• తాజా వార్తలు

ఈ మార్చ్ నెలలో రానున్న స్మార్ట్ ఫోన్ లలో టాప్ 6 మీకోసం

ప్రతీ నెల లోనూ అనేకరకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో లాంచ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే వినియోగదారుల మనసు గెలుచుకుని మార్కెట్ లో నిలబడగలుగుతాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ ల గురించి ప్రతీ నెలా క్రమం తప్పకుండా మన కంప్యూటర్ విజ్ఞానం ఆర్టికల్స్ రూపం లో పాఠకులకు తెలియజేస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మార్చ్ నెలలో రానున్న టాప్ 6 స్మార్ట్ ఫోన్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

సామ్సంగ్ గాలక్సీ S 9 మరియు S9 ప్లస్

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా ఇప్పటికే తన ఫ్లాగ్ షిప్ మొబైల్స్ అయిన వీటిని సామ్సంగ్ ప్రకటించేసింది. ఈ S9 సిరీస్ లో కొన్ని మార్పులు ఉండనున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, పవర్ ఫుల్ ఎక్సినోస్ 9810 ప్రాసెసర్ మరియు ఇంప్రూవ్ చేయబడిన కెమెరా లతో ఇవి రానున్నాయి. రీ డిజైన్ చేయబడిన కెమెరా హార్డ్ వేర్ అనేది వీటికి సంబంధించి పెద్ద మార్పు గా చెప్పుకోవచ్చు. క్రితం వెర్షన్ లతో పోలిస్తే 28 శాతం ఎక్కువ లైట్ ను ఇవి ఇస్తాయి. కెమెరా లో వేరియబుల్ అపెర్చర్ లెన్స్ తో కూడిన సూపర్ స్పీడ్ డ్యూయల్ పిక్సెల్ టెక్నాలజీని ఇవి కలిగి ఉంటాయి. ఈ రెండూ కూడా IP68 రేటింగ్ తో కూడిన వాటర్, డస్ట్ రెసిస్టన్స్ ను కలిగి ఉంటాయి.

ఎయిర్ టెల్ ఆండ్రాయిడ్ ఓరియో గో స్మార్ట్ ఫోన్స్

తక్కువ ధర లో లభించే ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ లను అందించడానికి ఎయిర్ టెల్ గూగుల్ తో భాగస్వామ్యం అయింది. ఇండియా లో ఈ రెండూ కలిసి తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించాయి.లావా మరియు మికర్ మాక్స్ లు వీటి తయారీదరులుగా ఉన్నాయి. ఇవి గూగుల్ గో యాప్స్, ఎయిర్ టెల్ యాప్స్, ఎయిర్ టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ లతో రానున్నాయి.

ఆసుస్ జెన్ ఫోన్ 5 లైట్

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా ఆసుస్ తన జెన్ ఫోన్  5 లైట్ ను లాంచ్ చేసింది. ఇది ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ను కలిగిఉంది. 6.0 ఇంచ్ ఫుల్ HD+IPSLCD 18:9 డిస్ప్లే దీని మరొక ప్రత్యేకత. బ్లూ లైట్ ఐ కేర్ ను ఇది కలిగి ఉన్నది. ఇందులో నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. రెండు ప్రాసెసర్ ల వేరియంట్ లలో ఇది లభించనుంది. అలాగే 3 GB RAM+32GB స్టోరేజ్ మరియు 4 GB RAM+64 GB స్టోరేజ్ లలో ఇది ఉండనుంది.

Mi MIX 2S

మార్చి 27 న ఈ Mi MIX 2S ను లాంచ్ చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. ఇది లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ తో రానుంది. 8 GB RAM,256 GB స్టోరేజ్ ఇందులో ఉండనుంది. 5.99 ఇంచ్ బెజేల్ లెస్ డిస్ప్లే, 16 మెగా పిక్సెల్ కెమెరా లు దీని మరిన్ని ప్రత్యేకతలు. దీని ధర సుమారుగా రూ 40,200/- లు ఉండే అవకాశం ఉంది.

ది మోటో G6 సిరీస్

లెనోవా ఫోన్ లను అందించే మోటోరోలా కంపెనీ ఈ మోటో జి6 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను అతి త్వరలో లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో మోటో జి6 ప్లే, మోటో జి 6 మరియు మోటో జి6 ప్లస్ లు ఉండనున్నాయి. ఇవన్నీ కూడా 18:9 వైడ్ స్క్రీన్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఓరియో 8.0, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 630 Soc, 4 GB RAM ను కలిగిఉండనున్నాయి.

హువాయి P20

ఇది కూడా మార్చ్ 27 న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవ్వనుంది.ఆపిల్ ఐ ఫోన్ x లో మాదిరిగా టాప్ లో డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఇందులో ఉండనుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ ఓరియో పై పనిచేస్తుంది. 6 ఇంచ్ వైడ్ స్క్రీన్ 18:9 డిస్ప్లే, AI పవర్డ్ కిరిన్ 970 ప్రాసెసర్, 6 GB ,8 GB RAM లు, 128 GB, 256 GB స్టోరేజ్ లు, 4000 mAh బ్యాటరీ లు  దీని మరిన్ని విశిష్టతలు.

 

జన రంజకమైన వార్తలు