రోజురోజుకీ అనేక రకాల నూతన మోడల్ లు, స్పెసిఫికేషన్ లతో కూడిన స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోనికి ప్రవేశిస్తూ ఉండడం తో అప్పటివరకూ ఉన్న ఫోన్ ల ధరలలో తగ్గుదల ఉంటుంది. ఈ ట్రెండ్ లో ఈ మధ్య భారీగా ధర తగ్గిన కొన్ని ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
నోకియా 8 , నోకియా 5
నోకియా తన ఫ్లాగ్ షిప్ మొబైల్ ల ధర ను అమాంతం తగ్గించింది. నోకియా 8 ధర ఇంతకుముందు రూ 36,999/- గా ఉండగా ఒక్కసారిగా 8 వేలు తగ్గి రూ 28,999/- అయింది. అలాగే రూ 13,499/- గా ఉన్న నోకియా 5 యొక్క ధర వేయి రూపాయలు తగ్గింది.
సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ లు
సామ్సంగ్ గాలక్సీ J7 Nxt ధర రూ 18,790/- లు ఉండగా రూ 3,890/- లు తగ్గింది. సామ్సంగ్ గాలక్సీ J7 ప్రైమ్ ధర కేవలం రూ 13,900/- లు మాత్రమే ఉన్నది . సామ్సంగ్ గాలక్సీ J2 ప్రో యొక్క ప్రారంభ ధర రూ 9,890/- లు ఉండగా రూ 2,200/- లు తగ్గి రూ 7,690/- లకే లభిస్తుంది. ఇక గాలక్సీ J2 అయితే రూ 800/- లు తగ్గి రూ 6,590/- కే లభిస్తుంది.
మోటోరోలా
రూ 11,999/- లు ప్రారంభ ధర గా కలిగిన మోటో G5S రూ 3,500/- లు తక్కువలో లభిస్తుంది.మోటో G5S అయితే రెండువేల రూపాయల ధర తగ్గి రూ 11,999/- లకే లభిస్తుంది. మోటో G5 అయితే మూడువేల రూపాయల ధర తగ్గి రూ 13,999/- లకే లభిస్తుంది.
వివో
బెజల్ లెస్ స్మార్ట్ ఫోన్ అయిన వివో V7 యొక్క ధర రూ 18,990/- లు ఉండగా రూ 2,000/- లు తక్కువగా రూ 16,990/- లకే లభిస్తుంది. రూ 14,900/- లకు లాంచ్ అయిన వివో Y69 మోడల్ అయితే వేయి రూపాయలు తక్కువగా లభిస్తుంది. ఇక చివరిగా వివో Y55S అయితే రూ 1500/- లు తగ్గి కేవలం రూ 10,490/- లకే లభిస్తుంది.
హానర్ 8 ప్రో
రూ 29,999/- ల ప్రారంభ ధరతో లాంచ్ అయిన హానర్ 8 ప్రో మొబైల్ అనూహ్యంగా రూ 4,000/- లు తగ్గి రూ 25,999/- లకే లభిస్తుంది.
ఒప్పో A71
గత సెప్టెంబర్ లో రూ 12,999/- లతో లాంచ్ అయిన ఒప్పో A71 స్మార్ట్ ఫోన్ రూ 3,000/- లు తగ్గి రూ 9,990/- లకే లభిస్తుంది.
HTC U11
ఇండియా లోని హై ఎండ్ స్మార్ట్ ఫోన్ లలో ఒకటి అయిన HTC U11 గత జూన్ లో రూ 51,990/- లతో లాంచ్ అవగా ప్రస్తుతం దీని ధర రూ 5,991/- లు తగ్గి రూ 45,999/- లకే లభిస్తుంది.
బ్లాక్ బెర్రీ కీ వన్
గత ఆగస్ట్ లో రూ 39,990/-లతో లాంచ్ అయిన బ్లాక్ బెర్రీ కీ వన్ రూ 4,000/- ధర తగ్గి రూ 35,999/-లకు లభిస్తుంది.
కూల్ పాడ్
కూల్ పాడ్ కూల్ 1 యొక్క ధర రూ 14,999/- లు ఉండగా ఒక్కసారి గా దీనిధర రూ 6,000/- లు తగ్గింది. దీని మరొక వేరియంట్ ధర రూ 4,000/- లు తగ్గింది. అలాగే రూ 11,999/- లతో లాంచ్ అయిన కూల్ పాడ్ నోట్ 5 యొక్క ధర రూ 4,000/- లు తగ్గింది. ఇక చివరిగా కూల్ పాడ్ నోట్ 5 లైట్ యొక్క ధర రూ 3,000/- లు తగ్గి రూ 5,999/- లకే లభిస్తుంది.