• తాజా వార్తలు
  •  

ఉచితంగా పెయింటింగ్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి 7 బెస్ట్ వెబ్ సైట్స్

          పెయింటింగ్ లను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వీలున్న 7 బెస్ట్ వెబ్ సైట్ లను మీ కోసం ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం. వీటిని మీరు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకుని కమర్షియల్ గానూ మరియు నాన్ కమర్షియల్ గానూ ఉపయోగించవచ్చు. వీటి క్వాలిటీ చాలా బాగుంటుంది. మీ PC లలో jpeg లేదా PNG ఫైల్ ల రూపం లో వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

NGA ఇమేజెస్

ఫ్రీ రాయల్టీ ఫ్రీ ఇమేజ్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇది అత్యుత్తమ వెబ్ సైట్ గా చెప్పుకోవచ్చు. ప్రపంచ ప్రముఖ ఆర్ట్ గ్యాలరీ లకు చెందిన పెయింటింగ్ లన్నీ ఈ వెబ్ సైట్ లో ఉంటాయి. వివిధ రకాల వర్గీకరణ లతో కూడిన సుమారు 900 కు పైగా పెయింటింగ్ లను మనం ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లోనే అందుబాటులో ఉంటాయి. వెబ్ సైట్ కు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సైట్ లోని హోం పేజి ని ఓపెన్ చేసి కలెక్షన్స్ అనే టాబ్ ను క్లిక్ చేయడం ద్వారా చాలా సులువుగా వీటిని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మెట్ మ్యూజియం       

ఫ్రీ రాయల్టీ ఇమేజ్ లను ఉచితంగా అందించే మరొక ముఖ్యమైన వెబ్ సైట్ ఇది. USA లోని మెట్రో పొలిటన్ మ్యూజియం కు చెందిన పెయింటింగ్ లు ఇక్కడ కలెక్షన్ లో ఉంటాయి. వేలకొద్దీ ప్రముఖ పెయింటింగ్ లను ఇక్కడ మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా మనం కమర్షియల్ మరియు పర్సనల్ గానూ ఉపయోగించవచ్చు. ఈ వెబ్ సైట్ కు కూడా ఏమీ చెల్లించవలసిన అవసరం లేదు. హోం పేజి లో ఆర్ట్ > కలెక్షన్స్ ద్వారా వీటిని సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెయింటింగ్ లను ఫిల్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.వీటిని jpeg ఫైల్ ల రూపం లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వికీ మీడియా కామన్స్       

వివిధ రకాల అంశాలైన జంతువులు, యుద్దాలు, చరిత్ర, సముద్రం, ఆధ్యాత్మికత ఇలాంటి వాటికి సంబందించిన కొన్ని వేల రకాల పెయింటింగ్ లు ఈ వెబ్ సైట్ లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉండడం ద్వారా ఎటువంటి కాపీ రైట్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. కాకపోతే డౌన్ లోడ్ చేసుకునే ముందు అక్కడ ఉన్న సూచనలను జాగ్రత్తగా చదివి డౌన్ లోడ్ చేసుకుంటే మంచిది. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అక్కడ ఉన్న సెర్చ్ బార్ లో పెయింటింగ్స్ అని టైపు చేస్తే అక్కడ ఉన్న వేలకొద్దీ పెయింటింగ్ లు మనకు కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చిన వాటిని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

1 మిలియన్ ఫ్రీ పిక్చర్స్

రాయల్టీ ఫ్రీ పెయింటింగ్ లను ఉచితంగా అందించే మరొక బెస్ట్ వెబ్ సైట్ ఇది. ఈ వెబ్ సైట్ తయారుచేసిన వారిచే స్వంతంగా చేయబడ్డ కొన్ని వందల అద్భుతమైన పెయింటింగ్ లను ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంటాయి. పూలు, ట్రైన్ ట్రాక్ లు, ఫెర్రీ , బోటు, డోర్ ఇంకా ఇలా ఎన్నో రకాలకు చెందిన అందమైన పెయింటింగ్ లను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి గ్యాలరీ అనే విభాగం లో క్లిక్ చేయడం ద్వారా వీటిని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓపెన్ క్లిప్ ఆర్ట్  

 ఒక్క పైసా కూడా చెల్లించకుండా అద్భుతమైన పెయింటింగ్ లను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే మరొక అద్భుతమైన వెబ్ సైట్ ఇది. వింటేజ్ ల్యాండ్ స్కేప్ ల నుండీ, మదర్ మేరీ వరకూ మరియు గ్రీక్ అర్దోడక్స్ నుండీ చైనీస్ పెయింటింగ్ ల వరకూ కొన్ని వేల రకాల పెయింటింగ్ లు ఇక్కడ మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్న వెబ్ సైట్ ల మాదిరిగానే ఇది కూడా CC0 లైసెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అక్కడ ఉన్న సెర్చ్ బార్ లో పెయింటింగ్స్ అని టైపు చేస్తే అక్కడ ఉన్న వేలకొద్దీ పెయింటింగ్ లు మనకు కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చిన వాటిని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కారెన్ విమ్సీ పబ్లిక్ డొమైన్ ఇమేజెస్

ఈ వెబ్ సైట్ కూడా కొన్ని వేల ఉచిత పెయింటింగ్ లను కలిగి ఉన్నది. వీటిని మనం ఇక్కడ ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉన్నది. యానిమల్ లైఫ్, వాటర్ వరల్డ్, పురాతనం, సంగీతం ఇలా అనేక కేటగరీ లకు చెందిన పెయింటింగ్ లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంటాయి కావున మనం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. హోం పేజి ని ఓపెన్ చేసి అక్కడ ఉన్న పబ్లిక్ డొమైన్ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మనకు ఇవన్నీ కనిపిస్తాయి. ఎక్కువ రిసోల్యూషన్ ఉన్న ఇమేజ్ లు మాత్రం కొనుగోలు చేయవలసి ఉంటుంది.

పెక్సల్స్

అనేక రకాల రాయల్టీ ఫ్రీ ఇమేజ్ లను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించే మరొక వెబ్ సైట్ ఇది. ఇందులో ఉండే పెయింటింగ్ లన్నీ CC0 లైసెన్స్ ను కలిగి ఉంటాయి.అంటే మీరు వీటిని డౌన్ లోడ్ చేసుకోవడమే గాక ఎడిట్ కూడా చేసుకోవచ్చు. వెబ్ సైట్ కు ఏ విధమైన క్రెడిట్ చెల్లించ వలసిన అవసరo లేదు. ప్రతీ పెయింటింగ్ ను ఓపెన్ చేసిన ప్రతీ సారీ లైసెన్స్ వివరాలు కనిపిస్తాయి. ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అక్కడ ఉన్న సెర్చ్ బార్ లో పెయింటింగ్స్ అని టైపు చేస్తే అక్కడ ఉన్న వేలకొద్దీ పెయింటింగ్ లు మనకు కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చిన వాటిని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

 

జన రంజకమైన వార్తలు