• తాజా వార్తలు

అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ నెల‌రోజుల ఫ్రీ ట్ర‌య‌ల్‌.. పొందండి ఇలా..


అమెజాన్ ప్రైమ్ సేల్ ఇండియాలో తొలిసారి నిన్న‌, ఈ రోజు (జూలై 10,11) జ‌రుగుతోంది. ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు చాలా ఉన్నాయి. అయితే దీనిలో ప్రైమ్ మెంబ‌ర్ల‌కే  ఎంట్రీ.  సంవ‌త్స‌రానికి 499 రూపాయ‌ల మెంబ‌ర్ షిప్ ఫీజ్‌తో అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ అయితే ఆ సైట్ నుంచి చాలా ఆఫ‌ర్లు వ‌స్తాయి. ఇప్పుడు ఒక నెల ఫ్రీ ట్ర‌య‌ల్‌ను కూడా అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. ఆ త‌ర్వాత కావాలంటే మెంబ‌ర్‌షిప్ ఫీజు క‌ట్టి కంటిన్యూ కావ‌చ్చు. లేదంటే వ‌దిలేయొచ్చు. 

ప్రైమ్ మెంబ‌ర్ అయితే లాభ‌మేంటి?  
ఇదిఅమెజాన్ లాయ‌ల్టీ ప్రోగ్రామ్‌. దీన్నితీసుకున్న యూజ‌ర్ల‌కు
* అమెజాన్ సేల్ ఆఫ‌ర్లు, లైట్నింగ్ సేల్స్‌కు మిగిలిన‌వారికంటే ముందే యాక్సెస్ వ‌స్తుంది
* ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్స్ 
* ఫ్రీ షిప్పింగ్‌, కొన్ని ప్రొడక్ట్స్‌పై ఫ్రీ నెక్స్ట్ డే డెలివ‌రీ ల‌భిస్తాయి 

* అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కింద మూవీస్‌ను ఆఫ్ లైన్లో కూడా చూడడానికి యాక్సెస్ ల‌భిస్తుంది.
 
 
అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ కావ‌డం ఎలా?
* అమెజాన్ వెబ్‌సైట్ లేదా అమెజాన్ యాప్ (ఆండ్రాయిడ్ / ఐవోఎస్‌) ఓపెన్ చేయాలి.
* ఇప్ప‌టికే మీకు అమెజాన్‌లో అకౌంట్ ఉంటే సైన్ ఇన్ కావాలి. లేదంటే సైన్ అప్ చేయాలి.
* యాప్ లో అయితే  ఎడ‌మ‌చేతి వైపు టాప్ లో ఉన్న మెనూ ఐకాన్‌ను టాప్ చేయాలి. త‌ర్వాత  Try Primeపై టాప్ చేయాలి. వెబ్‌లో అయితే Try Prime మీదికి మౌస్ ను తీసుకెళ్లి Try Prime Free అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. 
ఇప్పుడు మీరు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ అయిపోయినట్లే. మీ  అమెజాన్ వ‌న్ మంత్ ఫ్రీ ట్ర‌య‌ల్ ప్రారంభ‌మైన‌ట్లే.  ఇది ఫ్రీ ట్ర‌య‌ల్ కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఏం పే చేయ‌క్క‌ర్లేదు.  నెల రోజులు అమెజాన్ ప్రైమ్‌ను యూజ్ చేసిన త‌ర్వాత ఇది ఆటోమేటిగ్గా మీ షాపింగ్ కార్ట్‌కు యాడ్ అయిపోతుంది. అప్పుడు మీరు 499 రూపాయ‌ల యాన్యువ‌ల్ స‌బ్‌స్క్రిప్ష‌న్ పే చేయొచ్చు. కాద‌నుకుంటే వ‌దిలేస్తే మీ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్  క్యాన్సిల్ అయిపోతుంది.  

జన రంజకమైన వార్తలు