• తాజా వార్తలు
  •  

ఫోటోలలో అనవసర ఆబ్జెక్ట్ లను చిటికెలో రిమూవ్ చేసే ఉచిత వెబ్ సైట్ మీకోసం

అందంగా ఫోటో లను తీయడం మీ హాబీ నా ? మీరు తీస్తున్న ఫోటో లను మరింత అందంగా మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. మనం ఏదైనా ఫోటో తీసేటపుడు ఆ ఫోటో లో అనవసరమైన వస్తువులు కూడా క్యాప్చర్ అవుతాయి. అవి ఉంటే మీరు తీసిన ఫోటో లు అంత అందంగా కనిపించవు. ఉదాహరణకు మీరు ఏదైనా ప్రముఖ ప్రదేశాన్ని కానీ కట్టడాన్ని కానీ ఫోటో తీస్తున్నారు అనుకోండి. ఆ ఫోటో లో వాటితో పాటు టూరిస్టులు కూడా క్యాప్చర్ చేయబడతారు. వాళ్ళని పక్కకి వెళ్ళమని మనం చెప్పలేము. మరి వాటిని తొలగించడం ఎలా? లూనా పిక్ అనే ఒక వెబ్ సైట్ ద్వారా మీ ఫోటో ల అందాన్ని చెడగొట్టే అనవసరమైన ఆబ్జెక్ట్ లను ఇట్టే తొలగించుకోవచ్చు. కేవలం రెండే రెండు స్టెప్ లలో మీ ఫోటో లలో ఉన్న అనవసరమైన వాటిని తొలగించుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా మీ ఫోటో ను లోడ్ చేయడం, మీకు అవసరం లేని ఫోటో లను సెలెక్ట్ చేసి రిమూవ్ చేసుకోవడమే. దీని గురించి మరింత వివరంగా ఈ ఆర్టికల్ లో చూద్దాం .

ఇది ఎలా పనిచేస్తుంది?                             

ఫోటో లనుండి అనవసరమైన ఆబ్జెక్ట్ లను తొలగించడం అనేది ఈ లూనా పిక్ అనే వెబ్ టూల్ ద్వారా చేసుకోవచ్చు. https://www168.lunapic.com/editor/?action=crop&tool=wand ద్వారా దీనిని ఓపెన్ చేయవచ్చు.

మొదటగా మీరు ఏ ఫోటో నుండి అయితే అనవసర ఆబ్జెక్ట్ లు తొలగించుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటో ను ఇందులో అప్ లోడ్ చేయాలి. దీనిని మీ కంప్యూటర్ నుండి కానీ లేదా యుఆర్ఎల్ ద్వారా కానీ అప్ లోడ్ చేయవచ్చు.

ఫోటో అప్ లోడ్ చేయబడిన తరవాత లూనా పిక్ వెబ్ సైట్ లో ఫుల్ సైజు లో ఓపెన్ చేయబడుతుంది. ఆ తర్వాత ఆ ఫోటో లో మీకు అవసరం లేని ఆబ్జెక్ట్ లను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికోసం అనేకరకాల సెలక్షన్ టూల్ లు ఉన్నాయి. ఆబ్జెక్ట్ షేప్ ను బట్టి ఈ క్రింది వాటిలో ఎదో ఒక టూల్ ను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.

rectangle  దీర్ఘ చతురస్రాకారం  సెలక్షన్

circle వృత్తాకార సెలక్షన్

polygon లేదా ఫ్రీ ఫాం సెలక్షన్

మ్యాజిక్ వ్యాండ్ సెలక్షన్

సంక్లిష్ట మైన ఆకృతులలో ఉన్న ఆబ్జెక్ట్ లను సెలెక్ట్ చేసుకోవడానికి మేజిక్ వాండ్ ఉపయోగపడుతుంది.ఇందులో మీరు త్రెషోల్డ్ పర్సంటేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత రిమూవ్ & ఇన్ పెయింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అంతే మీరు సెలెక్ట్ చేసిన ఏరియా మీ ఫోటో నుండి మాయం అవుతుంది.

ఈ విధంగా మీరు తీసిన ఫోటో లలో మీకు నచ్చినవి మాత్రమే ఉంది మిగతావి రిమూవ్ చేసుకుని మీ ఫోటోలను మరింత అందంగా తయారు చేసుకోవచ్చు.

 

 

జన రంజకమైన వార్తలు