• తాజా వార్తలు

క‌రోనా ఎఫెక్ట్‌తో అమెజాన్ ప్రైమ్ డే  వాయిదా!!!

అమెజాన్ ప్రైమ్ డే..  నాలుగేళ్లుగా ప్ర‌తి జులైలో భారీ ఆఫ‌ర్ల‌తో వచ్చే ఈవెంట్‌. దీనికి పోటీగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ కూడా పెట్టేది. దీంతో ఈకామ‌ర్స్ యూజ‌ర్ల‌కు పండ‌గే.  భారీ డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డ్‌,  డెబిట్ కార్డ్‌ల మీద క్యాష్‌బ్యాక్‌లు ఇస్తుండ‌టంతో వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌రిగేది. అయితే క‌రోనా లాక్డౌన్ ప్ర‌భావంతో ఈసారి ప్రైమ్ డేను అమెజాన్ వాయిదా వేసింద‌ని వార్తలు వినిపిస్తున్నాయి..

సెప్టెంబ‌ర్‌కు వాయిదా
2015లో అమెజాన్ ప్రైమ్ డేను స్టార్ట్ చేసింది.  ఈకామ‌ర్స్ యూజ‌ర్లు కొత్త‌గా ఏదైనా కొనాలంటే ప్రైమ్‌డే, దీపావ‌ళి, ద‌స‌రా ఆఫ‌ర్ల కోసం చూసేలా ఈ ఈవెంట్ స‌క్సెస్ అయింది. అయితే ఈసారి లాక్డౌన్ ప్ర‌భావంతో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి బ‌డ్జెట్లు త‌ల‌కిందుల‌య్యాయి. జులైలో సేల్ పెడితే పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌క‌పోవ‌చ్చని అమెజాన్ భావిస్తున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.  

స్లాక్ నింపుకోవాల‌న్న ఆలోచ‌న కూడా
లాక్డౌన్‌తో మాన్యుఫాక్చ‌రింగ్ కంపెనీలు రెండు నెలలుగా మూత‌ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే ఉత్ప‌త్తి ప్రారంభిస్తున్నాయి. డిమాండ్‌కు త‌గిన స‌ప్ల‌యి కావాల‌న్నా కొంత టైమ్ ప‌డుతుంది. ప్రైమ్‌డే వాయిదా వేయ‌డానికి ఇది కూడా కార‌ణ‌మంటున్నారు. అమెజాన్‌కు ఇండియాలో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి అయిన ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఎలా స్పందిస్తున్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ ప్లిప్‌కార్ట్ సేల్ అనౌన్స్ చేస్తే అమెజాన్ కూడా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటుందేమో చూడాలి
  
 

జన రంజకమైన వార్తలు