• తాజా వార్తలు

అమెజాన్‌కు న‌చ్చ‌ని, మ‌న‌కు డ‌బ్బు ఆదా చేసే 5 అద్భుత‌మైన యాప్స్ 


అమెజాన్‌లో ఏదో వస్తువు కొన్నారు. త‌ర్వాత రెండు రోజుల‌కే దానిమీద 20% డిస్కౌంట్ వ‌చ్చింది. అరే రెండు రోజులు ఆగితే బాగుండేది అనుకుంటున్నారా?  రివ్యూ చూసి ఈ ప్రొడ‌క్ట్ బాగుంద‌ని కొనేశా. ఇప్పుడు ఇది స‌రిగ్గా ప‌ని చేయ‌ట్లేదు అన్న‌ది మీ కంప్ల‌యింటా? ఫ‌లానా ప్రొడ‌క్ట్ కొనేట‌ప్పుడు ఎవ‌ర్న‌యినా అడ‌గాల్సింది.. అది బాగుండ‌ద‌ని చెప్పి వాళ్లు న‌న్ను ఆపేసేవారు అని ఇప్పుడు ఫీల‌వుతున్నారా? ఇలా అమెజాన్‌లో షాపింగ్‌కు సంబంధించి మీరు ఫీల‌య్యే అంశాలకు మందులా ప‌ని చేసే అద్భుత‌మైన యాప్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే అమెజాన్‌లో షాపింగ్ మీరు మ‌రింత చౌక‌గా, క‌న్వీనెంట్‌గా, యూజ్‌ఫుల్‌గా, ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. అవేంటో ఓ లుక్కేసేయండి మ‌రి..  


1. పారిబ‌స్‌ Paribus 
వెబ్‌, ఐవోఎస్‌ల్లో ఉండే ఈ యాప్ అమెజాన్ యూజ‌ర్ల‌కు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.  మీరు వ‌స్తువు కొన్న త‌ర్వాత రెండు, మూడు రోజుల్లోనే  దానిమీద ఏదైనా డిస్కౌంట్ వ‌స్తే దాన్ని ఆటోమేటిగ్గా క్లెయిం చేయ‌డంలో పారిబ‌స్ ఉప‌యోగ‌ప‌డుతుంది. పారిబ‌స్‌లో మీరు సైన్ అప్ అయి, మీ అమెజాన్ ఆర్డ‌ర్ రిసీట్స్ వ‌చ్చే ఈ మెయిల్ ఐడీ ఇన్‌బాక్స్‌కు యాక్సెస్ ఇస్తే చాలు. పారిబ‌స్ మీ రీసెంట్ ప‌ర్చేజ్‌ను గుర్తించి దానిపైన త‌ర్వాత ఏమైనా ప్రైస్ క‌ట్ వ‌చ్చినా ఆ అమౌంట్ మీ అకౌంట్‌కు  వ‌చ్చేలా చేస్తుంది.  
అంతేకాదు లేట్ డెలివ‌రీస్‌, ప్రైస్‌, మ్యాచ్ గ్యారంటీల‌కు సంబంధించి అమెజాన్ క‌స్ట‌మ‌ర్ కేర్‌ను కాంటాక్ట్ చేయ‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 

2. ద ఫోర్క్‌లిఫ్ట్ The Forklift  
అమెజాన్ వేర్‌హౌస్ డీల్స్ అంటే డిస్కౌంటెడ్ ఐట‌మ్స్ (ప్రీ ఓన్డ్ లేదా ఓపెన బాక్స్ ఐట‌మ్స్‌) గురించి బోల్డంత స‌మాచారాన్ని మ‌న‌కు అందించేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. వెబ్‌లో మాత్ర‌మే ఉండే ఈ యాప్ ఇలాంటి డిస్కౌంట్ డీల్స్ ఇన్ఫోను మొత్తం మీకు తెలియ‌జేస్తుంది. ఏ వ‌స్తువ కావాలో ఎంత ప్రైస్‌లో కావాలో సెర్చ్ ఈజీ చేసే ఫిల్ట‌ర్స్ కూడా ఉంటాయి.  దీన్ని ఉప‌యోగిస్తే త‌క్కువ ప్రైస్‌లో మంచి ఐట‌మ్స్ సొంతం చేసుకోవ‌చ్చు.  
3. రివ్యూ మెటా  (ReviewMeta) 
 ఈ-కామ‌ర్స్ సైట్స్‌లో ప్రొడ‌క్ట్‌లు అమ్ముకోవ‌డానికి కంపెనీలు అది బాగుంద‌ని ఫేక్ రివ్యూలు కూడా పెడుతుంటాయి.  వెబ్‌, క్రోమ్‌, ఫైర్‌పాక్స్‌ల్లో ఉండే  రివ్యూ మెటా ను ఉప‌యోగించి రివ్యూల్లో నిజ‌మైన‌వేంటి, ఫేక్ ఏంటి ఈజీగా తెలుసుకోవ‌చ్చు. ఏ ప్రొడ‌క్ట్ సంబంధించిన యూఆర్ ఎల్ నైనా కాపీ చేసి రివ్యూమెటాలో పోస్ట్ చేసి అమెజాన్‌లో దాని రివ్యూస్ ను ఫుల్ ఎనాలిసిస్ చేసి బ‌మీకు అందిస్తుంది. దాన్ని బ‌ట్టి ఆ ప్రొడ‌క్ట్ కొనాలో లేదో డిసైడ్ చేసుకోవ‌చ్చు. ReviewMeta క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ల‌కు బ్రౌజ‌ర్ ఎక్స్‌టెన్ష‌న్‌గా కూడా ఉంటుంది. అయితే దీన్ని ఇన్‌స్టాల్  చేయ‌కుండా కేవ‌లం బుక్ మార్క్ చేసుకుని వాడుకోవాలి.  
4. సో కూల్ So Cool 
వెబ్‌లో మాత్ర‌మే ఉండే ఈ యాప్‌తో అడ్వాన్స్‌డ్ సెర్చ్ చేసుకోవ‌చ్చు. అమెజాన్‌లో లేక‌పోతే ఆ వ‌స్తువు జెట్‌, వాల్‌మార్ట్‌, టార్గెట్‌ల్లో ఎక్క‌డ దొరుకుతుందో కూడా సెర్చ్ చేసుకోవ‌చ్చు.  ప్రైస్‌, ఫీచ‌ర్స్ వంటివాటి కోసం ఫిల్ట‌ర్స్ కూడా ఉన్నాయి.  

5. అమెజాన్ కాంటెంప‌లేట్ Amazon Contemplate 
అమెజాన్‌లో వేలాది ప్రొడ‌క్ట్‌లు ఉంటాయి. వాటిని చూస్తూ ఉంటే కొన‌కుండా ఆగలేం. మీ కార్డ్ నెంబ‌ర్‌, డిటెయిల్స్‌, షిప్పింగ్ అడ్ర‌స్‌, మీ ప్రిఫ‌రెన్సెస్ అన్నీ అమెజాన్ యాప్‌, సైట్‌లో రికార్డ‌యి ఉంటాయి. మీరు ఏదైనా వ‌స్తువు చూసి ఇష్ట‌ప‌డితే సింగిల్ క్లిక్‌తో కొనేసుకోవ‌చ్చు. కానీ ఇలాంటి వాటిలో చాలా డీల్స్ త‌ర్వాత ఎందుకు కొన్నామా అనిపిస్తుంటాయి.  అమెజాన్ కాంటెంప‌లేట్ మీ కొనుగోలు ట్రాన్సాక్ష‌న్ అడ్డుకుంటుంది. ఈడీల్ క‌రెక్టా కాదో చూసుకోండ‌ని 30 సెక‌న్ల టైం ఇస్తుంది. ఆ క్ష‌ణంలో ఆలోచించి వ‌ద్ద‌న‌కుంటే వ‌దిలేయొచ్చు. కాదు వ‌ర్త్‌ఫుల్ అనుకుంటే కొనుక్కోవ‌చ్చు. సో సెకండ్ థాట్‌కు ఛాన్స్ ఇస్తుంద‌న్న‌మాట‌.  ఒపెరా, క్రోమ్ బ్రౌజ‌ర్ల‌లో ప‌ని చేస్తుంది. 

జన రంజకమైన వార్తలు