మొబైల్ లవర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 5 ఇండియన్ మార్కెట్లో ఈ రోజు రిలీజ్ అయింది. 6జీబీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్లతో విడుదలయిన ఈ ఫోన్‌కు సూపర్ ఫీచర్లతో తీర్చిదిద్దింది. 6జీబీ ర్యామ్ ఫోన్‌లో 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ వేరియంట్‌లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది. రియర్ సైడ్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 16 ఎంపీ కెమెరా.. EIS సపోర్ట్, 1.12- మైక్రాన్ పిక్సెల్ Sony IMX398 సెన్సార్‌తో వచ్చింది. టెలిఫోటో కెమెరా ఫీచర్, 1- మైక్రాన్ పిక్సెల్ , Sony IMX350 తో కూడిన 20 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 1- మైక్రాన్ పిక్సెల్స్‌తో Sony IMX371 సెన్సార్, ఈఐఎస్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు. ఫింగర్‌ప్రింట్ సెన్సర్ హోంబటన్ మీదే ఉంది. కాబట్టి ఫోన్‌ను 0.2 సెకన్లలో అన్‌లాక్ చేయొచ్చు.
ఇవీ ఆఫర్లు
ప్రారంభ ఆఫర్‌గా అమెజాన్ వన్‌ప్లస్ 5మీద చాలా ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో పర్చేజ్ చేస్తే 1500 రూపాయలు క్యాష్‌బ్యాక్ ఇస్తుంది.
* కిండిల్ ఈ బుక్స్ పై 500 వరకు ప్రమోషన్ క్రెడిట్ వస్తుంది.
* ఫోన్‌పై 12 నెలల ఫ్రీ యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్
* వొడాఫోన్ ఎక్స్‌క్లూజివ్ డేటా ప్లాన్స్
యూఎస్ కన్నా మన దగ్గరే ధర ఎక్కువ
6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర 32,999 రూపాయలు కాగా 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర 37,999 రూపాయలు అని కంపెనీ ప్రకటించింది. అయితే యూఎస్‌లో వీటి ధరలు మన కంటే తక్కువగా ఉన్నాయి. అక్కడ 6జీబీ / 8జీబీ ర్యామ్ వేరియంట్ల ధర ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 31,000.. 35,000 రూపాయలు. అయితే యూరప్‌తో పోల్చితే మన దగ్గర ధర 4వేలు తక్కువ.