• తాజా వార్తలు

సొంత వ్యాపారం కోసం ఉద్యోగుల‌కు 10 ల‌క్ష‌లు ఇస్తున్న ఏకైక సంస్థ అమెజాన్!

అమెజాన్‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ‌. ఇందులో ప‌ని చేసే ఉద్యోగులు కూడా భారీగా ఉంటారు. అయితే ప్ర‌తిసారి ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. అయితే ఇది వినియోగ‌దారుల కోసం కాదు త‌మ ఉద్యోగుల కోసం! అయితే ఇది కూడా ప‌రోక్షంగా త‌మ సంస్థ‌కు ఉప‌యోగ‌ప‌డేలాగే అమెజాన్ ప్లాన్ చేసింది. మ‌రి ఈ కొత్త కార్య‌క్ర‌మ‌మేంటో చూద్దామా..

డ‌బ్బులిస్తాం.. ప్యాక్ చేయించండి
ప్ర‌స్తుతం అమెజాన్ వినియోగ‌దారులు ఆర్డ‌ర్ చేసిన వ‌స్తువుల‌ను ప్యాక్ చేయ‌డం కోసం బ‌య‌ట సంస్థ‌ల‌కు కన్‌సైన్‌మెంట్ ఇస్తోంది. దీని వ‌ల్ల అద‌నంగా చాలా డ‌బ్బులు అవుతున్నాయి. ఇదే వినియోగ‌దారుల‌పై డెలివ‌రీ ఛార్జీల పేరిట రుద్దాల్సి వ‌స్తుంది. ప్రైమ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అయితే డెలివ‌రీ ఛార్జీలు కూడా ఉండ‌వు. అందువ‌ల్ల అమెజాన్‌పై ఎక్కువ భారం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో తామే సొంతంగా ప్యాకింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకుంటే ఇబ్బందులు ఉండ‌వ‌ని భావిస్తోంది. దీనిలో భాగంగా త‌మ ఎంప్లాయిస్‌కు ఒక ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఎవ‌రికీ వాళ్లు డెలివ‌రీ స‌ర్వీసు ప్రొగ్రామ్‌లో చేరితే చాలు రూ.10 ల‌క్ష‌లు ఇస్తామ‌ని చెప్పింది. ఉద్యోగుల‌కు నిజంగా ఇది బంప‌ర్ ఆఫ‌రే.

మాజీ ఉద్యోగుల‌కు కూడా..
డెలివ‌రీ ప్రొగ్రామ్‌లో అన్నిటిక‌న్నా ముఖ్య‌మైంది మాజీ ఉద్యోగుల‌కు మ‌ళ్లీ సంపాదించుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డం. అమెజాన్ గూడ్స్‌ను వాళ్లు సొంతంగా డెలివ‌రీ చేసేలా ప్యాకింగ్ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసుకుంటే చాలు వాళ్ల‌కు రాజీనామా చేసే స‌మ‌యంలో ఎంత గ్రాస్ శాల‌రీ వ‌స్తుందో అంతా ఇస్తామ‌ని ఈకామ‌ర్స్ సైట్ వెల్ల‌డించింది. కేవ‌లం ఉద్యోగుల‌కు మాత్ర‌మే కాదు బ‌య‌ట వాళ్ల‌ను కూడా అమెజాన్ ఈ ప్రొగ్రామ్‌లో భాగ‌స్వాములు అయ్యేలా చేస్తుంది. మిల‌ట‌రీలో ప‌ని చేసి రిటైర్ అయ్యే వాళ్లు ఇంట్లోనే కూర్చొని 10 వేల డాల‌ర్లు సంపాదించే అవ‌కాశాన్ని ఇస్తోంది అమెజాన్‌. ప్యాకింగ్‌తో పాటు డెలివ‌రీ వ్యాన్‌ల‌ను కూడా ఏర్పాటు చేసుకుంటే మ‌రింత డ‌బ్బులు అద‌నంగా ల‌భిస్తాయి. ఈ వ్యాన్‌లు బ్లూ క‌ల‌ర్‌లో ఉండి అమెజాన్ ప్రైమ్ లోగోతో ఉండాలి. డెలివ‌రీ పార్ట‌న‌ర్‌లుగా చేరితే ఏడాదికి 3 ల‌క్ష‌ల డాల‌ర్లు సంపాదించే అవ‌కాశం ఉంద‌ని అమెజాన్ తెలిపింది. 2018 నుంచే అమెజాన్ ఈ త‌ర‌హా బిజినెస్‌ను స్టార్ట్ చేసినా.. ఇటీవ‌లే మ‌ళ్లీ భారీ స్థాయిలో దీన్ని ప్ర‌చారంలో తెచ్చింది. 

జన రంజకమైన వార్తలు