• తాజా వార్తలు

ఎల్ జీ జీ6 పై మళ్లీ భారీ తగ్గింపు.. రూ.38,990కే లభ్యం

బడా స్మార్టు ఫోన్ల ధరలు దిగి వస్తున్నాయి. ఇప్పటికే తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6' పై భారీగా ధర తగ్గించిన ఎల్ జీ తాజాగా మరోసారి భారీ డిస్కౌంటు ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్ కింద కొనుగోలుదారులకు రూ.13వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే ఈ డిస్కౌంట్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కలిగి ఉన్నవారికే వర్తిస్తుంది.
అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ పై కంపెనీ అదనపు డిస్కౌంట్లను, ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐస్ ప్లాటినం, ఆస్ట్రో బ్లాక్ రంగుల ఆప్షన్లపై ఈ డిస్కౌంట్ వర్తించనుంది. దీంతో లాంచింగ్ సందర్భంగా రూ.51,990గా ఈ ఫోన్, ప్రైమ్ మెంబర్లకు ఇప్పుడు రూ.38,990కే దొరుకుతోంది.
అంతకముందు మే నెలలో కూడా ఈ ఫోన్ పై 10వేల రూపాయల తగ్గింపును కంపెనీ పరిమిత కాల వ్యవధిలో అందించింది. లాంచ్ అయిన రెండు నెలలోనే రెండు సార్లు భారీ తగ్గింపును కంపెనీ ప్రకటించడం విశేషం. భారీ డిస్కౌంట్ ఆఫర్లతో పాటు బజాజ్ ఫైనాన్స్ కార్డులపై ఎలాంటి ధరలు లేని ఈఎంఐ ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు.... ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 100జీబీ వరకు అదనపు 4జీ రిలయన్స్ జియో డేటా కూడా వస్తోంది.

జన రంజకమైన వార్తలు