• తాజా వార్తలు

అమీర్ పేట్ లో హాస్టళ్ళు

ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండీ సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు ఒక్క అమీర్ పేట్ లోనే మకాం పెడతారనేది ఒక అంచనా. ఒక నిర్ణీత సమయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఆ సమయంలో సుమారు ఇరవై ముప్పై వేల మంది విద్యార్థులు అమీర్ పేట్ లో ఉంటూ వివిధ రకాల కోర్సులను నేర్చుకుంటూ లేదా కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అంత  మంది అమీర్ పేట్ లో ఎక్కడ ఉంటారు.అంతమందికి సరిపడా వసతులు అక్కడ ఉన్నాయా అని ప్రశ్నిస్తే మనకు మిశ్రమ సమాధానాలు లభిస్తాయి. డబ్బు పెట్టగలిగిన వారికైతే మంచి హాస్టల్ లు ఉంటాయి. బడ్జెట్ లో కావాలనుకునే వారికి మాత్రం కొన్ని కష్టాలు పడాల్సిందే. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా ఉంటుంది ఇక్కడి వసతుల పరిస్థితి.

అసలే ఇరుకు సందులు. హైదరాబాద్ కదా సరిపెట్టుకుందాం లే అనుకుంటే అంతకంటే ఇరుకైన భవనాలు. బాత్ రూమ్ కంటే కొంచెం పెద్దగా ఉండే గదులలో ఒక్కో  గదికి ఆరుగురు. అన్ని మంచాలు పరిస్తే నడవడానికి కూడా ఖాళీ ఉండదు. ఆ మాత్రం దానికి నెలకు మూడువేల నుండీ నాలుగు వేల వరకూ అద్దె ఉంటుంది.కొన్ని హాస్టళ్ళలో స్నేహితులు రావడానికి వీలు ఉండదు. ఒక వేళ  వచ్చినా రోజుకు రెండు వందల వరకూ అదనంగా చెల్లించవలసి ఉంటుంది. శుభ్రత సరే సరి.

ఇవన్నీ ఒక ఎత్తు.మన రూమ్ మేట్స్ తో వచ్చే ఇబ్బందులు మరొక ఎత్తు. మనకు తెలిసిన వారి దగ్గర ఉంటే శ్రేయస్కరం. ఒక్కోసారి తెలిసిన వారే మోసం చెయ్యవచ్చు. కాబట్టి స్నేహితులను ఎంచుకోవడం లో జాగ్రత్త మంచిది.ఇక్కడ ఉండే  ఇబ్బందులు తీసు కోవలసిన జాగ్రత్తల గురించి మరొక వ్యాసం లో సవివరంగా తెలుసుకుందాం.అంతేగాక అక్కడ ఉంటున్న లేదా ఒకప్పుడు ఉన్న వ్యక్తుల యొక్క అనుభవాలను కూడా రాబోయే వ్యాసాలలో చర్చిద్దాం.

మీలో కూడా ఎవరికైనా మీ అనుభవాలను పంచుకోవాలని ఉన్నా ,అమీర్ పేట్ లో జరిగే సంగతులను (అవి ఏవైనా కానీ ) ఎప్పటికప్పుడు మాతో పంచుకోవాలని అనుకున్నా నిరభ్యంతరంగా మాకు పోస్ట్ చెయ్య వచ్చు.మీ భావాల  తో పాటు మీ పేర్లను కూడా ప్రచురిస్తాం.

 

జన రంజకమైన వార్తలు