవుతున్నాయి. 

టూల్‌కిట్ కేసులు
మ‌న ఫోన్ ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటే మ‌న‌కు మ‌న‌మే బాగు  చేసుకోవ‌డం లేదా చేసుకోవ‌డానికి కూడా అవ‌కాశాన్నిచ్చే  కేసులు అందుబాటులోకి వ‌చ్చాయి. వాటినే టూల్‌కిట్ కేసులు అంటారు. స్విట్జ‌ర్లాండ్‌లో ఈ త‌ర‌హా కేసులు ఎక్కువ‌గా అమ్ముడుపోతున్నాయి.  ఈ కేసుల్లో స్కూడ్రైవ‌ర్‌, స్ర్పింగింగ్ సిజ‌ర్స్‌, న‌యిల్ క్లీన‌ర్స్‌, న‌యిల్ ఫైల్ లాంటి టూల్స్ ఉంటాయి. అంటే ఈ  న‌యిల్ ఫైల్‌తో మీ ఖాళీ స‌మ‌యాల్లో గోళ్లు తీసుకునే అవ‌కాశం కూడా  ఇది క‌ల్పిస్తోంది.  ఇది ఫ‌న్నీగా అనిపించినా... చాలామంది వాడుతున్నారీ టూల్‌ని.

ఎల్ఈడీ  కేసులు
మీ ఫోన్‌ను త‌ళ‌త‌ళాడించేందుకు కొన్ని కేసులు అందుబాటులో ఉన్నాయి. ఎల్ఈడీ కేసులు అంటారు వీటిని. అంటే ఎల్ఈడీ టెక్నాల‌జీ ఆధారంగా ఇవి ప‌ని చేస్తాయి. ఫోన్‌తో పాటు కేసులు కూడా కొత్త‌గా ఉండాల‌ని కోరుకునే వాళ్ల కోసం ఇదో మంచి ప్రత్యామ్నాయం.

వాలెట్ కేసులు
ఇప్పుడు  మీ ఫోన్ కేసులోనే అన్ని క్యారీ చేసే  అవ‌కాశం వ‌చ్చింది. ఐఫోన్ యూజ‌ర్లు ఇలాంటి కేసుల‌ను వాడేస్తున్నారు కూడా. అవే వాలెట్ కేసులు. అంటే ఈ కేసుల్లో వాలెట్‌ల‌తో  పాటు  మ‌నీ, కార్డులు కూడా పెట్టుకుని ఎక్క‌డికైనా వెళ్లిపోవ‌చ్చు. ఐడీ కార్డుల‌ను కూడా దీనిలోనే పెట్టుకునే అవ‌కాశం ఉంది.   

ఇవేకాక రిస్ట్‌లెట్ కేసులు, మాడ్యుల‌ర్ కేసులు, వాట‌ర్‌ఫ్రూఫ్ కేసులు, సెల్ఫీ కేసులు, కీబోర్డు కేసులు,  సిమ్ స్టాండ్ బ్యాట‌రీ కేసులు, ఫానీ పాక్ కేసులు లాంటి భిన్న‌మైన కేసులు మ‌న‌కు మార్కెట్లో ల‌భ్యం అవుతున్నాయి.  

జన రంజకమైన వార్తలు