• తాజా వార్తలు

ఇక డ్రోన్ల‌తోనూ అమెజాన్ డెలివ‌రీ

అమెజాన్‌లో ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువుల‌ను ఇక‌పై డ్రోన్ల ద్వారా డెలివ‌రీ  చేయ‌నున్నారు. అయితే ఇండియాలో కాదు సుమా.. అమెరికాలో. ఇందుకోసం అమెరికాకు చెందిన ఫెడ‌రల్ ఏవియేష‌న్ అథారిటీ (ఎఫ్ఏఏ) అనుమ‌తులిచ్చింది. దాదాపు రెండు, మూడేళ్లుగా డ్రోన్ ద్వారా డెలివ‌రీకి అమెజాన్ ప్ర‌య‌త్నిస్తోంది.

2013లోనే చెప్పారు
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 2013లో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ రాబోయే ఐదేళ్ల‌లో తాము డ్రోన్ల ద్వారా కూడా డెలివ‌రీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే త‌ర్వాత ర‌క‌ర‌కాల అడ్డంకులు ఎదుర‌య్యాయి. అమెరికా గ‌గ‌న‌తలంలో రాక‌పోక‌ల‌ను అనుమ‌తించే ఎఫ్ఏఏ ఎన్నో అంశాలు ప‌రిశీలించి చివ‌ర‌కు ఇప్పుడు డ్రోన్ల ద్వారా వ‌స్తువుల డెలివ‌రీకి అమెజాన్‌కు అనుమ‌తిచ్చింది. ఆర్డ‌ర్ చేసిన అరగంట‌లో డ్రోన్ ద్వారా ప్రొడ‌క్ట్‌ను మీ చెంత‌కు చేరుస్తామ‌ని అమెరికన్ యూజ‌ర్ల‌కు ఇంత‌కు ముందే మాటిచ్చింది. 

అమెజాన్ మూడోది
డ్రోన్ల ద్వారా డెలివ‌రీకి ప‌ర్మిష‌న్ పొందిన మూడో కంపెనీ అమెజాన్ ఎఫ్ఏఏ ప్ర‌క‌టించింది. గ‌త సంవ‌త్స‌రం గూగుల్‌కు చెందిన డెలివ‌రీ కంపెనీ ఐపీఎస్ ఈ ప‌ర్మిష‌న్ పొందింది. 
 

జన రంజకమైన వార్తలు