• తాజా వార్తలు

ఆగ‌స్ట్ 6,7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ 

ప్ర‌ముఖ ఈ-కామర్స్  సంస్థ అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆగస్టు 6, 7 తేదీల్లో నిర్వ‌హించ‌బోతుంది.  ఈ రెండు రోజుల‌పాటు  భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, క్రెడిట్ కార్డ్‌ల‌పై ఇన్‌స్టంట్ డిస్కౌంట్స్‌, నో కాస్ట్ ఈఎంఐ ఆఫ‌ర్ల‌ను ఇవ్వ‌నుంది.

ఈసారి ఆగ‌స్టులో
అమెజాన్ త‌న క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి ప్ర‌తి సంవ‌త్స‌రం జులైలో ప్రైమ్ డే సేల్స్ నిర్వ‌హిస్తుంది. జ‌న‌ర‌ల్‌గా ఈ నెల‌లో పండ‌గలు, ప‌బ్బాలు ఏమీ ఉండ‌వు.  జూన్‌లో పిల్ల‌ల స్కూల్‌, కాలేజ్ ఫీజ్‌లు, బుక్స్‌, ఇత‌ర ఖ‌ర్చుల‌తో ఎవ‌రూ వినాయ‌క చవితి సీజ‌న్ వ‌ర‌కు ఏ వ‌స్తువులూ కొనే ప‌రిస్థితి ఉండ‌దు.ఈ టైమ్‌లో బిజినెస్ డ‌ల్ అవ‌కుండా కాపాడుకోవ‌డానికి ఈకామ‌ర్స్ కంపెనీలు జులై నెల‌లో ఒక సేల్  తెస్తుంటాయి. అలాగే అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ జులైలో జ‌రిగేది. క‌రోనా దెబ్బ‌తో ఈసారి ఆగస్టుకు వాయిప‌దా ప‌డింది. 

ఏమేం ఆఫ‌ర్లు? 
 * ప్రైమ్ డే సేల్‌లో భాగంగా  స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్లపై డిస్కౌంట్లు ప్రకటిస్తుంది.  

* హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌దారుల‌కు 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తుంది.  

* నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ప్రకటించింది.  

జన రంజకమైన వార్తలు