• తాజా వార్తలు

విస్మ‌రించ‌డానికి వీల్లేని అమెజాన్ సోష‌ల్ మీడియా సైట్‌.. స్పార్క్ 

ఈ- కామ‌ర్స్ లెజెండ్ అమెజాన్.. స్పార్క్ పేరుతో  కొత్త‌గా ఓ సోష‌ల్ మీడియా సైట్ ను లాంచ్ చేసింది.  Instagram meets e-commerce అనే ఇనీషియేటివ్‌తో దీన్ని గ‌త నెల‌లో స్టార్ట్ చేసింది. దీంతో క‌స్ట‌మ‌ర్లు అమెజాన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు లైక్ మైండెడ్ పీపుల్‌తో చిట్‌చాట్  చేసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల అమెజాన్‌లో షాపింగ్  పెరుగుతుంద‌ని కంపెనీ భావిస్తోంది. .  ఫ్యూచ‌ర్‌లో అమెజాన్‌కు ఇది పెద్ద ఎసెట్ అవుతుంద‌ని  అంచ‌నా. 
ఇన్‌స్టాగ్రామ్‌తో ఇన్‌స్పైర్  
స్పార్క్ అమెజాన్ సొంత ఐడియా కాదు. ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి ఇన్‌స్పైర్ అయి దీన్ని డిజైన్ చేశారు. అంతేకాదు Pinterest  ఫీచ‌ర్లు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సైట్లో ప్రొడ‌క్ట్స్ ఫొటోలు మాత్ర‌మే ఉంటాయి. దాన్ని  స్క్రోల్ చేసి కంటెంట్‌ను చదువుకోవ‌చ్చు.  ఇందులో చాలా కంటెంట్ యూజ‌ర్స్ పెట్టేదే. కొంత కంటెంట్ మాత్రం స్పాన్స‌ర్డ్ .  పోస్ట్ న‌చ్చితే యూజ‌ర్ smile సింబ‌ల్‌ను క్లిక్ చేయొచ్చు. ఇది ఫేస్‌బుక్‌లో లైక్‌లాంటిద‌న్న‌మాట‌.  
స్పార్క్‌ను ఎందుకు లాంచ్ చేశారంటే..  
ఇది పూర్తిగా అమెజాన్ వ్యాపారాన్ని పెంచుకునే ప్లాన్‌. త‌మ ప్రొడ‌క్ట్స్ గురించి ఇత‌ర సోష‌ల్ మీడియా ఛాన‌ల్స్‌లో ప్ర‌చారం చేసుకోవ‌డం కంటే త‌మ‌కే సొంతంగా అలాంటి ఒక సూట్ ఉంటే బాగుంటుంద‌నే ఉద్దేశంతో స్పార్క్‌ను క్రియేట్ చేశారు.  లైక్‌మైండెడ్ పీపుల్ మ‌ధ్య సంభాష‌ణ ఫ‌లిస్తే  ప్రొడ‌క్ట్‌ను వారు కొన‌డానికి ఎక్కువ అవ‌కాశాలుంటాయ‌న్న‌ది స్పార్క్ వెన‌క ఉన్న ఆలోచ‌న‌. అంతేకాదు క‌స్ట‌మ‌ర్లు స్పార్క్‌లో ఎంట‌ర్ అయ్యేట‌ప్పుడు 5 ఇంట‌రెస్ట్‌ల‌ను క‌నీసం మెన్షన్ చేయాలి. ఫ్యాష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ ఇలాంటివి. దీనివల్ల క‌స్ట‌మ‌ర్లు ఎక్కువ‌గా ఏం కోరుకుంటారో అమెజాన్ ఈజీగా ఐడెంటిఫై చేయ‌గ‌లుగుతుంది.  
మొబైల్ యాప్‌..
ప్ర‌స్తుతానికి ఐవోఎస్‌లోనే స్పార్క్ ల‌భిస్తుంది.  ఆండ్రాయిడ్‌కి రావాలంటే ఇంకా టైం ప‌డుతుంది . 
* ఐవోఎస్‌లో దీన్ని స్టార్ట్ చేయాలంటే అమెజాన్ యాప్ ఐకాన్‌తో ఫైర్ అప్ చేయాలి. లేదంటే అమెజాన్ యాప్  నావిగేష‌న్ మెనూలోని Programs & Features లోకి వెళ్లి   Amazon Spark option క్లిక్ చేయాలి. 
* సింపుల్ రిజిస్ట్రేష‌న్ ఉంటుంది. దాన్ని పూర్తి చేయాలి.
* క‌నీసం ఐదు ఇంట‌రెస్ట్‌ల‌ను సెలెక్ట్ చేయాలి.  
* మీ ఇంట‌రెస్ట్‌ల‌కు అనుగుణంగా మీకు ఫీడ్ వ‌స్తుంది.  కావాలంటే ఆ ఫీడ్‌లో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి ఆర్డర్ చేయొచ్చు.  

జన రంజకమైన వార్తలు