• తాజా వార్తలు

హెచ్‌టీసీ యూ ప్లేపై 10వేల తగ్గింపు

చైనా మొబైల్ కంపెనీల పోటీలో వెన‌కబ‌డిన హెచ్‌టీసీ కూడా మొబైల్ ధ‌ర‌ల త‌గ్గింపులో ఓ అడుగు వేసింది. తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ ఫోన్స్ మంచి స్టాండ‌ర్డ్స్‌తో వ‌స్తాయ‌ని ఇండియ‌న్ మార్కెట్‌లో పేరుంది. సంస్థ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మార్కెట్లోకి తీసుకొచ్చిన హెచ్‌టీసీ యూ ప్లే స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌ను ఏకంగా 10 వేల రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధ‌ర రూ.39,990 కాగా రూ.29,990కు తగ్గించింది.
మంచి ఫీచ‌ర్లు
* 1920 x 1080 రిజ‌ల్యూష‌న్‌తో 5.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ * ఎఫ్‌2.0, ఆప్టిక‌ల్ స్టెబిలైజేష‌న్ ఆప్ష‌న్ల‌తో 16 ఎంపీ రియ‌ర్ కెమెరా, ఎఫ్‌2.0, ఆల్ట్రా పిక్సెల్ మోడ్‌తో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా * 4జీబీ ర్యామ్‌, 63 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ.. ఎస్డీ కార్డుతో ఏకంగా 2టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చ‌ని హెచ్‌టీసీ ప్ర‌క‌టించింది. * హెచ్‌టీసీ సెన్స్ టెక్నాల‌జీతో వాయిస్ క‌మాండ్స్ * ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6 ఓఎస్‌ * మీడియాటెక్ హీలియో పీ10 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే బ్యాట‌రీ 2435 ఎంఏహెచ్ సామ‌ర్ధ్యంతో మాత్ర‌మే రావ‌డం మైన‌స్ పాయింట్‌. 25 గంట‌ల టాక్‌టైమ్ వ‌స్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించినా ఇంట‌ర్నెట్ యూసేజ్‌తో ఫాస్ట్ డ్రైనయ్యే అవ‌కాశం ఉంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్ష‌న్ ఉండ‌డం కొంత బెట‌ర్‌. సామర్థ్యం, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫోన్‌తో పాటు ఇచ్చే హెచ్‌టీసీ యూసోనిక్‌2 మైక్రోఫోన్స్ సూప‌ర్ సౌండ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తాయ‌ని టెక్ ఎక్స్‌ప‌ర్ట్స్ చెబుతున్నారు.
అమెజాన్‌లో దొరుకుతుంది.
10 వేల రూపాయ‌ల త‌గ్గింపుతో 29,990 రూపాయ‌ల‌కు హెచ్‌టీసీ యూ ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ ఈకామ‌ర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో దొరుకుతుంది. దీనితో పాటు ఎక్స్చేంజ్ ఆఫ‌ర్‌ను, ఈఎంఐ ఫెసిలిటీని కూడా అమెజాన్ అందిస్తోంది.

జన రంజకమైన వార్తలు