• తాజా వార్తలు

అమెజాన్ సేల్‌.. మొబైల్స్‌పై అదిరే ఆఫ‌ర్లు

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ ఈ రోజు ప్రారంభ‌మైంది. ఈ నెల 14 వ‌ర‌కు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. తొలిరోజు ఎల‌క్ట్రానిక్స్‌, గాడ్జెట్స్‌, మొబైల్స్‌పై అమెజాన్ భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు సిటీ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డ్‌ల ద్వారా యాప్ తో ప‌ర్చేజ్ చేస్తే 15% క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది.
ఐఫోన్ 7 .. 44వేల‌కే
అర‌వై వేల రూపాయ‌ల వ‌ర‌కు విలువ చేసే 32 జీబీ ఐఫోన్ 7 మొబైల్ ఫోన్‌ను ఆఫ‌ర్‌లో 43,999 రూపాయ‌ల‌కే ఇస్తున్న‌ట్లు అమెజాన్ ప్ర‌క‌టించింది. 16 జీబీ స్టోరేజ్ క‌లిగిన మోటో జీ 4 ప్ల‌స్‌పైనా 2వేల రూపాయ‌ల త‌గ్గింపు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం దీని ధ‌ర 13,499 రూపాయ‌లు ఉండ‌గా 11,499 రూపాయ‌ల‌కే ఇస్తామ‌ని అనౌన్స్ చేసింది. కూల్ పాడ్ నోట్ 5పై వెయ్యి రూపాయ‌లు డిస్కౌంట్ లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ సీ 7 ప్రో మీద నాలుగు వేల డిస్కంట్‌తో 26వేల‌కే ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో కొనుక్కోవ‌చ్చు. ఎల్ వైఎఫ్‌లో కొన్ని మోడ‌ల్స్‌పై 10 వేల రూపాయ‌ల‌కు పైగా డిస్కౌంట్ ఇస్తుంది. అంతేకాదు రెడ్‌మీలో బాగా ఫేమ‌స్ అయిన స్టార్టింగ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ షియోమి 4ఏ ను అమెజాన్ ప్రైం మెంబ‌ర్లు ప్రీ ఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు.
వేర‌బుల్స్‌పైనా డిస్కౌంట్
వేర‌బుల్స్‌పైనా డిస్కౌంట్లు ఇస్తోంది. యాపిల్ వాచ్ సిరీస్‌లో 138 ఎంఎం స్మార్ట్‌వాచ్‌ను నాలుగు వేల డిస్కౌంట్‌తో 19,900కే అందిస్తోంది. యాపిల్ మాక్ బుక్ ఎయిఒర్ 13.3 ఇంచెస్ ల్యాప్ టాప్‌పై దాదాపు 28 వేల రూపాయ‌ల డిస్కౌంట్ ప్ర‌క‌టించింది.

జన రంజకమైన వార్తలు