• తాజా వార్తలు

ఐవోఎస్‌లో అమెజాన్ యాప్ డిజేబుల్‌.. కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే!!

ఐఫోన్ లేదా ఐవోఎస్ డివైస్‌ల‌లో అమెజాన్ యాప్ వాడుతున్నారా? అయితే మీరు కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒరిజిన‌ల్ అమెజాన్ యాప్‌ను ఆ కంపెనీ డిజేబుల్ చేసింది

చాలాకాలంగా ఇండికేష‌న్స్‌
ఇండియాలో అమెజాన్ యాప్‌ను ఐవోఎస్‌లో వాడేవారికి యాప్ ఓపెన్ చేయ‌గానే మీరు కొత్త అమెజాన్ యాప్‌కు మారండి లేదా అమెజాన్‌.ఇన్‌లో షాపింగ్ చేసుకోండి అని మెసేజ్ వ‌స్తుంది. చాలాకాలంగా ఈ మెసేజ్‌ను ఐవోఎస్ యూజ‌ర్ల‌కు అమెజాన్ చూపిస్తోంది. ఫైన‌ల్‌గా ఆ యాప్‌ను డిజేబుల్ చేసిన‌ట్లు అమెజాన్ ప్ర‌క‌టించింది. 

కొత్త యాప్ ఎందుకు?
మ‌రిన్ని సెక్యూరిటీ ఫీచ‌ర్లు, పేమెంట్ మోడ్స్‌తో కొత్త యాప్‌ను తీసుకొచ్చిన‌ట్లు అమెజాన్ చెప్పింది. కొత్త యాప్‌లో అమెజాన్ పే యూపీఐ స‌ర‌వ్ఈస్ కోసం యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు