బర్త్‌డే, మ్యారేజ్.. ఇలా అకేషనేదైనా గిఫ్టింగ్ ట్రెండ్ మారుతోంది. ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు, డెకరేటివ్ ఆర్టికల్స్ గిఫ్ట్‌గా ఇవ్వడం పాతముచ్చట. టెక్నాలజీ గిఫ్ట్‌లు ఇవ్వడం ఇప్పుడు చాలా దేశాల్లో కొత్త ట్రెండ్, స్మార్ట్ వాచీలు, వేరబుల్ స్మార్ట్ రింగ్స్, ఫిట్ నెస్ ట్రాకర్ బ్యాండ్స్, డ్రోన్లు, హోవర్లు ఇలా గ్యాడ్జెట్లు గిఫ్ట్‌లుగా ఇస్తున్నారు. ఈ ట్రెండ్ మీరూ ఫాలో అవ్వాలనుకుంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే
వేరబుల్స్, స్మార్ట్‌వాచ్‌లు
స్మార్ట్ రింగ్స్, వాచీలు వంటివి వాటిని ఆసక్తిగా వాడేవారికి ఇస్తేనే బాగుంటుంది. అది కూడా వారి దగ్గరున్న గ్యాడ్జెట్లేమిటో మీకు అవగాహన ఉంటే ఇవ్వండి. మీరు ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ వాచ్ గిఫ్ట్‌గా ఇస్తే అవతలి వ్యక్తి దగ్గర ఐఫోన్ ఉంటే ఆ గిఫ్ట్ యూజ్ కాదు. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వ్యక్తికి యాపిల్ వాచ్ ఇస్తే అది ఉపయోగపడొచ్చుగానీ అంత ఎక్స్పెన్సివ్ అనవసరం. ఇక ఫిట్నెస్ ట్రాకర్ బ్యాండ్ల వంటివి నిజంగా ఫిట్నెస్ ఫ్రీక్స్ కు ఇస్తే బాగుంటుంది.
డ్రోన్లు drones
టెక్ గిఫ్ట్‌ల్లో ఇప్పుడు డ్రోన్లు కూడా చేరాయి. http://www.protocolny.com/ వంటి సైట్లలోకి వెళితే 40 డాలర్లు (2,5000 రూపాయలు) నుంచి డ్రోన్లు దొరుకుతున్నాయి. డ్రోన్ల రేట్లు తగ్గాయి.. మనం సాధారణంగా గిఫ్ట్ ఇచ్చే ఇలాంటి చిన్న స్థాయి డ్రోన్లు వీడియో షూటింగ్ వంటి వాటికి బాగా యూజ్ అవుతాయి. అయితే డ్రోన్ల వినియోగం మీద చాలాచోట్ల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్నిచోట్ల పర్మిషన్ తీసుకోకుండా డ్రోన్ యూజ్ చేయడం క్రైమ్. ఎవరికైనా గిఫ్ట్‌గా డ్రోన్ ఇవ్వాలనుకుంటే ఆ పర్మిషన్లు తీసుకోవడం లేదంటే పర్మిషన్ తీసుకోవాలని గిఫ్ట్ ఇచ్చేవారికి చెప్పడం మర్చిపోకండి.
హోవర్ బోర్డ్స్ hover boards
రెండు చక్రాల మీద నడిచే హోవర్ బోర్డ్స్ తెలుసుగా.. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ వాడతాడే అలాంటివి. 15, 20 వేల రూపాయల నుంచి హోవర్ బోర్డ్స్ దొరుకుతున్నాయి. అయితే వీటిని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే రిసీవ్ చేసుకునే వ్యక్తికి వాటి గురించి బాగా అవగాహన ఉండాలి. లేదంటే దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేయలేక గాయపడే ప్రమాదముంది. అదీకాక చాలా ప్రాంతాల్లో హోవర్ బోర్డ్స్ ఉపయోగించడం నిషేధం కూడా.
టోటల్‌గా చెప్పాలంటే మీరు టెక్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే తీసుకునే వ్యక్తికి యాప్ట్ అయ్యేదే ఇవ్వండి.