గూగుల్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ను గత ఆగస్ట్ లోనే విడుదల చేసింది. కొన్ని డివైస్ లు ఇప్పటికే ఈ ఆపరేటింగ్ సిస్టం ను తమ స్మార్ట్ ఫోన్ లలో అప్ డేట్ చేసుకున్నాయి. అయితే ఈ అప్ డేట్ పొందని స్మార్ట్ ఫోన్ లు ఇప్పటికీ చాలా ఉన్నాయి. దీనికంటే ముందు వెర్షన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.1.2 గా ఉన్నది. చాల కంపెనీలు తమ డివైస్ లన్నింటిలో ఇంకా నౌగాట్ వెర్షన్ నే అప్ డేట్ చేసుకోలేదు, ఇక ఓరియో మాట దేవుడెరుగు. ఈ నేపథ్యం లో ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ఇస్తారు? అన్న ప్రశ్న కు ప్రతీ మాన్యుఫాక్చర్ ఇచ్చిన సమాధానాలను విశ్లేషించి ఒక ఆర్టికల్ రూపంలో ఇస్తున్నాము.
ఆల్కాటెల్
లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్ డేట్ లను అందుకోవడం లో ఆల్కా టెల్ ఎప్పుడూ కొంచెం నిదానంగా ఉంటుంది. దీనినుండి వచ్చిన లేటెస్ట్ డివైస్ ఐడల్ 5S. ఈ డివైస్ కూడా నౌగాట్ వెర్షన్ తో వచ్చింది. ఈ కంపెనీ యొక్క తక్కువ ధర లో లభించే హ్యాండ్ సెట్ లన్నీ నౌగాట్ తోనే లభిస్తున్నాయి. అదికూడా ఈ మధ్యనే ఈ వెర్షన్ ను అప్ డేట్ చేసుకున్నాయి. క్రితం వరకూ మార్ష్ మాలో తోనే నడిపించాయి. ఇక ఓరియో నుఎప్పుడు తీసుకువస్తారు? అన్న ప్రశ్న కు ఇంకా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. కాబట్టి ప్రకటన వచ్చే వరకూ వేచిచూడడమే!
ఆసుస్
ఈ సంవత్సరం ద్వితీయార్థం లో ఇది పూర్తో స్థాయి లో ఓరియో ను అప్ డేట్ చేసుకోనుంది.
ఇప్పటికే ఈ అప్ డేట్ ను పొందిన ఆసుస్ ఫోన్ లు
జెన్ ఫోన్ 4
జెన్ ఫోన్ 3 మాక్స్
జెన్ ఫోన్ 3
తప్పనిసరిగా ఈ అప్ డేట్ పొందే వీలున్న ఆసుస్ ఫోన్ లు
జెన్ ఫోన్ 4 ప్రో, జెన్ ఫోన్ 4 సెల్ఫీ,జెన్ ఫోన్ 4 సెల్ఫీ ప్రో, జెన్ ఫోన్ 4 మాక్స్ , జెన్ ఫోన్ 4 మాక్స్ ప్రో, జెన్ ఫోన్ 3 డీలక్స్, జెన్ ఫోన్ 3 లేసర్, జెన్ ఫోన్ 3 జూమ్
బ్లాక్ బెర్రీ
బ్లాక్ బెర్రీ విషయం లో కూడా ఇంకా ఏ విధమైన కన్ఫర్మేషన్ లేనప్పటికీ తన కీ వన్ ఫోన్ ను ఓరియో ను అప్ డేట్ చేసే అవకాశం ఉంది.
ఈ అప్ డేట్ ను రిసీవ్ చేసుకోనున్న బ్లాక్ బెర్రీ ఫోన్ లు
కీ వన్
మోషన్
ఎసెన్షియల్
ఎసెన్షియల్ తన PH1 స్మార్ట్ ఫోన్ లో ఈ ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ ను తీసుకురానుంది.
గూగుల్
ఆండ్రాయిడ్ అప్ డేట్ లను త్వరగా అందుకోవడం లో గూగుల్ డివైస్ లు ఎప్పుడూ ముందుంటాయి.
ఇప్పటికే ఈ అప్ డేట్ ను పొందిన గూగుల్ ఫోన్ లు
పిక్సెల్, పిక్సెల్ XL, నెక్సస్ 6P, నెక్సస్ 5X
HMD గ్లోబల్ ( నోకియా )
నోకియా ఫోన్ లకు అధికారిక తయారీదారు అయిన HMD గ్లోబల్ తన లేటెస్ట్ ఫోన్ లు అన్నింటినీ ఓరియో తోనే తీసుకువస్తుంది.
ఓరియో ను ఇప్పటికే రిసీవ్ చేసుకున్న నోకియా ఫోన్ లు
నోకియా 8, నోకియా 6, నోకియా 5
అప్ డేట్ ను కన్ఫాం చేసుకున్న నోకియా ఫోన్ లు
నోకియా 3
నోకియా 2
హానర్
హానర్ తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లు కొన్నింటికి ఈ అప్ డేట్ ను అందించనున్నట్లు ప్రకటించింది.
అప్ డేట్ ను రిసీవ్ చేసుకున్న హానర్ ఫోన్ లు
హానర్ 9
హానర్ 8 ప్రో
అప్ డేట్ ను కన్ఫాం చేసుకున్న హానర్ ఫోన్ లు
హానర్ 7 X
అప్ డేట్ కు అనుకూలంగా ఉన్న హానర్ ఫోన్ లు
హానర్ 8
HTC
ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ను పొందిన మొట్టమొదటి నాన్-గూగుల్ ఫోన్ గాHTC నిలిచింది.
అప్ డేట్ ను పొందిన HTC ఫోన్ లు
HTC U11, HTC U11 LIFE, HTC U 11 Plus, HTC 10
అప్ డేట్ ను కన్ఫాం చేసుకున్న HTC ఫోన్ లు
HTC U అల్ట్రా
హువాయి
ఇప్పటికే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లకు ఈ అప్ డేట్ ను అందించిన హువాయి మిగతా వాటికి కూడా అతి త్వరలోనే ఓరియో ను అందించనుంది.
అప్ డేట్ ను రిసీవ్ చేసుకున్న హువాయి ఫోన్ లు
హువాయి మేట్ 9
అప్ డేట్ ను కన్ఫాం చేసుకున్న హువాయి ఫోన్ లు
హువాయి P10
హువాయి P10 ప్లస్
లెనోవా
జూన్ 2018 కల్లా లెనోవా తన డివైస్ లకు ఓరియో అప్ డేట్ ను అందించనుంది.
అప్ డేట్ ను కన్ఫాం చేసుకున్న లెనోవా ఫోన్ లు
లెనోవ K8, లెనోవా K8 నోట్, లెనోవా K8 ప్లస్
LG
LG G6, LG V30 స్మార్ట్ ఫోన్ లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ ను అందించనుంది.
మోటోరోలా
నిర్దిష్ట కాల పరిమితి ఏమీ చెప్పనప్పటికీ అతి త్వరలోనే మోటోరోలా తన డివైస్ లు అన్నింటికీ ఓరియో అప్ డేట్ ను అందించనున్నట్లు ప్రకటించింది.
అప్ డేట్ ను రిసీవ్ చేసుకున్న మోటోరోలా ఫోన్ లు
మోటో Z2 ఫోర్సు
మోటో X4
అప్ డేట్ ను రిసీవ్ చేసుకోనున్న మోటోరోలా ఫోన్ లు
Moto Z, Moto Z droid, Moto Z Force Droid, Moto Z Play, Moto Z Play Droid, Moto Z2 Play, Moto z2 Force, Moto G4 plus, Moto G5, Moto G5 Plus, Moto G5S, Moto G5S Plus
వన్ ప్లస్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0 ను ఆధారంగా చేసుకుని వన్ ప్లస్ ఆక్సిజెన్ OS5 ను రిలీజ్ చేసింది. కొన్ని డివైస్ లకు ఈ ఫిబ్రవరి లోనే ఈ అప్ డేట్ ను అందించగలిగింది కానీ కొన్ని మాత్రం అలాగే మిగిలిపోయాయి.
అప్ డేట్ ను రిసీవ్ చేసుకున్న వన్ ప్లస్ ఫోన్ లు
వన్ ప్లస్ 5 T, వన్ ప్లస్ 5, వన్ ప్లస్ 3, వన్ ప్లస్ 3 T.
సామ్సంగ్
స్మార్ట్ ఫోన్ దిగ్గజం అయిన సామ్సంగ్ కూడాటి త్వరలోనే ఓరియో ఫోన్ లను తీసుకురానున్నట్లు ప్రకటించింది.
అప్ డేట్ ను రిసీవ్ చేసుకున్న సామ్సంగ్ ఫోన్ లు
సామ్సంగ్ గాలక్సీ S8, సామ్సంగ్ గాలక్సీ S8 ప్లస్
అప్ డేట్ ను కన్ఫాం చేసుకున్న సామ్సంగ్ ఫోన్ లు
గాలక్సీ నోట్ 8, గాలక్సీ S6, గాలక్సీ S6 ఎడ్జ్, గాలక్సీ S6 ఎడ్జ్ ప్లస్, గాలక్సీ నోట్ 5
అప్ డేట్ ను వీలున్న సామ్సంగ్ ఫోన్ లు
గాలక్సీ S7, గాలక్సీ S7 ఎడ్జ్
సోనీ
సోనీ కూడా ఇప్పటికే ఈ అప్ డేట్ ను తన డివైస్ లకు అందించడం ప్రారంభించింది.
అప్ డేట్ ను రిసీవ్ చేసుకున్న సోనీ ఫోన్ లు
Xperia XZ premium
Xperia XZ
Xperia XZs
Xperia X performance
Xperia X compact
Xperia X
అప్ డేట్ ను కన్ఫాం చేసిన సోనీ ఫోన్ లు
Xperia XA1 Plus
Xperia XA1
Xperia XA1 Ultra
Xperia Touch