ఐ ఫోన్ కొంటే క్యాష్‌బ్యాక్ ఇస్తామని ఇవ్వనందుకు ఈ- కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్. ఇన్‌పై హైదరాబాద్ కన్జ్యూమర్ ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాష్ బ్యాక్ హామీ నెరవేర్చనందుకు కన్జ్యూమర్‌కు రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది.
ఐఫోన్ కు క్యాష్ బ్యాక్ ఇవ్వలేదని కంప్లైంట్
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన సుశాంత్ భోగా 2014 డిసెంబర్‌లో ఐఫోన్ 5ఎస్ కొన్నారు. సిటీబ్యాంక్ క్రెడిట్‌కార్డుతో కొంటే రూ.6,500 అదే ఖాతాలో తిరిగి జమవుతుందని అమెజాన్.ఇన్ వెబ్‌సైట్ ప్రకటించింది. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే డబ్బు చెల్లించి ఫోన్ కొన్నా. కానీ నాకు క్యాష్‌బ్యాక్ రాలేదని భోగా కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టాడు. 2015లో అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ మండలిలో కంప్లయింట్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో అమెజాన్.ఇన్ ఎండీపై హైదరాబాద్ జిల్లా ఫోరానికి వచ్చారు. అయితే ఈ ఆఫర్‌కు, వెబ్‌సైట్‌కు సంబంధం లేదని అమెజాన్ వాదించింది. తాము సెల్లర్‌ను, బయ్యర్‌ను కలిపే ప్లాట్‌ఫారంగా మాత్రమే అమెజాన్ పనిచేస్తుందన్నారు. క్యాష్‌బ్యాక్ ఆఫర్ థర్డ్‌పార్టీ ఇష్యూ అని చెప్పింది.
మీదే బాధ్యతన్న ఫోరం
అయితే అమెజాన్ వాదనను ఫోరం తప్పుబట్టింది. మీ వెబ్‌సైట్‌పై నమ్మకంతో మీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు కస్టమర్లు ఎట్రాక్ట్ అవుతారు. మీ వెబ్‌సైట్ వేదికగా వస్తువులు థర్డ్ పార్టీ ఎవరికీ తెలియదు. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటి ఏ ఆఫర్లు ప్రకటించినా అవి అమలుకాకపోతే రెస్పాన్స్‌బులిటీ మీదేనని చెప్పింది. అలా కాకపోతే ఇది ఇల్లీగల్ బిజినెస్ అవుతుందని ఘాటుగా కామెంట్స్ చేసింది. కస్టమర్ సుశాంత్‌కు అమెజాన్ రూ.15వేల కాంపెన్సేషన్, ఖర్చులకు మరో 5 వేలు.. మొత్తం 20 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.