• తాజా వార్తలు

అమెజాన్ డిజిటల్ వాలెట్ వ‌చ్చేస్తోంది

డీమానిటైజేష‌న్ త‌ర్వాత దేశంలో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు పెరిగాయి. కొన్నిసార్లు అనివార్యంగా కూడా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. ఏదేమైనా డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల జోరు అందుకోవ‌డంతో పెద్ద పెద్ద కంపెనీల‌న్నీ ఇదే బాట ప‌డుతున్నాయి. తాజాగా ఈ- కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఇండియా సొంత డిజిటల్ వాలెట్ కోసం ఆర్‌బీఐ నుంచి అనుమ‌తి సాధించింది. దీంతో అమెజాన్ క‌స్ట‌మ‌ర్లు నేరుగా ఈ వాలెట్ నుంచి కొనుగోళ్లు చేయొచ్చు. క్యాష్‌బాక్ వంటివి ఉంటే క‌స్ట‌మ‌ర్ బ్యాంక్ అకౌంట్‌లో వేయ‌డం కాకుండా నేరుగా ఈ వాలెట్లో క్రెడిట్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వ‌స్తుంది. ఇప్ప‌టికే పేటీఎం ఇలా సొంత వాలెట్, ఈ- కామ‌ర్స్ స్టోర్ కూడా మెయింటెయిన్ చేస్తూ మంచి బిజినెస్ చేసుకుంటోంది. ఇప్పుడు సేం ఫీచ‌ర్స్ అమెజాన్ డిజిట‌ల్ వాలెట్ ద్వారా కూడా యూజ‌ర్ల‌కు అందుతాయి.
అమెజాన్ పే ర‌ద్దు!
లాస్ట్ ఇయ‌ర్ అమెజాన్‌.. అమెజాన్ పే పేరిట ఒక పేమెంట్ ఆప్ష‌న్‌ను తీసుకొచ్చింది. అయితే అది కేవ‌లం అమెజాన్ సైట్లో ట్రాన్సాక్ష్ల‌న‌కు మాత్ర‌మే ప‌నికొస్తుంది. దీంతో అమెజాన్ పే క్లిక్ కాలేదు. కొత్త‌గా డిజిట‌ల్ వాలెట్‌ను తీసుకొస్తున్న నేప‌థ్యంలో అమెజాన్ పే ను ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) ఏర్పాటుకు ఆర్‌బీఐ అనుమ‌తిచ్చింద‌ని అమెజాన్ ప్ర‌క‌టించింది. డిజిటల్ ట్రాన్సాక్ష‌న్లు బ‌ల‌ప‌డుతున్న ఇండియాలో క‌స్ట‌మ‌ర్ల‌కు విశ్వ‌స‌నీయ‌మైన, సులువైన క్యాష్‌లెస్ ట్రాన్సాక్ష‌న్ల కు త‌మ డిజిట‌ల్ వాలెట్ తోడ్ప‌డుతుంద‌ని చెప్పింది. పీపీఐ ల విధివిధానాల‌పై ఆర్‌బీఐ ఫైన‌ల్ గైడ్స్‌ను సిద్ధం చేశాక దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

జన రంజకమైన వార్తలు