• తాజా వార్తలు
  •  

ఉచిత వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లలో టాప్ 5 మీ కోసం

ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్ లలో టాప్ 5 సర్వీస్ లను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ఉపయోగించి మీరు మీ టీం తో వీడియో కాన్ఫరెన్సింగ్ సెషన్ లను నిర్వహించుకోవచ్చు. ఇవి మీకు ఒక ప్రైవేటు రూమ్ ను ఏర్పాటు చేయడం ద్వారా మీ టీం మెంబర్ లను ఇన్వైట్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తాయి. ఇవి పూర్తిగా వెబ్ ఆధారిత సర్వీసు లు. అంటే వీటికోసం ఏ విధమైన ప్లగ్ ఇన్ లు, సాఫ్ట్ వేర్ లు మరియు బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ లు డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా ఒక మంచి ఇంటర్ నెట్ కనెక్షన్ మాత్రమే. ఇక మీరు హై క్వాలిటీ వీడియో కాన్ఫరెన్స్ ను అనుభవించవచ్చు.

వీడియో చాట్ మాత్రమే కాకుండా ఇవి మధ్య లో టెక్స్ట్ ఆప్షన్, స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్ లాంటి ఇతర ఫీచర్ లను కూడా కలిగి ఉంటాయి. వీటి గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం,

Hubl.in

అత్యుత్తమ ఉచిత ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ సర్వీసు లలో ఇది ఒకటి. ఇది పూర్తి ఉచితంగానూ మరియు ఓపెన్ సోర్సు సర్వీస్ గానూ లభిస్తుంది. అంటే సెషన్ ల సంఖ్య లో గానీ, యూజర్ ల సంఖ్య కు గానీ కాన్ఫరెన్స్ సమయం లో గానీ ఏ విధమైన పరిమితులు ఉండవన్నమాట.

దీనిని ఉపయోగించడం ఎలా ?

మొదటగా దీనియొక్క హోం పేజి ని విజిట్ చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ రూమ్ కు ఒక URL ను క్రియేట్ చేసుకోవాల్సిందిగా అడుగుతుంది.

మీకు నచ్చిన సఫిక్స్ తో URL క్రియేట్ చేసుకున్న తర్వాత మీ పేరు ఎంటర్ చేసి ఒక రూమ్ ను కూడా క్రియేట్ చేసుకోవాలి. వీడియో క్వాలిటీ ని సెలెక్ట్ చేసుకోవాలి.

సెషన్ స్టార్ట్ చేసేందుకు ఆ తర్వాత నెక్స్ట్ అనే బటన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో చాట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇది కాన్ఫరెన్స్ లో పాల్గొనే మెంబర్ లను ఇన్వైట్ చేయాల్సిందిగా అడుగుతుంది. క్రింద ఉన్న ఇన్వైట్ అనే ఐకాన్ ను క్లిక్ చేసి ఈ మెయిల్ ద్వారా ఇన్విటేషన్ లను పంపాలి.

ఒక్కసారి చాట్ లో జాయిన్ అయిన తర్వాత అందరు సభ్యులు మీకు స్క్రీన్ క్రింద భాగం లో కనిపిస్తారు. ఈ స్క్రీన్ ను మీరు ఎలా కావాలంటే అలా ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. మ్యూట్ మెంబర్, డిజబుల్ వెబ్ క్యాం, మ్యూట్ ఆడియో మరియు స్టార్ట్ టెక్స్ట్ చాట్ లాంటి ఇతర ఆప్షన్ లను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు,

వెబ్ రూమ్         

ఇది మరొక ఉత్తమ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసు.ఇది కూడా పూర్తి ఉచితంగా లభిస్తుంది. అయిరే ఒక సింగిల్ రూమ్ లో మీరు కేవలం 8 మంది సభ్యులను మాత్రమె ఇన్వైట్ చేయగలరు. కానీ సెషన్ ల సంఖ్య పై మాత్రం ఏ విధమైన పరిమితులు లేవు. hubl.in లో ఉండే మిగతా ఫీచర్ లన్నీ దాదాపుగా ఇందులో కూడా ఉంటాయి.

ఉపయోగించడం ఎలా?

WebRoom ను విజిట్ చేసిన తర్వాత మీరు ఒక అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. అ తరవాత మీ పేరు , ఈ మెయిల్ లను ఎంటర్ చేసి క్రియేట్ యువర్ రూమ్ అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక వీడియో కాన్ఫరెన్స్  రూమ్ ఓపెన్ అవుతుంది.

ఇన్వైట్ బటన్ పై క్లిక్ చేసి మీ మెంబర్ లను ఇన్వైట్ చేయవచ్చు. ఈ మెయిల్ షేరింగ్ ద్వారా మీరు ఈ ఇన్విటేషన్ ను పంపవచ్చు.

అందరూ వీడియో చాట్ లోనికి వచ్చాక అందరినీ మీరు ఒకేసారి చూడవచ్చు. ఇక్కడ కూడా మీరు వీడియో చాట్ మధ్య లో టెక్స్ట్ మెసేజింగ్, వైట్ బోర్డ్, షేర్ స్క్రీన్ లాంటి ఇతర ఫీచర్ లను ఉపయోగించవచ్చు.

Anywhere.link     

ఇది ఉపయోగించడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక్క క్లిక్ తోనే ఇక్కడ వీడియో  చాట్ ప్రారంభించవచ్చు. ఇది హై క్వాలిటీ వీడియో సర్వీస్ ను అందిస్తుంది. అయితే దీనియొక్క ఫ్రీ వెర్షన్ లో కేవలం 5 మంది సభ్యులను మాత్రమే ఇన్వైట్ చేయగలం. కానీ సెషన్ ల సంఖ్య మరియు సమయం విషయం లో మాత్రం ఏ విధమైన పరిమితులు లేవు.

ఉపయోగించడం ఎలా ?

Anywhere.link హోం పేజి ను విజిట్ చేసి మీ ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కస్టమ్ URL ను కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇది అచ్చం hubl.in లో చేసిన మాదిరిగానే ఉంటుంది.

URL ను క్రియేట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు క్రియేట్ చేసిన URL ను మీ టీం సభ్యులకు షేర్ చేయడం ద్వారా మీరు వీడియో చాట్ ను కొనసాగించవచ్చు.

అందరు సభ్యులకు సంబందించన వెబ్ కాం మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. దీనిని మీరు ఎలాగైనా ఎక్స్ పాండ్ చేసుకునే వీలుంది.వీడియో చాట్ తో పాటు ఇందులో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంది.

Chime by Cafex

ఇది మరొక సింపుల్ ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్. ఇది ఉచిత వీడియో చాట్ సెషన్ లను మీకు అందిస్తుంది. ఇది కేవలం 6 గురు సభ్యులకు మాత్రమే సెషన్ లో అవకాశం కల్పిస్తుంది. దీనియొక్క మరొక విశిష్టత ఏమిటంటే జూమ్, SIP మరియు SIPS లాంటి ఎక్స్ టర్నల్ కాన్ఫరెన్స్ సిస్టం లకు మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది.

ఉపయోగించడం ఎలా ?

ముందుగా Chime హోం పేజి ను విజిట్ చేసి ఒక ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవాలి. మీటింగ్ నేమ్ ను ఎంటర్ చేయడం ద్వారా మీటింగ్ ను మీరు స్టార్ట్ చేయవచ్చు. స్టార్ట్ మీటింగ్ అనే బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా మీరు సెషన్ ను స్టార్ట్ చేయవచ్చు.

ఇన్వైట్ అదర్స్ అనే బటన్ పై క్లిక్ చేసి స్క్రీన్ పై భాగం లో ఉండే యుఆర్ఎల్ ను షేర్ చేయాలి.

ఆ తర్వాత మీ స్క్రీన్ పై టీం సభ్యుల వెబ్ క్యాం లు కనిపిస్తాయి.వీడియో చాట్ తో పాటు ఇది టెక్స్ట్ మెసేజ్ లు, స్క్రీన్ షేరింగ్, కనెక్ట్ ఎక్స్  టర్నల్ కాన్ఫరెన్స్ సిస్టం లాంటి ఇతర ఫీచర్ లు కూడా ఇందులో ఉంటాయి.

Appear.in

ఇది మరొక ఉపయోగకరమైన ఉచిత ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ సర్వీస్. దీని ఇంటర్ పేస్ ఉపయోగించడానికి చాలా సులువుగా  ఉంటుంది. ఇందులో మీరు చాలా సులభంగా చాట్ రూమ్ ను క్రియేట్ చేయవచ్చు. దీని ఉచిత వెర్షన్  లో కేవలం 8 మంది సభ్యులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

ఉపయోగించడం ఎలా ?       

మొదటగా దీని హోం పేజి కి వెళ్లి మీ ఉచిత ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ రూమ్ అనే బటన్ పై క్లిక్ చేసి మీ కస్టం యుఆర్ఎల్ ను క్రియేట్ చేసుకోవాలి. ఎంటర్ పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీకు వీడియో చాట్ స్క్రీన్ కనిపిస్తుంది.దీనికి కుడి వైపు ఇన్వైట్ మెంబర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీ యుఆర్ఎల్ ను కాపీ చేసి ఇక్కడ షేర్ చేయడం ద్వారా మీరు మీ సభ్యులను ఇన్ వైట్ చేయవచ్చు.

 స్క్రీన్ యొక్క అడుగుభాగం లో స్క్రీన్ షేర్, సెండ్ స్టికర్స్,చాట్, మ్యూట్ వీడియో/ఆడియో లాంటి  ఇతర ఫీచర్ లను కూడా మనం చూడవచ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు